అంగన్ వాడి
ఆటల బడి
ఇప్పుడు
అమృతాన్ని పంచె అమ్మ ఒడి
***
కొద్ది రోజులైనా
కొవ్వొత్తిలా బతకాలి
అది బతుకుల్ని
వెలిగిస్తుంది
***
‘పంచె కట్టు ‘లోన
ప్రపంచాన మొనగాడు
మా సినారె
తెలుగురేడు
***
కరోనా
నీకు కృతజ్ఞతలు !
ఎన్ని
నిజాలను చూపిస్తున్నావో !
***
భగీరధుడు
మన మధ్యలోనే…..
గోదావరి
బీడు భూములకు మళ్ళింది
***
నిజమెప్పుడు
చేదుగానే ఉంటది
అబద్దమే
తీయ తీయగా …!
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~