మొత్తం ఆ వీధికంతా
నా ఒక్క కొంపలోనే దీపం లేంది
ఆ చీకటే చాలు నీకు
నా చిరునామా చెప్పేస్తుంది
-బాకీ అహమద్ పురీ
మనసు ఎలా ఉంటోందని
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది
-మహిరూల్ కాదరీ
ఎలాగైతేనేం ? ఆమె కళ్ళు
అశ్రు బిందువులు వర్షించాయి
ఆమె చిరునవ్వుల బరువు కూడా
ఆ నయనాలు మోయలేకపోయాయి
-ఖామోష్
ఆ రసభరిత నేత్రాలలో
సిగ్గు దోబూచులాడు తోంది
ఆ కళ్ళ విష పాత్రికల్లో
మృత్యువు దోగాడుతోంది
-అఖ్తర్ షిరానీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~