నేటి జాషువా ఎండ్లూరి సుధాకర్ (స్మృతి పధం )-మల్లిపూడి వనజ

ఆకలి రసం నాలోని రచనా రహస్యం అవమాన విషయం నా కంఠంలో నేల అమృత విశేషం అని తన కవితా ప్రవాహంలో ముంచి మంత్రముగ్ధుల్ని కాదు వివేక విజ్ఞానాన్ని నింపుతోంది ఎప్పుడు చిరు మందహాసంతో ఉండే నా గురువు. .

ఎం ఏ ప్రవేశ పరీక్ష రాసి మౌఖిక పరీక్షలు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠంలో పీఠాధిపతిగా చూసి ఆయన సాహిత్యం కవిత విలువ వాగ్ధాటి వేషభాషలను( కుర్తా పైజామా లనే ఎక్కువగా ధరించేవారు) చూసి ఈయన ఖచ్చితంగా అగ్ర కులస్తుడు సుమ అని అనుకున్నాను అంటే అప్పటికి అంతటి విశేష జ్ఞానవంతులను నేను చూడలేదు అయితే తెలుగు సాహిత్యం ఒక వర్గానికి మాత్రమే చెందింది కాదు అని నిరూపిస్తూ ప్రాచీన సాహిత్యం పురాణాలు ఆధునిక కవిత్వం ఏ అంశం మీదనైనా అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఆయనది.

2014లో గుంటూరులో జరిగిన జాషువా సభలో అక్కడ ఆయనకు బహూకరించిన జాషువా సర్వ లభ్య సంకలనం పుస్తకం నా చేతికి ఇచ్చి జాషువా రచన నే ఒక అంశంగా తీసుకోమని చెప్పి చదువులో చుక్కాని లేని నాకు దిశా మార్గనిర్దేశం ని చూపించారు. నా ఉన్నత విద్యకు నా వెన్నంటే నిలిచి నన్ను ప్రోత్సహిస్తూ నా సంసారం నా చిన్న బిడ్డలు చదువుకు ఆటంకం కాదని చెప్పి వారి జీవితంలో వచ్చిన ఒడిదొడుకులను ఉదాహరణగా చెప్పి నేను ఎం ఏ ఎంఫిల్ ఎంతో శ్రద్ధతో చేయడానికి ముఖ్య కారకులు డాక్టర్ పుట్ల హేమలత ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు.అంతేకాదు నాలోని సాహిత్యాభిలాష ఆయన గుర్తించి రచనను చేయమని ప్రోత్సహించేవారు, సలహాలు ఇచ్చారు. నేను రాసిన వ్యాసాలను సరిచేసి దానికి ఆయన పంధాలో శీర్షికలను సూచించారు .ఎంత పెద్ద పుస్తకమైనా వ్యాసాన్ని అయినా అది రాసింది పేరు మోసిన కవి అయిన ఒక చిన్న విద్యార్థి అయిన కూడా ఏకబిగిన చదివేవారు ఆయన చేతిలో పుస్తకం వుండి దానిని చదువుతూ ఉండటం ఇంటా బయట నేను అనేక సార్లు చూశాను. ఎవరైనా పుస్తకం తెచ్చి ఆయన చేతికి ఇచ్చారంటే ఒక మిఠాయి పొట్లం తెచ్చినట్లే.

కులంలో ఎక్కువ తక్కువలు లేవని నీ ప్రతిభ నిన్ను ముందుకు నడిపిస్తుందని చాటిచెప్పిన వ్యక్తి.నిర్భయంగా కులాన్ని చెప్పగల ధైర్యశీలి. కొత్త కోణంలో నాకు అంబేద్కర్ ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి సుధాకర్ గారు.

నా చేతి వంటను రుచి చూసి వారి తల్లిని గుర్తు చేసుకున్నారు ఎప్పుడూ తల్లి గురించి చెప్పేవారు గౌరవించేవారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి కుటుంబాల ఆలనా పాలనా చూశారు పెద్దగా వ్యవహరించారు అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించారు ఆయన కుటుంబానికి ఒక సూర్యునిలా వెలుగు నిచ్చారు .
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నిర్లక్ష్యం చేయలేదు అష్టైశ్వర్యాలను ఇవ్వకపోయినా అన్ని అవసరాలను తీర్చారు ఒక భర్తగా ఎంత ప్రేమ ఇచ్చాడో వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన కొందరికి మాత్రమే తెలుసు. నేడు హేమలత గారి పుట్టినరోజు, చనిపోయిన రోజు, పిల్లల పుట్టిన రోజులు, క్రిస్మస్ పండుగలు ఇలా అనేక సందర్భాలలో ఆయన రాసిన కవితల్లో భార్య కై పడిన ఆరాటం నేడు అందరూ చూశారు. వారి కన్న బిడ్డల కొరకు మాత్రమే కాకుండా వారి దగ్గర చదువుకొన్న బిడ్డలపై కూడా అంతే మమకారం చూపించిన పుణ్య దంపతులు హేమలత సుధాకర్ లు.

సుధాకర్ గారి మాటల్లో ప్రసంగాల్లో జాషువాను గురించిన ప్రస్తావన లేకుండా లేదు. నేటి సాహితీ రంగానికి ఆయన  జాషువాని పరిచయం చేసినంతగా ఎవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు అనేది ఇది నా అభిప్రాయం. అందుకే నేను అంటాను ఆయన నేటి జాషువా .

అదే పంథాలో సుధాకర్ సార్  భౌతికంగా లేకపోయినా రచనా పరంగా అందరి నాలుక ల్లోనూ బ్రతికే ఉన్నాడు.
ఆయనకు ఇదే నా నివాళి

-మల్లిపూడి వనజ ఎమ్.ఎ, ఎం. ఫిల్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో