జవాబు కోసం సలీమ(పుస్తక సమీక్ష )-వెంకటేశ్వరరావు కట్టూరి

“స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి. స్త్రీ హృదయం ఉంది. దానికి అనుభవమియ్యాలి. స్త్రీకి మెదడు ఉంది. దానిని ఆలోచించనియ్యాలి.” అని చలం గారన్నట్లు. తన కవిత్వంతో “జాగ్రత్త” అంటూ తెలుగు సాహిత్యంలో అడుగు పెడుతోంది షేక్ సలీమ. స్త్రీని సాటి మనిషిగా కాక, ఒక సాధనంగా వాడుకుంటున్న సమాజానికి మాతృమూర్తి విలువ తెలియజేస్తూ

“హిమము వలె
చల్లని ఆమె హృదయం
ఇప్పుడు మండుతున్న
అగ్నిపర్వతమయింది”
అంటూ నేటి ఆధునిక సమాజంలో స్త్రీ విలువను తెలియజేస్తుంది రచయిత సలీమ.”స్త్రీ పురుషుడికన్నా ఏవిధంగానూ తక్కువది కాదు. ఆమెకు వ్యక్తిత్వం ఉంది. అది హరింపబడింది.పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని ఆధునిక చైతన్యం ద్వారా తిరిగి పొందుకోవాలి”అని గురజాడ అన్నట్లు. సమాజంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు

“పిల్లి పులి అవుతుంది
లేడి సింహం అవుతుంది
జాగ్రత్త”
అంటూ హెచ్చరిస్తోంది.

మహిళలపట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని తెలియజేస్తుంది.గదిలో బంధించి కొడితే పిల్లికూడా పులిలా మారుతుందంటూ, స్త్రీ పట్ల బాధ్యత కలిగి మెలగాలి.అప్పుడే ఆమె మనసు మండే సూర్యుడిలా కాకుండా, హిమ మంత చల్లగా మమతానురాగాల ప్రేమను పంచుతుంది.అని వివరించారు రచయిత.సలీమ అనేక కోణాలలో స్త్రీ బాధలను,వారి జీవితాలను,సమాజంలో సామాజికంగా వారు ఎదుర్కొంటున్న వివక్షను తన కవిత్వం లో వ్యక్తీకరించే ప్రయత్నం చేసింది. పాత్రికేయ వృత్తిలో ఉంటూ, తెలుగు సాహిత్యంలో తనదైన కొత్తగొంతుకతో నవీన కవిత్వం వినిపిస్తోంది సలీమ.

ఆమెకు మనసుంది.అది అర్ధం చేసుకుని “జాగ్రత్త”గామసలుకొమ్మని ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది.స్త్రీ పై సమాజంలో, కుటుంబ జీవితంలో కొనసాగుతున్న వివక్షపట్ల రచయిత స్పందించిన విధానానికి రూపం ఈ కవిత.

“ఆర్ధ్రతలు,ఆప్యాయతలూ అవసరాలై నువ్వు చచ్చిపోతావు”అంటూ “తివాచీ”కవిత వాణీ రంగారావు గారన్నట్లు “ప్రతిబింబం”కవితలో
అమ్మ ప్రేమను వివరిస్తుంది సలీమ.

“కోడి కూడా మేల్కోదు
తను మాత్రం
ఉలిక్కిపడి లేస్తోంది”…
అంటూ తెల్లవారుజామునే నిద్రలేచి పనులన్నీ చక్కదిద్దుకొనే సగటు స్త్రీ జీవితాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించారు రచయిత.

“నిన్నటి అలసట తీరకముందే
ఈ రోజు కోసం
యుద్ధం మొదలెడుతుంది”
అంటూ మధ్యతరగతి స్త్రీ జీవితాన్ని వివరిస్తూ, కుటుంబాన్ని పోషించడంలో, పిల్లల్ని పెంచడానికి ఆమె ఎంతలా కష్ట పడుతుందో సగటు మహిళ జీవితాన్ని తెలియజేస్తుంది రచయిత ఈ కవితలో.

“కష్టాలన్నీ కడుపులో దాచి
తన కట్టూ బొట్టుతో
చిరునవ్వులు చిందిస్తుంది”…
ఇందులో కవిత్వం కంటే వాస్తవికత ఎక్కువ కనిపిస్తుంది.

“ఎన్నాళ్లీ బానిస బతుకంటూ
ప్రశ్నిస్తున్నాను”అంటుంది మరో కవితలో
ఉహాల లోకంలో కొత్త బంగారు లోకంలో విహరిస్తున్న కుమార్తె తో నీకోసం రాకుమారుడు రెక్కల గుర్రం వేసుకువస్తాడు,నిను తీసుకుపోతాడు.నీ బతుకంతా పూలదారే.అంటూ తన తల్లి చెప్పిన మాటలు వింటూ వినీలాకాశంలో విహంగం లా విహరించే ఆ అమ్మాయికి పెళ్లి కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నట్లు అనిపించింది.

అమ్మ చెప్పిన మాటలన్నీ వినడానికి బావుంటాయి.కానీ నిజ జీవితంలో ఈ పురుషాహంకార లోకంలో జరగవనే వాస్తవికతను తెలియజేస్తుంది ఈ కవితలో.
“నువ్వు నాలో సగ భాగ మేమిటి?
నేనే నీ అర్ధాన్ని
నువ్వోక్కతివే పూర్ణాకాశానివి
నేను నీ ఛాయా చిత్రాన్ని మాత్రమే”అని ఆచార్య ఎండ్లూరి సుధాకర్ చెప్పినట్లు నేటి ఆధునిక సమాజంలో ఉంటే ఎంత బాగుండు.కానీ మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఎక్కువ.ఈ అసమానతలు తొలగిపోవాలని కోరుకుందాం.స్త్రీ జాతిపట్ల చేస్తున్న ద్రోహం గురించిన చింతన పురుషులలో ప్రారంభం కావాలన్న బలమైన కోరిక ఈ కవితలో మనకు కనబడుతోంది.

“జవాబు కావాలి”అనే ఈ కవితా సంపుటిలో ఇరవై రెండు కవితలున్నాయి. మచ్చుకు కొన్ని మాత్రమే తీసుకోగలిగాను.ఆధునిక సమాజంలో ఆడపిల్లకి చదువు ఎంత ముఖ్యమో తన కవిత్వం లో వివరించారు రచయిత. నిరు పేద ముస్లిం కుటుంబం నుండి వచ్చిన సలీమ జర్నలిస్ట్ గా నవ తెలంగాణ పత్రికలో పనిచేస్తున్నారు.కవయిత్రిగా తెలుగు సాహిత్యంలో తనదైన కవిత్వం రావాలని కోరుకుందాం.

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో