కావ్యత్రయ కవితాధారీ (కవిత )-వెంకటేశ్వర రావు కట్టూరి

 

 

 

 

 

ఓ గబ్బిలపుటబ్బీ
ఉన్నావా ఇది విన్నావా
ఈ వార్త నీ చెవినబడలేదా
ఇంకా నారాయణగూడ కి
రాలేదా
కాశీలోనే ఉన్నావా
ఆ కాశీవిశ్వేస్వరుడు నీకు ముందే ఉప్పందించలేదా
మసీదు బండకు పొమ్మని
విశ్వవిద్యాలయమంతా ‘గోసంగి’లా గొంతెత్తి విలపిస్తోంది
కావ్యాత్రయ కవితా ధారి కనుమరుగై పోయిందిదని
తడారిన గొంతుల కూతల మోతలు నీకు వినబడలేదా
డమరుకపు దరువులో
లగ్నమై పోయావా
భాగ్యనగర పురవీధులన్నీ విషణ్ణవదనంతో నిండుకున్నాయి
రాజమహేంద్రగిరులు కరిగి కన్నీటి సంద్రమై పోయాయి
హేమాంగీ నా అర్ధాంగీ అంటూ
నిత్యం కవితాగానం చేసే ఆగొంతు
శాశ్వతంగా మూగబోయింది
సాహితీ శిఖరం
కనుమరుగై పోయింది
ఓ కొత్త గబ్బిలమా…!
మీ గబ్బిలాల రాణి
రెక్కలను తెరచాపగా చేసుకుని
వినీలాకాశంలో ఎదురు పడలేదా
ఒకవేళ నీ కెదురైతే
దివి నుండి భువికి తీసుకు రావయా
నీ శిష్యగణం ఎదురుచూస్తూ ఉందని
ఆ మాటల మంత్రికుని
మంత్రోచ్చారణ కోకిల పలుకులకై
పలకాబలపం పట్టుకు చూస్తున్నారని
అహూ ! ఆంధ్రభోజా
నీ భువన విజయం లో
కవులతో
మా సాహితీ సుధాకరుణ్ణి
కూర్చుండబెట్టావా
ఇలాతలం పైకి పంపించవయా
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ యని
త్రికరణ శుద్దిగా కవితాగానం చేస్తాడు
ఓ దీర్ఘకావ్య కవితావసంతుడా ‘సినారే’
మీ పండిత పుత్రుణ్ణి
దేవలోకం నుండి పంపండయ్యా
సాహితీ పరీమళాలు వెదజల్లుతాడు
మా ఎద నిండుతాది
అమ్మా హేమాంగీ
నువ్వెళ్ళిపోయాక
తరాన్వేషణకై
‘నన్నెవరైనా
దేవలోకం పంపించరా
హేమసన్నిధిలో
దివ్యజీవితం గడిపేస్తానని’
బయలుదేరాడమ్మా
ఆ అలుపెరుగని బాటసారి
నువ్వైనా చెప్పమ్మా
అంధకారంలో అనాథలుగా
విడిచి వెళ్లడం
మీరిరువురికీ భావ్యం కాదమ్మా
నీరు పోసిపెంచి
పందిరికి పాకిన
మీ ద్రాక్ష తీగలు
ఫలాలిచ్చే సమయానికి
హంసల్లా ఎగిరెళ్లిపోతే ఎట్లమ్మా
మీ బంగారు లతలకు ఆధార మెవరమ్మా
ఓ నెలరాజా
సాహిత్య పూలదారీ
కిందికి దిగిరావయ్యా
మాకెవరు నేర్పుతారు
పోరాట పాఠాలు
మీరుతప్ప….

-వెంకటేశ్వర రావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో