మేకోపాఖ్యానం -15 -వి. శాంతి ప్రబోధ

శాంతి

“అబ్బాబ్బా ..
మీకు నిద్ర ఎలా పడుతుంది. అవతల మంటలు మండిపోతుంటే .. ” ఎక్కడ వగరుస్తూ వచ్చింది గాడిద.
దీని గోల రోజూ ఉండేదే అన్నట్లుగా కళ్ళు తెరవలేదు మెళుకువ తో ఉన్న మేకజంట.

“ఎక్కడ .. మంటలు ఎక్కడా కనిపించట్లేదు .. ” చుట్టూతా చూస్తూ అన్నది చెట్టు మీద కాకి.

చిన్నగా నవ్వేసి ” నేను చెప్పింది ఆ మంటలు కాదులే .. హిజాబ్ మంటలు” అన్నది గాడిద.

“హిజాబ్ మంటలు ఏంటి.. తలా తోక లేని మాటలు నువ్వూనూ ..” విసుక్కుంది కళ్ళు తెరిచిన ఆడమేక

“అసలు విషయం ఏంటో చెప్పు.” ఆవులించి కొండెక్కిన నిద్రని తలుచుకుంటూ అన్నది మగమేక

“హిజాబ్ గొడవ కర్ణాటకతో అయిపోయిందనుకుంటున్నారా..? లేదు నిప్పు అక్కడ రాజుకుంది. సెగ ఇక్కడ తగిలింది” అన్నది గాడిద

“అసలు విషయం చెప్పకుండా ..”మొఖం చిట్లించింది ఆడమేక

” ఆ అక్కడికే వస్తున్నా .. చెప్పేదాకా ఆగలేవా ..?
నిన్న విజయవాడ లయోలా కాలేజీలో .. ఇవాళ ఎర్రగొండపాలెం లో హిజాబ్ వివాదం మొదలైంది” వివరించింది గాడిద
అవునా అన్నట్లు చూసింది ఆడమేక

” మొదలవదా ..మరి! మొదలవుతుంది. నిన్నటి వరకు లేని ఆంక్షలు ఇవ్వాళ మొదలు పెడితే ..” అన్నది మగమేక

“పిల్లలందరూ ఒకే విధంగా ఉండాలని డ్రెస్ కోడ్ పెట్టిన అట్లా కాదు మేం హిజాబ్ ధరించాల్సిందే అని పట్టు ఆ ఆడపిల్లల కెందుకో .. ” దీర్ఘం తీసింది గాడిద.

“ఎర్రగొండపాలెం లో ఏమైందిట” అన్నది కాకి

“మత పెద్దల జోక్యం .. పోలీసుల రంగ ప్రవేశం జరిగిందట. చివరికి సాంప్రదాయ దుస్తుల్లో క్లాసులకు అనుమతి ఇచ్చారట” గాడిద

“పోన్లే సద్దుమణిగింది.. ” అన్నది కాకి

“ఒక వర్గం వాళ్ళు హిజాబ్ ధరిస్తే మరో వర్గం ఆడపిల్లలు స్కార్ఫ్ కట్టుకుంటున్నారు. కొందరు కొంగు నెత్తి మీద నుంచి కప్పుకునే సంప్రదాయం ఎప్పుడు ఉండనే ఉందిగా .. ఇప్పుడు కొత్తగా ఈ అడ్డుకోవడం ఏంటో ..” ఆలోచనగా అన్నది ఆడమేక

” హిజాబ్, బురఖా లాంటివి వాళ్ళ మతం వాళ్లపై బలవంతంగా రుద్దిన ఆచారం .. పైగా పాకిస్థాన్ వంటి దేశాల్లో మహిళలు హిజాబ్ వద్దని ఆందోళనలు కూడా చేస్తున్నారట. మన దగ్గర మరీ మూర్ఖంగా తయారవుతున్నారు ” మూతి విరిచింది గాడిద.

“అబ్బో .. నువ్వు కూడా ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నావే ..
నిజమే, నువ్వన్నట్లు అది మతం బలవంతంగా ఆడవాళ్లపై రుద్దిన ఆచారం. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న ఆచారం కావచ్చు. మరో మతం లో అలాంటి ఆచారాలు కొల్లలు లేవా.. ?” అన్నది ఆడమేక

అంతలో “హిజాబ్ అంటే .. ” చెంగున వచ్చిన ఉడుత ప్రశ్న

“జుట్టు, మెడ, ఛాతీని కప్పి ఉంచే పరదా. కళ్ళు, ముఖం కనిపిస్తాయి ” జవాబిచ్చింది కాకి

“ముస్లిం స్త్రీలు బురఖా, హిజాబ్ లు తొలగిస్తారనుకుందాం. మరి నువ్వు చెప్పే మహిళలు తలపై నుంచి కొంగు కప్పడం మానేస్తారా .. ” ప్రశ్నించింది మేక

“అసలు ఏమైంది?” అడిగింది ఉడుత

“కాలేజీకి ఆలస్యమైతే ఆడపిల్లల్ని నిలదీశారట అడ్డుకున్నారట ..
కానీ, తమ సాంప్రదాయ దుస్తులు తొలగించాలని ఆదేశించారని విద్యార్థులు అంటున్నారు.
విద్యార్థులు మతపరమైన దుస్తులకంటే యూనిఫారం ధరించి వెళ్లడం మంచిది – అమిత్ షా – కేంద్ర హోమ్ శాఖా మంత్రి కూడా చెప్పారు. కాలేజీకి పోయే పిల్లలు ఆ కాలేజీ పద్ధతులు పాటించాలి కానీ కాదు, కూడదు, మేం ఇష్టం వచ్చినట్టు ఉంటాం అంటే ఎట్లా కుదురుతుంది. అదేం వాళ్ళిల్లు కాదుగా .. ” ఆవేశంగా అన్నది గాడిద

“వాళ్లు హిజాబ్ తో వస్తే తాము కాషాయం ధరించి వస్తామని యువత రోడ్ల మీదకు వచ్చారు” అన్నది కాకి

“కాలేజీ, బడి అందరివి. అక్కడ ఒక మత చిహ్నం వద్దని గగ్గోలు పెట్టే వాళ్ళు మరో మత చిహ్నాలైన బొట్టు , మంగళ సూత్రం వంటివి లేకుండా కాలేజీకి వస్తారా ..? ” ప్రశ్నించింది మగమేక

పూర్వం మానవులు సమూహాలుగా నివసించేవారట. ఆ రోజుల్లో ఓడిన గుంపు పశు సంపద తో పాటు, వారి మహిళల్ని కూడా ఎత్తుకుపోయి కట్టేసేవారు. కాళ్ళు , నడుము , మెడ మీద కట్లు ఉండేవట. వాటి అవశేషాలు నేటి స్త్రీలు ధరించే అభరణాలట. అది చరిత్ర పరిశోధకులు తేల్చిన విషయం అట” ఎక్కడో విన్న విషయాలు వివరించింది కాకి.

“అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఆ విషయం కాదు. మతానికి సంబంధించిన గుర్తులు అన్ని మతాల వారు వచ్చే కాలేజీలలో ఉండొచ్చా అని” అన్నది ఉడుత.

” నా ఎరుకలో నేను చూసిన బడులలో ఒక మతానికి చెందినవి ఎక్కువగా చూశాను. ఆ బడి ఆ ఒక్క మతానికి చెందింది కాదు కదా .. ఒక్క మతానికి చెందిన దేవుళ్ళే ఎందుకుండాలి ” తాత చేయి పట్టుకు నడుస్తున్న కుర్రవాడి ప్రశ్నకు చెట్టుకింద చెట్టుమీద ఉండి చర్చ చేసుకుంటున్న జీవాలు నిశ్శబ్దంగా ఆ మాటలు వినవచ్చిన కేసి చూశాయి.

“అవునవును, నా చిన్నప్పుడు బడిలో దేశ నాయకుల ఫోటోలు మాత్రమే కనిపించేవి రా.. బస్సుల్లో, ఆఫీసుల్లో మూడు ముఖ్యమైన మతాలకు చెందిన ఫోటోలు లేదా గుర్తులు ఉండేవి. ఇప్పుడేంటో ప్రభుత్వ బడుల్లో, ఆఫీసుల్లో , బస్సుల్లో అన్ని చోట్లా ఒక మతానికి చెందినవే..” తలగోక్కుంటూ అన్నాడు తాత

” ఏ మతానికి చెందిన విద్యా సంస్థల్లో ఆ మత చిహ్నాలు ఉంటే తప్పు లేదేమో.. కానీ ప్రజలందరికీ చెందిన ప్రభుత్వ బడులలో కూడా ఒక మతం ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదేమో ..” అన్నాడు ఆ యువకుడు

” ఏమోరా మనవడా..
హిజాబ్ వేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఆ మత మహిళ.
మన రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు ఆ స్వేచ్ఛను ప్రశ్నగా మారుస్తున్నారనే నా బాధ.
సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య గుడ్డి ద్వేషాన్ని పెంచుతున్నారనే నా వ్యధ.
ఈ దేశం ఎటుపోతుందో .. ఏమైపోతుందో రా ” దిగులుగా తాత

“వీటన్నిటికీ మూల కారణం ఏంటో ప్రశ్నించుకోవాలి తాతా..” ముందుకు సాగిపోయారు తాతా మనవడు

పోతున్న వాళ్ళని చూస్తూ “హిందూ దేశంలో హిందువుల ఫోటోలు పెట్టుకోవడం తప్పెలా అవుతుంది? ఆ దేశ మత ఆచారాలు పాటిస్తే తప్పెలా అవుతుంది? ” గాండ్రించింది మొఖం చిట్లించుకున్న గాడిద
.
“దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులున్న మాట నిజమే. కానీ మిగతా మతాలని గౌరవించే ప్రజాస్వామిక దేశం. మత స్వతంత్రపు హక్కు ఉన్న దేశం. భారత దేశం భిన్న కులాల మతాల కలయిక . భిన్నత్వంలో ఏకత్వం సాధించడం మన గొప్పతనం అది మరచిపోయి మత ఆచారాల పేరుతో కల్లోలాలను, రక్తపాతాలు సృష్టిస్తున్నారు ..
ఏదో సమస్య వచ్చిందనుకుందాం. అప్పుడేం చేయాలి. సమస్య పరిష్కరించుకోవాలి. కానీ ఆ సమస్యను స్వార్ధానికి వాడుకోవడం, పెంచి పెద్దది చేయడం విద్వేషాలు రగిల్చి ఆ మంటల్లో చలి కాచుకోవడం .. మతోన్మాదులు, రాజకీయ నాయకులకు అలవాటైపోయింది.” అన్నది లోకమంతా చుట్టేసే కాకి

“మొన్నా మధ్య ఏదో ఎంట్రన్స్ పరీక్ష జరిగినప్పుడు అమ్మాయిల చెవి కమ్మలు , మెళ్ళో మంగళ సూత్రాలు కూడా తీయించారు. అప్పుడేవి మాట్లాడలేదు. క్రిస్టియన్ స్కూల్ లో అయ్యప్ప మాల వేసుకొస్తే రానివ్వకుండా ఎండలో నిలబెట్టినప్పుడు ఎవ్వరి గొంతు పెగల్లేదు” గొంతు చించుకున్నది గాడిద .

“అయ్యప్ప మాలతో బడీలోకి రానివ్వలేదని గొడవ చేసిన గొంతులే ఇప్పుడు హిజాబ్ తో ఎందుకొచ్చావని దాడి చేస్తున్నాయ్ ఇదేమి న్యాయమో ..” అన్న కాకి కొద్ది క్షణాలాగి అందరికేసి చూస్తూ “వెనుకుండి దాడి చేయించే , రెచ్చ్చగొట్టే నాయకుల పిల్లలు మత కలహాలకు దూరంగా విదేశాల్లో అన్ని మతాలవారితో కలసి హాయిగా చదువు కుంటున్నారు. భద్రంగా ఉన్నారు.
ఇక్కడ విద్యార్థులు మాత్రం చదువు గాలికొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటల మతం ఉచ్చులో పడి మూర్ఖత్వంతో ఊగిపోతున్నారు. సభ్యత, సంస్కారం మరచిపోయి, కనీస మర్యాద విడిచి రాళ్లు కర్రలతో దాడులు చేస్తూ.. కత్తులతో రక్తపాతం సృష్టిస్తూ ఉరికొయ్యకేలాడుతున్నారు ” అన్నది

“మేలిముసుగైనా , ముసుగైనా , హిజాబ్ అయినా మహిళల హక్కులకు వ్యతిరేకమే .. కానీ వాటి గురించి మాట్లాడరు. అయితే నాకిప్పుడు అనిపిస్తున్న దేమిటంటే అది నిర్ణయించు కోవాల్సింది , చర్చించుకోవలసింది పోరాడాల్సింది ఆ అమ్మాయిలు” అన్నది ఉడుత

“హిజాబ్ తీయమని గట్టిగా చెప్పినందువల్లే కదా.. ” గొణిగింది గాడిద

“విద్యా సంస్థల్లోకి మతం చొచ్చుకొచ్చింది. సరస్వతి నమస్తుభ్యం .. ఆమెన్ .. అల్లా చదువుల్లో చొరబడ్డాయి. ఏ మతమైనా ఆ ప్రభావం ఆడవాళ్లపైనే. ముందుకు పోవాలని ఒక అడుగు వేస్తే నాలుగడుగులు వెనక్కి లాగుతూ…

స్త్రీల జీవితాలపై మతం , పురుషాధిపత్యం విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. కలసికట్టుగా అన్ని మతాలు మహిళల్ని అణిచివేస్తున్నాయి. ఇంట్లో మగవాళ్ళు హిజాబ్ బురఖా వేసుకోవాలని , బయటి మగవాళ్ళు వేసుకోవద్దని వెంటపడుతుంటే ఆ ఆడకూతురు ఏంచేస్తుంది.. “సానుభూతిగా అన్నది మగమేక.

“ఎవరి మతాన్ని వారు గౌరవించడంలో తప్పులేదు. ఆచరించడంలో తప్పులేదు. ఎవరి విశ్వాసం వారిది.
మహిళల రాకపోకల నియంత్రణ , వారు ఎలా ఉండాలో ,ఎం చేయాలో , ఎక్కడికి వెళ్లాలో ఎంత సేపు వెళ్లాలో అంతా నిర్ణయించేది వాళ్లే
కానీ ఆ మతాల్లో మగవాళ్ల ఆధిపత్యానికి తలొగ్గి , వాళ్ళు రూపొందించిన కట్టుబాట్లు పాటించడం… వారు చెప్పిన దేవుళ్లనే పూజించడం , ఆచారాలు ఆచరించడం ఎంత మూర్ఖత్వం.. ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ ఆలోచించాలి. తమకి ఏం కావాలో తెల్సుకోవాలి. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఇది.” ఆవేదనగా అన్నది ఆడమేక

“పితృస్వామ్య పురుషాధిక్య సమాజం
మత భావనలు వదులుకోలేని మనుషులు ఎంత పతనమై పోతున్నారో గుర్తించడం లేదు.
మతాచారాలన్నీ మహిళల పట్ల నీచమైన నిబంధనలు రాసిపెట్టాయి .
మతాలు గొప్పవైతే వాటి గొప్పతనాన్ని చాటుకోవాలంటే ఆయా మతాల్లో ఉన్న అసమానతలను తొలగించుకోవాలి కానీ శత్రువులుగా మార్చుకుంటూ పోతే మారణహోమమే కదా మిత్రమా..” సాలోచనగా అన్నది కాకి

“అవున్నట్లు తలూపుతూ ఆలోచనలో పడింది గాడిద
“అసలుకే మోసం రాకముందే జనం మేల్కొంటే బాగుండు..” ఉడుత ఆశాభావం

“నిజమే, ఇంట్లోంచి దిద్దుబాటు చర్యలు మొదలవ్వాలి. ఏ మతం వారైనా వారి హక్కుల కోసం కొట్లాడాలి, వారి ఆత్మాభిమానం కోసం పోరాడాలి, కానీ సంప్రదాయం ముసుగులో హీనంగా బతకొద్దుగా.. ” అన్నది ఆడమేక

“ఆవు చేలో పడితే దూడ గట్టున మేస్తుందా .. “ అన్నది మగమేక

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో