ఆగని కాలం ముందు
అడుగులు పడుతూనే ఉంటాయి !
చుట్టుముట్టిన
అవహేళనలు
అవమానాలు
పడదోయాలని పాకులాడుతునే ఉంటాయి !
నమ్మలేని నవ్వులు….
ఒప్పలేని మాటలు
పక్కలో బళ్ళెమై పొడుచుకు తింటుంటాయి !
ఉదయం తనదవుతుందని
కలలు కన్న రేయి కాలంలో కరిగిపోతుందని తెలిసి
ఊపిరి ఉప్పెనగా మార్చి
అడుగు అడుగు వేసుకుపోతున్నా
ముసుగేసుకున్న కసి కళ్ళు అడ్డుపడుతూనే ఉంటాయి !
రంగుల ఋతువులు
కాలం కోసం పరుగెడుతున్నట్లు
అలుపెరగని అవనిపై
శ్రమిస్తూనే ఉన్నా…నిప్పుల మంటలు ఎదురవుతున్నా !
కాలం కొమ్మపై
చరిత్ర రాయటానికి
-డా!! బాలాజీ దీక్షితులు పి.వి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~