బడికి
ముందస్తు సెలవులు
ఇళ్ళలో
సీతాకోకల స్వచ్చంధ కలకలం
***
సిరిసిల్ల
బస్ ఎక్కాను
జ్ఞాపకాల వయ్యిలో
వేల పుటల రెపరెపలు
***
నేతన్న , రైతన్న
అర్ధంతరంగా రాలిపోతూ
కష్టాన్ని
నమ్ముకున్నారాయే !
***
నీ వ్యాసాలు
బాగున్నాయని ఫోన్ !
కడుపు నిండింది
నానీల ‘నాన్న’కదా !
***
దూరాన్ని చూసి
బెదరకు
చీమల బారులు
చులకన చేస్తాయి మరి !
***
అమ్మ సేవలకు
వెల కట్టలేం …
వృద్ధాప్యంలో
వెలి వేయనకండి చాలు !
***
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~