భారత రాజ్యాంగం ` గిరిజన స్త్రీ సమస్యలు(వ్యాసం )-భూక్యా కాశీరామ్‌

ISSN – 2278 – 478

భారతదేశం అన్ని మతాలకు, కులాలకు, సంస్క ృతులకు, వర్గాలకు సమ్మేళన రూపం. అందులో గిరిజన చరిత్ర చాలా పురాతనమైనది, భిన్నమైనది కూడా. అడవుల్లో అనాదిగా తరతరాలుగా జీవిస్తూ, సంస్క ృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి జీవనానికి తోడ్పడుతున్నారని చెప్పవచ్చు. నిజంగా నేటికి కూడా గిరిపుత్రులు ఆటవిక ప్రాంతాల్లోనే జీవించడం విశేషంగా పరిగణించవచ్చు. అయితే గిరిజనుల అభివృద్ధికై భారత రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమం తో పాటు వారికి కొన్ని హక్కులను ప్రతిపాదించారు. వారి కోసం ప్రత్యేక చట్టాలను కూడా అమలు చేయడం జరిగింది. నిజానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు పొందడం లేదనే చెప్పవచ్చు. గిరిజన స్త్రీ తన హక్కులను పొందుతుందా? తమకి స్వేచ్ఛని ఇస్తున్నారా? అంటే అదీ లేదు. గిరిజన స్త్రీ ఆటవిక ప్రాంతం నుంచి తన హక్కులకై పోరాడాల్సిన దుస్థితి నేటికీ ఉందని చెప్పవచ్చు. గిరిజన స్త్రీలకు రక్షణ ఉందా? అంటే తమపై ఎన్నో అత్యాచారాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి.

సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా గిరిజన స్త్రీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు స్త్రీలకు ఎందుకు వర్తించడం లేదు. ఎందుకంటే కొంతమంది గిరిజన స్త్రీలు చదువుకోకపోవడం. నిజానికి వారికి చదువుకోవడానికై పాఠశాలలు నిర్మిస్తున్నారా? అనేది కూడా మనం గమనించాలి. అడవుల్లో పాఠశాలలు నిర్మించి ఉంటే గిరిజన స్త్రీ కూడా ఆధునిక స్త్రీ తన హక్కును ఎలా పొందుతుందో, తను కూడా తన హక్కులను స్వీకరించేది కదా! కాని అలా జరుగుతుందా? అంటే లేదని చెప్పవచ్చు. ‘‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’’ అన్నట్టు ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ ఇంటికి వెలుగునిస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఆటవిక ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజన స్త్రీల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది? వారికి అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా అభివృద్ధి పంథాలో నడుస్తారు.
నేటికీ గిరిజనులపై ఎంతోమంది దోపిడీ చేస్తూ భయపెడుతూ సమాజానికి దూరంగా జీవించేటట్టు చేయడం జరిగింది.

అటువంటప్పుడు వారు జాతి జీవనం అడవులకే పరిమితం అయ్యింది. ఈ మధ్య కాలంలో కొంతమంది స్త్రీలు తమ హక్కులు సాధించడం కోసం పోరాడుతున్నారు. అయితే అక్కడ సరైన న్యాయం జరుగుతుందా? అనేది గమనించాలి. కొంతమంది స్త్రీలు ఉన్నతవిద్య అభ్యసించడంతో ఉన్నత ఆశయాలపైవు అడుగేస్తున్నారు. కాని అక్కడ కూడ వివక్షతను చూపిస్తున్నారు. దానివల్ల వారి ఆశయాలు నిరాశలుగా మిగిలిపోతున్నాయి.

విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు న్యాయంగా ఇస్తున్నారా? అంటే అదికూడా లేదని చెప్పాలి. అటువంటి సమయంలో వారు ఇంకా ఆసక్తిని కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల ఇంటికే పరిమితం అవ్వాల్సిన దుస్థితి ఉంది. ఇటు స్త్రీ చదువుకై పోరాడుతూనే, సమాజంలో కొంతమంది దుర్మార్గుల పాలిట శాపంగా మారుతుంది. మహిళల జీవితాలకు, గౌరవానికి, స్వేచ్ఛకు ఇసుమంతైనా విలువ లేని సమాజంలో జీవిస్తున్నారు. స్త్రీలకు గౌరవం ఇవ్వడంలోను, వారికి జీవించే హక్కును నిలబెట్టడంలో ఈ దేశపు వైఫల్యం అత్యంత విషాదంగానే ఉందని చెప్పాలి. బాలికలు, యువతులపై సాగుతున్న అత్యాచారాలు, ఆపై హత్యలు, నిందితులకు శిక్షలు పడకుండా కాపాడుతున్న దుర్మార్గపు వ్యవస్థ తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి.

పసికందుల నుంచి ముసలమ్మల దాకా నేడు స్త్రీపై జరుగుతున్న అసంఖ్యాక లైంగిక అత్యాచారాలు మహిళల్ని భయానికి గురిచేస్తున్నాయి. స్త్రీలకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు,
రైళ్ళు, పని ప్రదేశాలు ` ఎక్కడ కూడా భద్రత లేకుండా ఉన్నాయి.

ఉదాహరణకు ‘‘వాకపల్లి’’ విశాఖ జిల్లాలో గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాలు రాష్ట్రమంతా కలకలం రేపిన ఘటన. అయితే ఆ కేసు దశాబ్దాలు గడిచినా తీర్పు ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు సీరియస్‌ కూడా అయింది. మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో ‘వాకపల్లి’పై దండెత్తిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్ళి తనిఖీ చేయడంతో అక్కడనున్న గిరిజన మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో 13 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాని పోలీసులపై తీర్పు ఇవ్వకపోవడం జరిగింది. ఈ విధంగా గిరిజన స్త్రీలు ఇలాంటి ఎన్నో విషయాలపట్ల అన్యాయం అవుతున్నారని చెప్పవచ్చు. నిజానికి యస్‌.సి., యస్‌.టి. చట్టాలు ఉన్నప్పటికి వాటిని తప్పుదోవ పట్టించే వ్యవస్థ కూడా ఉందని గమనించాలి. అలాగే కర్నూలు జిల్లాలో భర్త కళ్ళముందే గిరిజన స్త్రీపై అత్యాచారం జరిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. తర్వాత గిరిజన సంఘాలు పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి చేసినప్పుడు తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అత్యాచారాలు కంటికి కనపడనివి ఎన్నో రోజూ జరుగుతున్నాయి. అయితే నిజానికి అగ్రకులాల వారి కంటే వీళ్ళకి ఎందుకు ప్రాధాన్యత లేదు అంటే, గిరిజనులు ప్రశ్నించలేరు అనే ధీమా కాబట్టి పై దాడులు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులుకు, స్వేచ్ఛకు భంగం కల్గిస్తున్నారు అని తెలుస్తుంది.

ఈ విధంగా గిరిజన స్త్రీ సమాజంలో భ్రష్టు పడుతున్న దుర్మార్గపు వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులకు లోనవుతుందని తెలుస్తుంది. తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, హక్కులను పొందకుండా అన్యాయం చేస్తున్నారు. సమాజం పురోగతి చెందాలంటే ముందుగా స్త్రీలకు సమన్యాయం ఇవ్వాలి. రాజకీయంగా, సామాజిక పరంగా స్త్రీ అప్పుడే రాణిస్తుంది. ఆటవిక ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకి రావడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు గిరిజనులకు ప్రత్యేక సదుపాయాలు, భద్రతలను ఏర్పాటు చేసి, వారిని ప్రోత్సహించి, అభివృద్ధి పయనానికి సహకరించాలి. అప్పుడే గిరిజన స్త్రీకి న్యాయం జరిగినట్టు లెక్క. ఒక గిరిజన స్త్రీనే కాదు, దేశంలో అనేక మంది స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.
స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌది అరేబియా లాంటి దేశాలలో స్త్రీలను అత్యాచారం చేస్తే తల నరికేస్తున్నారు. అప్పుడే మానవ మృగాలు హద్దులు దాటకుండా తప్పు చేయరని వారి ఉద్దేశ్యం. మన దేశంలో కూడా ఇటువంటి కఠిన శిక్షలు వేస్తే గాని స్త్రీలపై దాడులు కొంత మేరకైన రూపుమాపడం జరుగుతుంది.

ఆధారగ్రంథాలు :
1. డా॥ పి. రమేష్‌ నారాయణ, గిరిజన సంస్క ృతి ` సాహిత్యం. 2015, అనంతపురం.
2. మిట్ట వేణుగోపాలం, ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజన జీవన చిత్రణ. 2008, హైదరాబాద్‌.
3. డా॥ ఎం. గోనానాయక్‌, భారతదేశంలో బంజారాలు. 2005, తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరబాద్‌.
4. ఎం. సూర్యనారాయణరావు, ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సముదాయాలు. 2005, తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్‌.
5. అంతర్జాల వ్యాసాలు.

-భూక్యా కాశీరామ్‌
పి హెచ్‌.డి. పరిశోధక విద్యార్థి
తెలుగు శాఖ
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో