తెల్లారి పోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తుంది దేనికని ?
“ఇంకొద్దిగా మిగిలాను
ఇది కూడా కరిగిపోవాలని ‘”
-ఆగ్ జాన్ ఏష్
ఆమె నగ్న సౌందర్యం మీద
పరుచుకున్నాయి కురులు
ఒకేసారి ఉదయించాయి
రేయీ మరియూ పవలు
– హీరా లాల్ పలక్
నీ నయనాలు
ఎంత సొగసుగా ఉన్నాయి
కాటుక దిద్దకున్నా
దిద్దినట్టే అనిపిస్తున్నాయి
-తమన్నా ఆమాడీ ఫుల్ వార్వీ
నా మద్య పానాన్ని
ఇంతగా అవమానం చేయకు
సాఖీ ! నా పాన పాత్రలోకి
మధువు కొలిచి మాత్రం పోయకు
-మేలా రాం వఫా
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~