ఎప్పటిలాగానే(కవిత )-బివివి సత్యనారాయణ

ఎప్పటి లాగానే….
తేదీ నెల సంవత్సరం మారింది …
దాని స్థానంలో మరో కేలండర్ వచ్చి చేరింది…
మనముందుకు చేరేందుకు కొత్తగా తేదీలు
నెలలు సంవత్సరాలు ఉబలాట పడుతున్నాయి…
మన ఖాతాలోని రోజులు నెలలు
సంవత్సరాల చీటీలు తెగి పడుతున్నాయి….
మనలో అలలు అలలుగా కలల రాజ్యం కూలిపోతుంటే…
ఉత్సాహం ఉరకలు వేస్తూ
ఆస్థానాన్ని భర్తీచేయాలనే తాపత్రయం…

ఎప్పటిలాగానే……
క్షణాలు నిముషాలు గంటలు రోజులు
మన కళ్ళముందు వడివడిగా నడిచిపోతుంటాయి…
ఉదయాలూ సాయంత్రాలూ షరా మామూలే…
రోజులు మనుషులు మనసులు నలిగిపోతూ …
సుఖాలు సుభాలు అందుకుంటూ …
కాలంతో మమేకమైపోతుంటాం…
ఆశావహ జీవితాన్ని ఎదుటవేసుకుని
జరిగిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ
సాగిపోతుంటాం…
కొందరిని కలుపుకుంటూ…
మరికొందరిని కోల్పోతూ…
కూడిక తీసివేతల నడుమ నలిగిపోతూ
నడయాడుతుంటాము…
ఎప్పటిలాగానే ఇలాంటి నూతన వత్సరాలు
పండగలు పబ్బాలూ మనసులను ఉషోదయంతో
నింపుతుంటాయి…
ఆక్షణాలను అనుకూలంగా ఆస్వాదించడమే మనవంతు…
ఆ శుభాల సంబరాలను పదిలపరచుకుందాం…
యెదలను వెలుగురేఖలవెంట సాగిపోనిద్దాం !!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

-బివివి సత్యనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో