నేను పుట్టాను
పరిపుష్టి గా
చాలా బరువుగా
దాయాదులు కుళ్ళుకునేలా
ఎదుగుతున్న నాకు బలమైన ఆహారం తొలినాళ్ళలో
మరునాళ్ళల్లో
నన్ను మరుభూమికి పంపే యత్నం
నా బలమే
నా వాళ్ళకి దన్ను
నేను బలహీనం
నా వాళ్ళు తలవంచు
నా బలం
నా స్వంత ఆస్తులు
అమ్మకానికి పెట్టి
నన్ను అశక్తురాలి గా మలచే ఏళ్ళుగా
అర్థ శాస్త్ర ఓనమాలు తెలియని మౌఢ్యం లో
అబద్దాల వల్లె లో నిండా ముంచి
ఒకరి పై ఒకరిని ఉసి గొల్పి ఏలుతూ
నన్ను దిగజార్చి
నా రూపాన్నే మార్చేస్తుంటే
మూగ వేదనలో రూపాయి ని నేను!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~