జ్ఞాపకం-70 – అంగులూరి అంజనీదేవి

కోడలి మాటలతో ఆమె మనసంతా కలచివేసినట్లైంది. ఇంత బ్రతుకు బ్రతికి ఈ వయసులో తనూ, తన భర్త పొలం వెళ్లి కూలిపని చెయ్యాలా? ఏమిటీ అగ్నిపరీక్ష?
“జీవితమన్నాక కొన్ని పరీక్షలు తప్పవన్నట్లు కనీసం తిలక్ అయినా డబ్బులు పంపాడేమో చూడండి అత్తయ్యా! ఎన్నిరోజులైంది వెళ్లి. అయ్యో అన్నయ్య పని చెయ్యట్లేదే! అమ్మా, నాన్న, ఇంట్లో వాళ్లు తింటున్నారా లేదా అని ఆలోచించాడా? ఇది మీరు కాస్త తీరిగ్గా వున్నప్పుడు మామయ్యగారితో చర్చించి చూడండి అత్తయ్యా! తిలక్ గనక నెలనెలా డబ్బు పంపితే మీరు పొలం వెళ్లి పనులు చెయ్యకపోయినా పర్వాలేదు” అంది అత్తగారి ముఖంలోకి చూస్తూ.
ఇప్పుడు రాజారాం స్కూల్ కి వెళ్లకపోయినా సగం జీతం వస్తుంది. దాంతో ఇల్లు గడచిపోతోంది. తిలక్ డబ్బులు పంపితే తన భర్త జీతం డబ్బుల్లో కొంత చిట్టీలకి వాడుకోవచ్చు. లేదంటే అత్త, మామలు కూలి పనికెత్తే అలాగైనా తన భర్త జీతంలో కొంత డబ్బును పక్కకి తియ్యొచ్చు. ఈ రెంటిలో ఏదైనా ఒకటి జరగాలి. అదే వినీల ఆలోచన.

సులోచనమ్మ నెమ్మదిగా “వినీలా! తిలక్ చేస్తున్న పనికి డబ్బులు పెద్దగా రావట. వచ్చే డబ్బులు వాడి ఖర్చులకి సరిపోతున్నాయట. అడిగి చూశాను. నన్నే పంపమన్నాడు” అంది.

“ఎవరైనా అలాగే తెలివిగా తప్పించుకుంటారు. డబ్బుని అడ్డదిడ్డంగా మాలాగా ఎగజల్లుకోరు” అంది వినీల.
దెబ్బతిన్నట్లు చూసింది సులోచనమ్మ.

“మీ మామగారికి స్వాభిమానం ఎక్కువ వినీలా! విశేషమైన ధనం లేకపోయినా సింహంలా బ్రతికాడు. సింహం తిండిలేక కృశించినా ఆకలితో బాధపడుతున్నా, ముసలితనంతో బక్కచిక్కినా, శరీరంలోని కీళ్లు పట్టుతప్పినా, కాంతి నశించినా, ప్రాణాపాయ స్థితిలో వున్నా అది మదించిన ఏనుగు కుంభస్థలాన్ని పగులగొట్టి ఆ మాంసాన్ని తింటుందే కాని ఎండిపోయిన గడ్డి తినదు. మీ మామగారు కూడా అంతే! నువ్వు చెప్పినట్లు కూలిపనికి వెళ్లమంటే వెళ్లరు” అంది.

వినీల వ్యంగ్యంగా చూసి “ఒకవైపు కుంటి కొడుకుమీద ఆధారపడి బ్రతుకుతూ కూడా ఏం పోలిక చెప్పారు అత్తయ్యా! మామయ్య గారు సింహమా?” అంటూ నవ్వింది.
కోడలి నవ్వుని తట్టుకోలేకపోయింది సులోచనమ్మ. కోడలి మాటలు విన్పించేంత దూరంలో నిలబడివున్న రాఘవరాయుడికి

అప్పటికప్పుడే ఒళ్లంతా చెమట్లు పోశాయి. ఊపిరాడనట్లు అన్పించి అక్కడే కూర్చున్నాడు.
అంతలో ఫోన్ రింగయింది.

అవతలవాళ్లు ఏం మాట్లాడారో ఏమో గబగబా రెండు కుర్చీలు పట్టుకుని భర్తవున్న గదిలోకి వెళ్లింది వినీల. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ బయటికెళ్లి ఎవరికోసమో ఎదురుచూస్తూ నిలబడింది. ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే చూస్తోంది సులోచనమ్మ. ఆమెకి ఆ హడావుడిలో పక్కగదిలో వున్న భర్తకి చెమట్లు పోస్తున్నట్లు ఊపిరాడక బాధపడుతున్నట్లు తెలియలేదు. ఆయనకి తొలిసారిగా గుండెపోటు వచ్చినట్లు కూడా తెలియలేదు.

ఎవరో కొత్త వ్యక్తులు ఇద్దరు లోపలికి వచ్చారు. వాళ్లను గుమ్మంలోంచే ఆహ్వానించి నేరుగా తీసికెళ్లి రాజారాం దగ్గర కూర్చోబెట్టింది వినీల. ఆమె వాళ్ల నుండి ఏదో ఆశిస్తూ అక్కడే వాళ్ళ మాటలు వింటూ నిలబడింది. వాళ్లు రాజారాంతో మాట్లాడుతున్నారు.

వాళ్ళమాటలు విన్నాక వినీల వెంటనే “మామయ్యా!” అంటూ రాఘవరాయుడి దగ్గరకి వెళ్లింది.

ఆయన అప్పుడే తనను తను సంభాళించుకుంటూ లేచి నిలబడ్డాడు.

ముఖానికి పట్టిన చెమటను నెమ్మదిగా తుడుచుకున్నాడు.

ఆయనకి కోడలు ముఖం చూడాలనిపించటం లేదు.

అయినా ఈ రోజుల్లో ఆర్థికంగా అశక్తులైన అత్తమామల్ని ఎంత మంది కోడళ్ళు గౌరవిస్తున్నారు? మామని వాచ్ మేన్ గా, అత్తని పనిమనిషిగా వుండి బ్రతకమని బయటకు వెళ్లగొట్టేవాళ్లు ఎందరు లేరు? అందుకే తన కోడల్ని తను అపార్థం చేసుకోవలసిన అవసరం లేదు అని మనసుకి నచ్చచెప్పుకుంటూ “ఏమ్మా?” అన్నాడు.

“మామయ్యా! మీ అబ్బాయి గురించి మా ఊరి దిలీప్ పేపర్లో రాశాడట. అది చూసి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కదలిక వచ్చినట్లుంది. ఏదో వికలాంగుల సేవాసంస్థ వాళ్లట. మన ఇంటికి వచ్చారు. వచ్చేముందు ఫోన్ చేశారు కాబట్టి వాళ్లను నేను రిసీవ్ చేసుకున్నాను. బహుశా వాళ్లు మనకి డబ్బు సహాయం చేసి వెళ్తారనుకుంటా! మీరు, అత్తయ్యగారు వచ్చి వాళ్లకి కన్పించండి! మిమ్మల్ని చూస్తే వాళ్లకి ఇంకా జాలి పెరిగి ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం వుంది” అంటూ వాళ్లిద్దర్ని వెంటబెట్టుకెళ్లింది. వాళ్లు వెళ్లేంతవరకు తొందర పెట్టింది. రాఘవరాయుడు, సులోచనమ్మ వెళ్లి కొడుకు దగ్గర కూర్చున్నారు.
వినీల వాళ్ల చేతిలో వున్న బ్యాగ్ వైపే చూస్తూ ‘వీళ్లు క్యాష్ ఇస్తే బావుండు. చెక్ ఇస్తే దాన్ని మార్చుకోటానికి సిటీకి వెళ్లాల్సి వస్తుంది’ అని ఆలోచిస్తోంది.

“ఈమె నా భార్య! వీళ్లు నా తల్లి, దండ్రులు” అని వాళ్లకి తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు రాజారాం.
ఒకరికి ఒకరు నమస్తే చెప్పుకున్నారు.

రాజారాం ఒక టీచర్ అయినందువల్లనో ఏమో వాళ్లతో చక్కగా మాట్లాడుతున్నాడు. తెలివిగా మాట్లాడుతున్నాడు. రాజారాం మాటలు, వినయం, మర్యాద వాళ్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అదిచూసి “మనుషులు కన్పిస్తే చాలు ఒకటే సోది పెడతాడు. ఇప్పుడీ ఉపన్యాసాలు అవసరమా? కాళ్లేకాదు బుద్ధి కూడా లేదు ఈ మనిషికి” అని భర్తను చిరాగ్గా చూస్తూ మనసులో తిట్టుకుంది వినీల.

భర్త మాట్లాడటం ఆపేస్తే వాళ్లు డబ్బులు ఇస్తారని, వాళ్లు వెళ్లగానే ఆ డబ్బుల్ని లెక్కపెట్టుకుంటూ కూర్చోవచ్చని చూస్తోందామె.

వాళ్లలో ఒకాయన రాజారాం కాళ్లవైపు బాధగా చూస్తూ “రాజారాం గారు! మాది కేవలం వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాసంస్థ. మా సంస్థలో చాలామంది వికలాంగులు వున్నారు. కొంతమంది దాతలు సహృదయంతో ఇస్తున్న విరాళాలతో నడుపుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని మా దగ్గరికి తీసికెళ్తాం. మా వంతు సేవ మీకు అందిస్తాం. మీకు నడక వచ్చేంత వరకు మా దగ్గరే వుంచుకుంటాం. మీవాళ్లు మిమ్మల్ని నడిపించలేకపోవచ్చు. ఎక్సర్ సైజులు చేయించలేకపోవచ్చు. మా సహాయాన్ని తీసుకోమని అడగటానికి వచ్చాం” అన్నారు.

“థాంక్స్!” చెప్పాడు రాజారాం.
వాళ్లు ”వెల్కం” అంటూ రాజారాం ఏం చెబుతాడో వినాలని ఎదురుచూస్తున్నారు.

“వికలాంగులకి సేవ చెయ్యడం అనేది మాటలతో పని కాదు సర్! దేన్నీ ఆశించకుండా మానవత్వంతో చెయ్యాల్సిన పని. మీరు ఏ దయతో నన్ను తీసికెళ్లాలని వచ్చారో ఆ దయకి పాదాలు వుంటే వాటి పై తల పెట్టుకొని అలాగే వుండిపోవాలనిపిస్తోంది” అన్నాడు రాజారాం.

ఎంత వద్దనుకున్నా తనను పట్టుకున్నట్టే పట్టుకుని వదిలెయ్యటమే కాక ‘నా కర్మ! నా కర్మ!’ అంటూ తలకొట్టుకుంటూ వెళ్లే భార్య గుర్తిస్తోంది. తనకి సేవ చెయ్యాల్సి వస్తుందని పని పేరుతో ఇంట్లోంచి బయటపడ్డ తమ్ముడు గుర్తొస్తున్నాడు.
రాజారాం ఏదో ఆలోచనలో వున్నట్లనిపించి “మీరు బాగా ఆలోచించుకున్నాకే ఓ నిర్ణయానికి రండి సర్! మేము మీ అభిప్రాయానికే ఎక్కువ విలువ ఇస్తాం” అన్నారు.

“థాంక్యూ సర్! ప్రస్తుతం నా తల్లిదండ్రులు నన్ను చెరోవైపు పట్టుకొని నడక ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటున్నారు. మా పొలం అమ్మాక కొంత పొలం కౌలుకి తీసుకొని సాగు చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకోసమే మానుకున్నారు. వాళ్లే లేకుంటే ఈరోజు నేనింత ఆత్మవిశ్వాసంతో వుండగలిగేవాడిని కాదేమో!” అన్నాడు.

వాళ్లు వింటున్నారు. తల కొట్టుకుంది వినీల.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో