అమ్మపై కురిసిన కరుణ(కవిత)భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

ప్రయాణంలో కడవరకు నీతో ఉంటానని
ప్రమాణంచేసి మరీ తాళికట్టిన భర్త
ఆ విషయం ఆయనకు కూడా తెలియకుండా
మధ్యలోనే మౌనంగా వెళ్ళిపోయినపుడు
అమ్మ వేదన చెందిందే తప్ప
జీవితంలో ఓడిపోయాననుకోలేదు.

ఆడపడుచులు ,అత్తమామలు
ఆరళ్ళు పెట్టినా ,అసహ్యించుకున్నా
ఓర్పుతో భారించిందే తప్ప
ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని,
తన ప్రేమను,సేవలను ప్రతి క్షణం పొందిన పిల్లలు
మధ్యలోనే మైకం కమ్మిన వారిలా
తనని విడిచి వారి దారి వారు చూసుకున్నప్పుడు
అమ్మ దుఃఖాన్ని పొందిందే తప్ప,
ఒంటరితనాన్ని అలవాటు చేసుకుందే తప్ప
తను ఓడిపోయానని అనుకోలేదు.

సేవలు పొందిన మనుమలు,మనుమరాళ్ళు
పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా
ఇది సహజమేలే అని అనుకుందే తప్ప
అయ్యో ఓడిపోయానే అని అనుకోలేదు.

తనవాళ్ళనుకున్నవారు తప్పించుకున్నా,
మనవాళ్ళనుకున్నవారు మౌనం అయినా
అమ్మ ఓడిపోయానని అనుకోలేదు.

నాడు వాడుకున్నవారు,తనతో ఆడుకున్న వారు
ఆనాడు వేడుకున్న వారు
ఇప్పుడు విడిచిపోయినా,తనను మరిచిపోయినా
అమ్మ ఓడిపోయానని అనుకోలేదు.

చివరి రోజుల్లో తనను ఉంచుకోవటానికి
కసాయి కొడుకులు సాకులు వెదుకుతుంటే,
కర్కశపు కోడళ్ళు బాకుల్లాంటి మాటలతో
తన యదను తూట్లు పొడుస్తుంటే మాత్రం
అమ్మ గుండె తట్టుకోలేకపోయింది,
ఎక్కువ కాలం కొట్టుకోలేకపోయింది.

తను కనిపెంచిన,తనకు కనిపించిన….
వారి కరుణను పొందలేకపోయిన అమ్మ,
వారి మనఃస్థితులను ఆకళింపు చేసుకున్న అమ్మ,
శాశ్వతం గా వెళ్ళిపోదామని గట్టిగా నిర్ణయించుకుంది.
ఆ అనంతుడినది కదిలించివేసింది.
అతనికి భరించలేని చింతయ్యింది.
అతని మనసు స్పందించింది.
తన అనంతమైన ప్రేమను అమ్మకు అందించింది.

అంతే!……అప్పుడు జరిగినది నిజంగా వింతే!
ఎవ్వరూ ఉహించని విధంగా అతనిప్రేమ
అమ్మను ఒకమంచిరోజున పక్కకు ఒరిగిపోయేలా,
అతని కరుణలో అమ్మ ఆనందంగా కరిగిపోయేలా,
అకస్మాత్తుగా అమ్మ రూపం భువిపై చెరిగిపోయేలా చేసింది.
దేవతని మరోసారి దేవతగా అంగీకరించినట్లు అయ్యింది.

-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో