పోరాటం అంటే
యుద్ధం కాదు
మౌనంగా ఉంటె
ఓటమీ కాదు
***
చదువుతుంటే
ప్రతి పేజీ కొత్తగా
అది నిజంగా
జీవన గ్రంధం
***
చదువుకున్నానని
గర్వమా !
ఇక నుంచి
బతుకు పాఠం చదువు
***
పొడుపు చేయడం
నేర్చుకో …
తేనెటీగలు
చుక్కచుక్క కూడబెట్టవా !
***
మనిషిని వెక్కిరిస్తూ
పక్షి గుంపు
వాటికి
ఐక్యమత్యమే సోంపు
***