బస్సులు
భరోసాను మోసుకెళ్తున్నాయి
నిన్న
పెద్ద బతుకమ్మ పండగ
***
మా సిరిసిల్ల
అచ్చంగా
సిరి’సిల్లానే
చేనేతలకు ఖిల్లా
***
నిత్యం
త్యాగాలు చేస్తూ పల్లె
పట్నం బలుస్తున్నది
దీనివల్లే
***
ఇంటి చుట్టూ
అన్నీ బంగళాలే
ఇక మనుషుల్ని
వెతుక్కోవాలి
***
ఒత్తిడేక్కువైతే
మరకూడా మొరాయిస్తుంది
అమ్మను
ఏమట్టితో చేసాడో
***
మా ‘సినారె ‘
కీర్తే కదా
మమ్మల్ని నడిపించే
చైతన్య స్ఫూర్తి
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~