బొమ్మల దెబ్బలాట లో
అన్న దే
Upper hand
కెరీర్ పోరు లో
అన్న కి ఇంజనీరింగ్
నాకు హిస్టరీ దక్కాయి
హర్మోన్ల తాకిడి లో
మోహ తీరాల ముద్దులాటలన్నీ
ప్రేమ గా
భ్రమ పడే పిచ్చిదాన్ని
అయ్య చేతిలో
పెట్టే ప్రయత్నాలన్నీ
ఆనందపు అగాధాలే !
జనారణ్యం లో
జెండర్ స్ప్రుహ
సుషుప్తి లోకి
వెళ్ళేదాక
కొనసాగుతుంటుంది
జీవితం లో
అతనితో సమాంతర యాత్ర లో
పరుగులు తీస్తున్నప్పుడు
జీవనచదరంగం లో
ఏ రంగైనా
నేనే చెక్ మేట్ ని !
-వీరేశ్వర రావు మూల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~