జనపదం జానపదం- 23-పర్ధన్ తెగ జీవ విధానం – విశ్లేషణ-భోజన్న

లోకంలో ఒకరు జీవనం గడవడానికి మరొకరు కారణం అవుతారు, అదే సృష్టి ఆరంభం నుండి నేటి వరకు జరుగుతున్నది. ఈ నియమం జీవుల్లోను, జీవుల్లో తెలివైన మానవుడికి కూడా వర్తిస్తుంది. సమాజం ఎప్పుడు అందరిని సమానంగా బ్రతకనివ్వదు, ఎందుకంటే కొందరి సుఖాలకి మరికొందరు వారి సుఖాన్ని త్యాగం చేయవల్సిందే. కాని ఏ రోజు వారి సుఖం చేజారిపోందని వారు భావించరు. ఎందుకంటే ఎంత సమయం ఎదుటి వారు ఆనందాన్ని, సుఖాన్ని పొందడానికి కేటాయిస్తే, అంత మంచి జీవితం వీరు పొందవచ్చుననే భావనలో ఉన్నతులను పొగడడం, చేతులు కట్టుకొని బానిస ఊడిగం చేయడం, మనస్సు చంపుకొని పరిశుద్య పనులను చేయడం, వ్యక్తిగత అవసరాలను తీర్చడం నేటికి సమాజంలో కనిపిస్తుంది.

పర్థాన్ తెగను గోండల వారసత్వ కళాకారులుగా చెబుతాము. వీరు గోండు రాజుల చరిత్రను, వీరుల గాథలను, గిరిజన దేవతల కథలు మొదలైనవి పాడి జీవనోపాధి పొందుతారు. ఈ విధమైన కళాకారులు అన్ని కులాల వారికి ఉన్నట్లు తెలుస్తుంది. ఆశ్రితులు తాము ఆశ్రయించే వారి కంటే తక్కువ సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా కల్గి ఉంటారు.

మానవ జీవితంలో భార్యాభర్తల సంబంధం అది పవిత్రమైనదిగా మనుష్యులు భావిస్తారు. కాని భార్యాభర్తలకు ఇష్టం లేకుండా కలిసి జీవించమని మాత్రం ఈ తెగ వారు చెప్పరు. భార్యా భర్తల్లో విడాకులు తీసుకోవాలనే కోరిక ఉంటే, దానిని తెగ నాయకుడు సమ్మతించి వారికి విడాకులు మంజూరు చేస్తాడు.

ప్రర్ధాన్ తెగకి స్వంత గుర్తింపు, ఆస్తిత్వం అంటూ ఏది లేదు. గోండి తెగ ఉనికినే తమ ఉనికిగా భావిస్తూ ముందుకు సాగుతున్న తెగ. ఈ తెగలో ఎవరిని కదిలించినా, తమ గురించి అడిగినా గోండుల ఆచారాలు, సంప్రదాయలు మొదలైనవి ఎన్నో తాము పాటిస్తామని చెబుతుంటారు.

వీరు మధ్యప్రదేశ్ లో తమను తాము రాజ పుత్రల వారసులుగా, రాజపుత్ర రాజులుగా చెప్పుకుంటారు. గోండులకి వీరు పటోడిలు అంటే వారసత్వ పాటగాళ్ళు అని అర్థం. గోండుల వీర గాథలను, కర్మకాండలు, వివాహాలు, పండుగలు, ఉత్సవాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. పర్ధన్ లు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో ఎక్కువగా కనిపిస్తారు. తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, నిర్మల్ జిల్లాలలో ఉన్నారు. ఇతర జిల్లాలలోను వలసలు వెళ్ళిన కొద్ది మంది అక్కడక్కడ కనిపిస్తారు. వీరు ఎక్కువగా గోండి, మరాఠి భాషలను మాట్లాడుతారు.

పర్థాన్ తెగ బాగోగులు చూసుకోవడానికే ‘‘పంచ్’’ అనే గ్రామ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో గ్రామానికి సంబంధించిన పెద్దలు ముఖ్యమైన స్థానాల్లో ఒక్కొక్కరి చొప్పున ఐదుగురు ఉంటారు.

1.గ్రామ పెద్ద – ఇతని కనుసన్నలోనే గ్రామం మొత్తం ఉంటుంది. ఇతడు గ్రామంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు.
2.మహాజన్ – గ్రామానికి సంబంధించిన ఆర్థిక అంశాలు చూసుకుంటాడు.
3. దేవర్ – దేవాలను పూజారి, ఇతడు దేవుడి కార్యక్రమూలు చూసుకుంటాడు.
4.హవల్దార్ – సమాచారం చేర వేసేవాడు. గ్రామాల్లో వీరిని సుంకరి అని పిలుస్తారు.
5.కారబారి – గూడెం రికార్డులు భద్రపరిచేవాడు. గ్రామాల్లోనూ నేటికి ప్రభుత్వం తరుపున ఉద్యోగం చేస్తూ గ్రామ రికార్డులు భద్రపరిచే ఒక కారబార్ ఉంటాడు.

గ్రామంలో తగువులు వస్తే పిర్యాదు చేసేవారు పటల్ కి పిర్యాదు చేసి, తప్పు చేసిన వారిని అక్కడికి పిలిపించి పంచాయితి పెట్టిస్తాడు. ఈ వ్యవస్థలో ప్రస్తుతం కొంత వరకు మార్పులు జరుగుతున్నాయి. తండాలు, గూడాలు, పెంటలు మొదలైనవి రోజు రోజుకి మారిపోతున్నాయి. వైద్యం, విద్య, రక్షణ రంగాలలో అనేక మార్పులు వచ్చాయి. నాగరికులు వీరి ప్రాంతాలని ఆక్రమించుకోవడం, అమాయక తెగలతో ఆడుకోవడం జరుగుతూనే ఉంది. సెజ్ లని, కూబింగ్ లని, గ్రానెట్, వన సంపద వలన ఎందరో గిరిజనులు తమను తాము కోల్పోతున్నారు. ఆడ వారి మానప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. వాకపల్లి మహిళలకు జరిగిన సంఘటణాల లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో వెలుగు చూసినవి కొన్ని మాత్రమే.

ప్రతి తెగ గురించి లోకానికి తెలిసినవి కొన్ని మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనేది నా భావన. పర్ధాన్ జనాభాను గమనిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 24,823 మంది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లు తెలుస్తుంది. అక్షరాస్యత పరంగా చూస్తే అన్ని తెగల కంటే ఈ తెగ ముందంజలో కనిపిస్తుంది.

పర్ధాన్ లు కళా ప్రదర్శనలో కిక్రి, కేప్రె, డక్కి, కాలికోం వాయిద్యాలను వాడుతూ పాటలు పాడతూ కథలు చెబుతుంటారు. దీనికి ప్రతిఫలంగా ధాన్యం, డబ్బులు, బట్టలు, ఆభరణాలు మొదలైనవి తీసుకుంటారు. గోండులకి వీరు కృతజ్ఞతతో ఉంటారు. పర్ధాన్ తెగ వారికి గోండు తెగ వారికి వివాహ సంబంధాలు ఉండవు, కాని విందు పొత్తు ఉంటుంది. దీనినే మనం కంచం పొత్తు ఉంటుంది కాని మంచం పొత్తు ఉండదని చెబుతాము.

నేడు వీరు రక రకాల పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయం, వేట మొదలైన అటవి సంబంధిత పనులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. వ్యవసాయం, కూలి పనులు, ట్రాక్టర్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. తమకు దగ్గరలోని నగరల్లో, గ్రామాల్లో కూలి పనులు చేసుకుంటున్నారు.

పర్ధాన్ లు గోండిలకు అనుబంధ  తెగలుగా   చెప్పవచ్చు. పూర్వం గోండులతో వీరికి విందు పొత్తు కూడా ఉండేది కాదు, ప్రస్తుతం వీరి సమాజంలో కొన్ని మార్పులు వచ్చి కలిసి భోజనం చేస్తున్నారు. ఈ తెగలోని యువకులు ఇతర పనులు చేస్తుంటే, ముసలి వారు, కొందరు యువకులు గోండులను నేటికి ఆశ్రయిస్తున్నారు.

పర్ధాన్ తెగ ఇప్పుడిప్పుడే ఆధునిక వసతులను అందుకుంటుంది. వీరి పిల్లలు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు, వీరి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారుతన్నాయి. కాని వీరికి సంక్రమించవలసిన ఎన్నో నేడు అందడం లేదని బాధపడడం కనిపిస్తుంది.

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో