జనపదం జానపదం- 26-పర్జి తెగ జీవన విధానం – భోజన్న

ఈ తెగ వారు విశాఖ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 12,600 లు సంఖ్యాపరంగా చిన్న తెగ. వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ముంచింగిపుట్టు, అనంతగిరి మరియు పెద్దబాయలు మండలాల్లో నివసిస్తున్నారు. ఒరిస్సా మరియు మద్రాసు సరిహద్దులలో నివసించే పర్జాలు లేదా పోరోజాల గురించి థర్ట్సన్ ప్రస్తావించారు.

వీరి వస్త్రాధారణ ఆధునిక కాలంలో కూడా పెద్దగా మారలేదు, ఇంకా పాత పద్ధతుల్లోనే వీరి ఆహార్యం ఉంటుంది. ముసలి వారు పై భాగంలో ఏ రకమైన జాకెట్, రవిక మొదలైనవి ధరించకుండా చీరను మాత్రమే పై నుండి క్రింది వరకు చుట్టుకుంటారు. మగ వారు గోచి మాత్రమే ధరింగా నేడు టవల్, నిక్కర్, షార్ట్ వేసుకుంటున్నారు.

ఈ తెగలో మహిళలు ఆభరణాలు ధరించడంలో ఒక ప్రత్యేకతను కల్గి ఉంటారు. కొన్ని తెగలలో ముక్కు పుల్లను కుడివైపు మరికొన్ని తెగల్లో ఎడమ వైపు, మరియు రెండు వైపుల ధరిస్తుండగా, పర్జి తెగలో మాత్రం ఎడమ వైపు, కుడి వైపు, ముక్కుకు మధ్యలో ధరిస్తుంటారు. వీరిని ఇలా చూస్తే ఒకింత కొత్తదనం, కొత్త సంప్రదాయంగా తోస్తుంది. ముక్కు ఆభరణాన్ని ముంది అని, చెవి ఆభరణాన్ని నంగున్ అని రోజువారి వ్యవహారంలో పిలుస్తారు. కాళ్లకు కడియాలు, చేతులకు మట్టి గాజులని వేసుకుంటారు.

ఆడ పిల్ల పుష్పవతి అయితే చేసే కార్యక్రమాన్ని “ఉతానిబిబ’ అంటారు. ఈ కార్యక్రమానికి ఏడు రోజులు ముందు పుష్పవతైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి తదనంతరం ఈ వేడుక చేసి తమ చుట్టు పక్కల వారికి భోజనం పెడతారు. పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని ‘‘దారి పెండ్లి’’ అంటారు. దీనిని పెళ్లి చేసినట్లు ఆడంబరంగా జరుపుకుంటారు.

ఈ తెగలలో వివాహం మూడు రకాలుగా జరుగుతుంది.
1. పెద్దలు చేసే పెళ్లి
2. ప్రేమ పెళ్లి
3. బలవంతపు పెళ్లి

ఈ తెగలో పెండ్లిని ‘‘బిబ’’ అంటారు. మొదటి రెండు రకాల వివాహాలు మనకు తెలిసిందే కాని, బలవంతపు పెళ్లి అనగా ఎవరు లేని అమ్మాయిని బలవంతగా ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నా ఈ తెగ ఆమోదిస్తుంది. వీరు తమ తెగ వారిని మాత్రమే పెండ్లి చేసుకుంటారు. వీరిలో బహు భార్యత్వం అమలులో ఉంది. వీరు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వలన పనులు చేయడానికి తమ భార్యలను పురమాయించే వారు. వైద్యం చేసేవారు ఉచితంగానే వైద్యం చేసేవారు. నేటికి గ్రామాల్లో చెట్ల మందులు పోసే నాటు వైద్యులు ఉచితంగానే ఎన్నో వ్యాధులకు చికిత్సను చేస్తున్నారు. వాటి వలన మరణం సంభవిస్తుందని దాని నుండి తప్పించుకోవడానికి ఊరపంది, మేక, కోడి మొదలైన జంతువుల రక్తాన్ని ఇంటి చుట్టూ వేస్తారు. అన్ని తెగల వలె వీరు ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తారు. వీరు చేసే నృత్యాన్ని థింసాగా పిలుచుకుంటారు. కర్మకాండలు మొదలైనవి వారి తహాతును బట్టి జరుపుకుంటారు. ప్రతి సందర్భంలోను వీరంతా ఐక్యమత్యంతో ఉండి, ఆనందగా పండుగలు జరుపుకుంటారు.
వీరి భాషను కొంత కాలం వరకు గోండి భాషలో భాగంగా పరిగణించే వారు. పర్జి మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వాల్యూమ్ -lV (1906)లో గోండి మాండలికంగానే ఇవ్వబడింది. బరో, భట్టాచార్యులు 1950-51లో దీనిని ప్రత్యేక భాషగా గుర్తించారు. వీరు దీని మీద సమగ్ర పరిశోధన చేసి The Parji language (A Dravidian language of Baster) అనే గ్రంథం ప్రచురించారు. ఈ పరిశోధనలో పర్జిని ప్రత్యేక భాషగా గుర్తించారు. పర్జీలో మూడు ముఖ్య మాండలికాలు ఉంటాయి.

1. వాయవ్య మాండలికం
2. ఈశాన్య మాండలికం
3. దక్షిణ మాండలికం

ఈ తెగపై గోపినాథ్ మహంతి 1945లో ఒరియా భాషలో నవల రాశారు. దీనిని ఆంగ్లలో బిక్రం కె.దాస్ గారు అనువదించారు. ఈ తెగ వారు ప్రాచీన కాలంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు కాబట్టి పిల్లలని పాఠశాలకి పంపేవారు కాదు. కాని నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనల్లో ఎంతో పరివర్తన కనిపిస్తుంది. కొన్ని ఇతర తెగలతో పోల్చుకుంటే కొంత వెనుకబడినప్పటికి మరికొన్ని అట్టడుగు తెగల కంటే కొంత ముందున్నట్లు చెప్పవచ్చు.

నాటు వైద్యాన్నే నమ్ముకున్న వీరికి ప్రస్తుతం ITDA వలన అనేక లాభాలు పొందుతున్నారు. పాఠశాల నిర్వహణ చేత మెల్లమెల్లగా పిల్లలు చదువుకుంటున్నారు. నీటి వసతి, రోడ్లు మొదలైన అనేక అంశాల్లో వీరిని ముందుకు తీసుకు రావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
వీరి పాత అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు మెల్లగా సడలింపులకి గురి అవుతున్నాయి. వ్యవసాయంలోనూ నూతన పద్ధతులను అవలంభిస్తున్నారు. ప్రాచీన వైద్య విధానాలకి స్వస్తి పలికి నూతన ప్రభుత్వ యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయినా కొన్ని మూఢాచారాలు, మూఢ నమ్ముకాలు ఇంకా వీరి చుట్టే తిరుగుతున్నాయి. వీటి నుండి బయటపడడానికి వీరు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతో ఉంది.

– భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో