చరవాణి చేతబట్టి
చక్షువులతో బంధించేస్తూ
శ్రవణములు శ్రమించేట్టు
ఇంట బయట ఏడనైనా
సెల్లు ఫోనులో సొల్లు కబుర్లతో
సమయమంతయూ వృదా
చేయగా ఏమి వచ్చే రా
వినరా ఓ నరుడా
చరవాణి చేతనుంచగా
మన బ్రతుకు గీతను మార్చగలముగా
చరవాణి చదువు కొరకు ఉపయోగించరా
చరిత్రలోనే నీకై పుటను పుట్టేంచదవురా…
– కోమలి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~