ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు గారు ఇహ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. ముఖ్యంగా మా విద్యార్థి లోకానికి. ఆచార్య ఎండ్లూరి గారు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠం లో నాకు ఎం. ఏ నుండి పాఠాలు బోధించారు.వారి పర్యవేక్షణలో నేను 2018లో పరిశోధకురాలిగా చేరాను.
డిగ్రీ వరకు ఆంగ్ల మాధ్యమం లో చదివిన నాకు తెలుగు స్పష్టం గా చదవడం, రాయడం రాని నాతో,చిన్న చిన్న వ్యాసాలు రాపిస్తూ తెలుగు కవులను వారి కవితా రీతులు,తెలుగు భాష గొప్పదనాన్ని,సాహిత్యాన్ని పరిచయం చేసారు.
నా అక్షర దోషాలను సరిదిద్ది, గురువుగా గద్దించి,తండ్రిలా ఆదరించేవారు సుధాకర్ గారు.
వారు బోధించిన పాఠాలు ఒకసారి వింటే చాలు. పరీక్ష ల్లో చదవకుండా రాసేయవచ్చు.అంతలా అందరికీ అర్ధమయ్యే రీతిలో ఉపమానాలతో పాఠం చెప్పేవారు.
భౌతికంగా సుధాకర్ గారు మాకు దూరమవడం అత్యంత బాధాకరం.సాహిత్యం లో గొప్ప పండితుణ్ణి కోల్పోయాం.విద్యార్థులు గా మెమెంతో నష్టపోయాము.నా సిద్ధాంత వ్యాసాన్ని సకాలంలో సమర్పించలేక పోయాను.వ్యక్తి గతంగా మా కుటుంబ సభ్యుడు మాకు దూరమయ్యారు.మా వారు మూర్తి గారు కూడా సుధాకర్ గారి శిష్యులు. కడసారి చూడలేక పోయాం.ఆధునిక తెలుగు సాహిత్యం లో ఇంత గొప్ప పరిశోధకుడిని, కవి, రచయిత ను చూడలేదు చూడబోము.
-తానంకి సుజాత.
పరిశోధక విద్యార్థి
తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~