మహిళా!!?(కవిత ) -గిరి ప్రసాద్ చెలమల్లు

అరిటాకు పువ్వు
సుకుమారం
నా మనో కొలమానం
ఎవ్వడు కొలిచి చెప్పాడో!!

అర్వ చాకిరి తో
అణువణువూ పులిసి పోయి
ఇంటి కంటె గోడలా మిగిలి పోయా
మూలన కూకున్న చీపురుకైనా విశ్రాంతి!!
నాకు లేదు విరామం!!

కోరిక
నాకూ అతనికి
అయినా నన్నే అణిగి మణిగి ఉండమన్నారే!!
కట్టుకున్నోడు పోతే
వాడితోనే చితి పై తోసారే
వాడినెందుకు తోయలేదు!!
పూజకు పనికి రాని పువ్వ నే ముద్ర
దానెనుక కథ నిడివి పెద్దది లే
కౌమార దశలో పెళ్ళి
అనుభవించే హక్కు వాడికి అనాదిగా

అక్షరం నా దరిచేయనీయక
నా శరీర నిర్మాణం పై ఆంక్షలు
ఇంటికే పరిమితం
బైట అడుగెడితే పాడై పోతానన్న సామెతలు నాపై కోకొల్లలు

జంతువులు పక్షులు స్వేచ్ఛగా
ఆడ మగ పొరపొచ్చాలు లేకుండా
మనిషి మనిషి కే ఎందుకు పంజరం
జీవికి ఓ దైనందిన అవసరం
అదే మానవ వికాస పునాది
గ్రహించలేని మనిషి అణగ తొక్కే
మూలం బ్రాహ్మణీయ సమాజం

ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చినా
ఎగాదిగా ఉపన్యాసాలు దంచినా
మూల సంహారం కానిదే
నేనెదగను
ఎదుగుతున్నా సంకెళ్ళు అడుగడుక్కి

 

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో