దివిటి(స్మృతి కవిత ) – మహమూద్

 

 

 

 

 

భాస్కరుడి వెలుతురుని
ఏడువర్ణాలుగా మార్చే నదీ నీటితరగ

శంభూకుడి తెగిన తలని
ఆత్మగౌరవ పతాకంగా ఎగరేసిన దళిత ధిక్కారం

ఏకలవ్వుడి బొటనవేలిని
కలం చేసి నెత్తుటి పద ప్రవాహంతో
కవన కదనం సృష్టించిన బహుజన దండోర

నీలి నీలి చర్మం మహిళ శ్రమైక సౌందర్యాన్ని
నింగికెత్తి కృత్రిమ చర్మపు తెలుపు ను ఎద్దేవా చేసిన
సహజ జన మైత్రి

డార్జిలింగ్ కొండ ల మీంచి జలపాతంలా
దక్షిణ రక్షక రాత్రులపై జారి
జాగారపు జెండా ఎగరేసే గూర్ఖా చూపుపై
సూర్యుడిని అద్దిన మానవత్వ పరిమళం

వర్తమాన సమాజపు విధ్వంస కోణాన్ని ఆవిష్కరించి
ఖైర్లాంజి హనన చరిత ని దీర్ఘస్వరంలో గానం చేసి
నల్లచర్మం రాత్రులకు కవిత్వపు వెన్నెల లేపనంగా పూసిన
ఆధునిక కవి కళా జాత

అతడు కవిత్వం కన్న
బహుజన స్వప్నం
బహుజన నింగిపై అనునిత్యం మెరిసే
నీలి నక్షత్రం

నిజానికతడు పున్నమి రాత్రుల్లో
చందమామ ఆడే
మాదిగ దండోరా తప్పెట దరువు కోలాహలం
ప్రజా పదాలకు చేదుగుళికలు తినిపించిన
ధిక్కార పదకోశం

వర్ణసమాజపు వంకర తనం పై
సమసమాజ స్వప్నాన్ని నాటిని వెలుతురు దివిటి

(ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ స్మృతికి)

– మహమూద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో