కొలకలూరి నవలలు – హక్కుల ప్రతిఫలనం(వ్యాసం )-సుజిత రెడ్డి

ISSN – 2278 – 478

వ్యక్తి సంపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులు. వ్యక్తుల చేత కొరవడి, సమాజం చేత ఆమోదించబడి, ప్రభుత్వం చేత గుర్తించబడి, న్యాయస్థానాల ద్వారా అమలయ్యే పరిస్థితులను డిమాండ్లను హక్కులుగా పేర్కొంటారు. ఇంకా చూస్తే మానవుడు జీవించడానికి, సమాన స్థాయిలో జీవనాన్ని కొనసాగించడానికి హక్కులు ఉపయోగపడతాయి. హక్కులు ప్రపంచంలో రెండు విధాలుగా ఉన్నాయి. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు. ప్రాథమిక హక్కులు ఒక దేశ పౌరసత్వం కలవారికి వర్తిస్తే, మానవ హక్కులు ప్రపంచంలో జీవించే ప్రతి మనిషికి సంబంధించినవి. “ప్రభుత్వం యొక్క గొప్పతనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని” ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్ జె లాస్కీ పేర్కొన్నారు.

 ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కథా రచయి, నవలాకారులు, నాటకకర్త, కవి, విమర్శకులు. 2014లో భారత ప్రభుత్వం జాతీయస్థాయిలో మహా వ్యక్తులకు, మార్గదర్శకులకు ఇచ్చే పద్మశ్రీ పురస్కారం ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిని వరించింది. 2015లో భారతీయ జ్ఞానపీఠ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి. 2018లో “విమర్శి ని “ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఇనాక్ గారి నవలా సాహిత్యంలో స్వేచ్ఛ సమానత్వ కాంక్ష, హక్కుల నిరాకరణ, హక్కుల అణచివేత, హక్కుల పోరాటం, హక్కుల సాధన అత్యధికంగా కనిపిస్తాయి.

 పీడనాన్ని నిరోధించే హక్కు :

ప్రాథమిక హక్కులలో పీడనాన్ని నిరోదించే హక్కు ఒకటి. ప్రకరణ 23(1) ప్రకారం మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టిచాకిరిని ఈ ప్రకరణం నిషేధిస్తుంది. వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా ఏ పని చేయించరాదు. మానవులతో చేయడం అంటే స్త్రీలను అను ఇద్దరు దేశాలకు అమ్మి వేయడం, లైంగిక వేధింపులు మొదలైనవి ఈ ప్రకరణ కిందకు వస్తాయి. ఈ కోవకు చెందినదే ఇనాక్ గారి అనాథ నవల. అనాథలైన నలుగురి స్త్రీల జీవితాలు ఎగుడుదిగుడుగా నడవడాన్ని చిత్రించిన నవల. వేశ్య కులంలో పుట్టిన పోలి దేవత వంశంలో పుట్టిన పోలయ్య భార్య కావడం వల్ల పోలమ్మ అయింది. పెళ్లికి ముందు నాట్యం చేస్తూ విచ్చలవిడిగా బ్రతికిన స్త్రీ తన అందచందాలతో, సౌందర్యంతో జనాన్ని ఆకర్షిస్తూ దేవదాసీ తనన్ని తలపించే జీవితం ఆమెది. నాటకలాడే సమయంలో పోలేరయ్య పోలిని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి జరిగినప్పటి నుంచి గౌరవంగా జీవిస్తుంది. ఏడాదికొకసారి జరిగే పోలేరమ్మ జాతర లో గిత్తను నరకడానికి ఎత్తిన కత్తి జారి మెడ మీద పడి పోలేరయ్య చనిపోవడంతో పోలి అనాథ అయింది. పోలేరు అయ్య చనిపోయేనాటికి ఆమెకు ఒక కురూపి కూతురు పుట్టింది.

పోలేరయ్య చనిపోయిన నాటినుండి పోలికి కష్టాలు మొదలవుతాయి. చుట్టుపక్కల మగవారి కళ్ళు ఆమె మీద పడతాయి. చివరకు పని వాడు సైతం ఆమెను బలాత్కరించిన వైనం ఈ నవలలో కనిపిస్తుంది. పోలిని అర్థం చేసుకున్న పనివాడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.. లైంగిక వేధింపులకు గురైన పోలి చివరకు అందులో నుండి బయటపడి తనను తాను రక్షించుకుంటుంది. నేటి సమాజాన్ని తీసుకుంటే అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. వావివరసలు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. పసి ప్రాయాలను బాల్యంలోనే చిదిమేస్తున్నారు.. వెంటాడి వేటాడి కిరాతకంగా అత్యాచారాలు చేయడం సమాజంలో సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్లకి ప్రభుత్వం కఠినమైన శిక్షలను విధించడమే కాకుండా వాటిని అమలులోకి తీసుకు రావాలి.

వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు :

ప్రాథమిక హక్కులలో వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మరొకటి. ఇందులో ప్రకరణ 19-22 వరక హక్కులను వివిధ స్వేచ్ఛల రూపంలో పొందు పరిచారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా విలువైనవి. కానీ స్వేచ్ఛ పైన కూడా హేతుబద్దమైన పరిమితులు విధించవచ్చు.

ఇనాక్ గారు రాసిన నవలల్లో సౌందర్యవతి నవల ఈ కోవకు చెందినదే. ఈ నవలలో కాలేజిలో లెక్చరర్ గా పనిచేస్తున్న రాము 30 పెళ్లి చూపులకు తన తండ్రి స్నేహితుడైన శంకరం ఇంటికి వెళ్తాడు. ఆయనకు కుమార్తెలు. రామం చిన్న కుమార్తె అనంతను అంతకుముందే బస్టాండ్ లో లో చూస్తాడు. శంకరం పెద్దకుమార్తె సమంతను పెళ్లి చూపులకు సిద్ధం చేసి తీసుకువస్తారు. రామం చిన్న కుమార్తెను కూడా తీసుకురమ్మని చెప్పగా శంకరం, జగన్నాథం మధ్య ఉన్న స్నేహం కారణంగా ఇద్దరిని చూపిస్తారు. అందులోనూ చలాకీతనంలోనూ, చురుకుదనంలోనూ ధీటుగా ఉన్న చిన్నమ్మాయి అనంతను కాదని పెద్దమ్మాయి కావడం అనే కారణంతోను, సంసారపక్షంగా ఉందన్న కారణం తోనూ, అనంత లాంటి స్త్రీకి తాను తగనేమోనన్నకారణంగానూ రామం శమంత నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఐతే యవ్వన గర్వంతో ఉన్న అనంత తను రామానికి నచ్చలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అతనిమీద ఉన్న ఇష్టం కన్నా తననెందుకు పెళ్లి చేసుకోలేదన్నా ప్రశ్న ఆమెకు బేతాళ ప్రశ్నలాగా జీవితాంతం వేధించి, వ్యభిచారిని చేసి, పిచ్చిదాన్ని చేసి పతనావస్థకు నెట్టింది.

వేరొకరి భార్యగా అనంత వెళ్ళినా కూడా అక్కడ ఉండలేక భర్తకు దూరమయి వేశ్యగా మారుతుంది. మరొకసారి సన్యాసిగా మారుతుంది. చివరకు పిచ్చిదానిలా రామానికి ట్రైన్ లో కనిపిస్తుంది. దీనికి కారణం అనంతకు మితిమీరిన స్వేచ్ఛ ఉండటమే. భర్త పట్టించుకోలేదు తండ్రి మంచి-చెడు చూడలేదు. మితిమీరిన స్వేచ్ఛతో జీవితాన్ని నాశనం చేసుకుంది. చివరకు రామం ఒడిలోనే ప్రాణాలు విడుస్తుంది. ఒక మనిషికి వ్యక్తిగతంగా ఎంత స్వేచ్ఛ ఉన్న ఆ స్వేచ్ఛ పతనానికి దారితీసేదిగా ఉండకూడదు. నేటి యువత కూడా స్వేచ్ఛను అధిగమిస్తూ చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరిన స్వేచ్చను ఇవ్వకూడదు. ఎందుకంటే దానిని జీవితానికి ఉపయోగకరంగా మలచుకునే వాళ్ళు తక్కువగా ఉంటే దుర్వినియోగం చేసేవాళ్ళు అధికంగా కనిపిస్తున్నారు. కాబట్టి వ్యక్తికి స్వేచ్ఛ ఉండడం అనేది తప్పు కాదు కానీ దానిని ఉపయోగించే నేర్పు ఉండాలి. జీవితాలను సుఖమయం చేసుకోవాలి లేదంటే సౌందర్యవతి నవలలోని అనంతలాగా జీవితం చిత్రమవుతుంది.

 సమానత్వపు హక్కు :

ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు ఇంకొకటి. ఇందులో 14 ప్రకరణ నుంచి 18 ప్రకరణ వరకు పొందుపరిచారు. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్వయం అనుగుణంగా పొందుపరిచారు. చట్టం ముందు అందరూ సమానులే అంటే దేశంలో ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. వ్యక్తి హోదా, గౌరవంతో సంబంధం లేకుండా హక్కులు కల్పించబడ్డాయి. ఏ వ్యక్తికి ప్రత్యేక మినహాయింపులుగాని, హక్కులు గాని కల్పించలేదు. ప్రధానమంత్రి నుండి అతి సామాన్య వ్యక్తి వరకు వారు చేసిన తప్పులకు చట్టపరంగా సమానంగా బాధ్యత వహించాల్సిందే. 15వ ప్రకరణంలో మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే అయిదు రకాలైన వివక్షతలను పాటించరాదు. కానీ వీటిని ఎవరు పాటించడం లేదు. మానవుల జీవితాలనే కథలుగా నవలలుగా రాసిన ఇనాక్ గారి రచనల్లో ఎక్కువ శాతం కులానికి సంబంధించినవి కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన నవలే ఇరులలో విరులు.

ఇద్దరు దళిత యువతులు, ఒక దళితేతర కులానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య నడిచిన ప్రేమకథ ఇరులలో విరులు నవల ఇతివృత్తం. రమ పేదింటి పిల్ల. చిన్న వయసులో తండ్రి మరణించినా ఎం.ఏ చేరేనాటికి ఉత్త చేతులతో మిగులుతుంది. వచ్చే కొద్దిపాటి స్కాలర్షిప్ తో పస్తులు వుండి చదువుకుంటుంది. జానకి కూడా దళిత స్త్రీ. కానీ ఆమె తండ్రి జానయ్య క్రైస్తవ మిషనరీల ద్వారా మత మార్పిడి చేసుకున్న దళిత క్రైస్తవుడు, లక్షాధికారి. రమ క్లాస్మేట్ రామం హరిజన విద్యార్థి కల్లాకపటం తెలియని మనిషి. స్త్రీ డబ్బు ఏకకాలంలో ఉంటేనే జీవితం అర్థవంతంగా ఉంటుందని అతని ఫిలాసఫీ. సుందరం కూడా రమ, జానకి, రాములతో కలసి ఎం. ఎ చదువుతున్నాడు. ఏకైక సంతానం స్వతంత్రంగా ఏ పని చేయలేని మనిషి. తండ్రి అంటే భయం వంట మనిషిని తెచ్చుకొని రూమ్ తీసుకుని ఉంటూ కాలేజీకి బైక్ మీద వెళ్లేంత స్థితిపరుడు.

జానకితో ప్రేమలో ఉన్న సుందరానికి తండ్రికి చెప్పడానికి మాత్రం ధైర్యం లేదు. జానకితో ఉన్న ప్రేమ శారీరకంగా దగ్గర చేస్తుంది. గర్భవతి అయిన జానకి ఇబ్బందికర పరిస్థితిలో పడుతుంది. సుందరం, జానకి ల తల్లిదండ్రులను పిలిపించి మధ్యస్థం చేయడానికి రాజేశ్వరి ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ ఆస్తిని చూసి జానకి సుందరాన్ని ఇష్టపడిందని అందుకు వెలకట్టి డబ్బు ఇస్తానని సుందరం తండ్రి జానకి తండ్రి జానయ్య తో చెప్తాడు. దానికి ససేమిరా అన్న మీరిచ్చే డబ్బుతో కలిపి నేను డబ్బులు ఇస్తాను. వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి పెళ్ళి చేసుకుంటారని మూర్తితో అంటే దానికి మూర్తి మీతో సంబంధం చేసుకోవాల్సిందే నండి కానీ మీరు క్రైస్తవులైపోతిరి. అదే బాధ అని అంటాడు మొండి పట్టుదలతో ఉన్న మూర్తిని రాజేశ్వరి సుందరం జానకి పెళ్లికి ఒప్పించి కథను సుఖాంతం చేస్తుంది. ఈ నవలలో కుల, మత వివక్ష చూపినా చివరకు దానిని పారద్రోలి కథకు మంచి ముగింపు ఇచ్చారు రచయిత.

ఇరులలో విరులు నవలలో జానకిని సుందరం పెళ్లి చేసుకోవడానికి కులం మతం అడ్డు వచ్చింది. తండ్రి జానకిని డబ్బుతో వెలకడతాడు. జానకినీ కోడలు చేసుకోవాలని ఉన్నమతం అడ్డుగా ఉందని చెప్తాడు. చివరకు మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకుంటాడు. ఈ నవలలో కుల మత వివక్షతను రూపుమాపి హక్కును ప్రతిఫలింప చేశారు రచయిత. ఈ నవలలోలాగే నేటి సమాజంలో ఉన్న వాళ్లు కూడా కులానికి మతానికి రాజీ పడడం లేదు. ఒకరికొకరు చంపుకోవడం వరకు వెళ్తుంది. పరువు హత్యలు మితిమీరిపోతున్నాయి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుకోవడాలు, మతం మార్చుకుంటే వెలివేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి.

భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతానికి చెందినవారు మరొక కులం మతం వారి కంటే ఎక్కువ తక్కువ అని అనుకోవడం వల్ల, మనుషులందరూ సమానులు కాదనుకోవడం వల్ల అంటరానితనాన్ని పాటించడం గతంలో జరిగింది. డాక్టర్ అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు, మానవతావాదులు కుల నిర్మూలన కోసం పోరాడారు కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. భారతదేశంలో ఎందరో ప్రముఖులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారు లేకపోలేదు. కులం పునాదుల మీద దేనిని సాధించలేము. ఒక జాతిని, నీతిని నిర్మూలించలేమని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. ఈ దేశానికి అతి పెద్ద దరిద్రం కులగజ్జి, మాటగజ్జి. ఇవి రెండు దూరం అయితే తప్ప ప్రపంచం బాగుపడదు. కులమతాలు లేని సమాజం లో ప్రజలు ప్రేమ భావంతో కలిసిమెలసి ఆనందంగా హాయిగా జీవించగలరు.

ఇనాక్ గారి నవలలు అన్నీ స్వేచ్ఛ సమానత్వం అనే రాజ్యాంగ మౌలికమైన విలువల పైనే ఆధారపడ్డాయి. సమాజంలో అణచివేయబడ్డ హక్కులను ఎలా సాధించుకోవాలి కనీసం ఎలా సంరక్షించుకోవాలో చెప్పడం కూడా ఉంది. హక్కులు ప్రజలకోసం ఏర్పాటు చేసినవి. కనుక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని ప్రజలు గుర్తించాలి.

-సుజిత రెడ్డి
పరిశోధక విద్యార్థిని
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో