విదియనాటి
చంద్రరేఖలా వుంది నీ నగుము
పున్నమినాటి
వెన్నెల కలువలా వుంది నీమెాము
ఎగిరొచ్చే పిల్లగాలితో….
పచ్చిపాల మీగడలా
పసుపు ముద్దబంతిలా
మరుమల్లె మాలికలా
సన్నజాజి పువ్వులా
విచ్చిన సొగసులా వుంది నీ సోయగం
నింగిన కాచే తారకలతో…
నీలిమబ్బు హంసలా
నివురుగప్పు మంచులా
నీటినతేలిన తామరలా
నీటిన దాగిన ముత్యంలా
నీ ఊహల నిచ్చనకు ఊపిరిపోసే ప్రేమ ప్రాణంలా….
నీ ప్రణయ తనువును తాకే మధనబాణంలా
నేను నీ జన్మకు తోడునని
నను నమ్మి గుర్తిస్తేచాలు
-డా!! బాలాజీ దీక్షితులు పి.వి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~