జనపదం జానపదం- 21 -తోటిల జీవన విధానం, ఆచారాలు -భోజన్న తాటికాయల 

ISSN 2278-478


తోటిలు ప్రకృతితో కలిసి పోయి తమకు ఉన్నటువంటి బాధలను, ఆనందాలని నృత్య రూపంలో వ్యక్తపరుస్తారు. తోటిల వంశావళి గోండులని పోలి ఉంటుంది. తోటీలని గోండులు బార్డాల్ (స్వీకర్త)లని, గోండుల ని తోటి లు దాని (దాత)లని పిలుచుకుంటారు. తోటి లు గోండుల వంశ చరిత్రను, ఉత్సవాలలో, కర్మకాండ లో పాల్గొని పాండవులు, అన్నోర, లక్ష్మీదేవి, ఆకాశం, భూమి పుట్టుక, కుల దేవతలకు సంబంధించిన అనేక కథలను దక్ష యజ్ఞం, ఆది పురాణం, కలియుగ నిర్మాణం, నాభిక పురాణం మొదలైన కథలను చెబుతారు.

వీరిలో ఐదుగురు కలకారులుంటారు. ప్రధాన కథలు చెప్పేవాడు, ఇతనికి వంత పాడే వాడు, హార్మోనియం, మద్దెల, తాళాలకు వేరువేరుగా వ్యక్తులు ఉంటారు. కుర్రాజులుగా తోటి దగ్గ వారందరిని పిలువరు పద్మనాయక వృత్తాంతమును పాఠం ఆధారంగా చెప్పే తోటి వారిని మాత్రమే కొర్రాజులుగా పిలుస్తున్నారు. కొర్రాజుల పటం కథ (తోటి) ఎంతో ప్రసిద్ధమైనది. వీరికి పోషకులుగా నాయికపోడు తెగను చెపుతారు.
ఈ నాయికపోడు తెగ వారికి పద్మనాయక వృతాంతాన్ని పటం ఆధారంగా కులోత్పత్తి గాథలను చెపుతారు. వీరికి హక్కు గల గ్రామాలకు రెండు సంవత్సరాలకొకమారు వెళ్లి వీరి కళని ప్రదర్శించి త్యాగాన్ని పొందుతారు. వీరు వినాయక పూజతో మొదలుపెట్టి పాండవులను స్పరిస్తూ పగటి వేళల్లో ఐదు రోజులు కథలు చెబుతారు. ఈ క్రమంలోనే బోనాలు తీయడం, లక్ష్మి దేవర పండుగ, బలి మొదలైనవి నిర్వహిస్తారు. లక్ష్మిదేవి కళ్యాణం శోతలకు అత్యంత ప్రీతి పాత్రంగా చెబుతారు.

తోటి వారిని బిరుదు గోండ్ అని కూడా అంటారు. వీరు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. వీరిలో కొందరు వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళారు, వారినే కొర్రాజులని పిలుస్తున్నారు. తోటిలు రాజ్ గోండులకి వారసత్వ పాటలు పాడుతూ పరిసర ప్రాంతాల్లో నే జీవిస్తుంటారు. మరికొందరు వైద్యం మొక్కలు సేకరించి దగ్గరలోని గ్రామాల్లో అమ్ముతారు. తోటి స్త్రీలు గోండి స్త్రీల చేతులపై, ఎదలపై భుజాలపై, మొఖంపై పచ్చబొట్లు వేస్తుంటారు. శివుడు ఆమృత భాండాగారానికి సేవకుడిని నియమిస్తే దానిలో పడిన ఈగను చేతిలో తీసి వేస్తాడు. అది చూసి కోపగించిన శివుడు అతని చేతిని నరికి వేస్తాడు. దీనిని గోండి భాషలో ట్యోటల్ అంటారు. అదే తోటిగా మారిందని పండితుల అభిప్రాయం. తోటిలకి ప్రత్యేకమైన స్వంత భాష లేదు. వీరు గోండి భాషలోనే మాట్లాడుకుంటారు మరియు కథలు చెబుతారు. గోండు రాజులకు వారి తరతరాల చరిత్ర చెప్పడం, వివాహ సంబంధాలు చూడడం వారి బంధుత్వాలను తెలపడం విధిగా చేస్తుంటారు. వీరు కికిరి, కుజ్జా, డక్కి, కాలికామ్, ప్రేపేరే వాయిద్యాలను వాయిస్తూ మహాభారత కథలు, అల్లీ రాణి, సాని పాట, మూల స్తంభం, జంగు బాయి, జల్లిదేవర చరిత్ర కథలు చెబుతారు.

ఒకే రకమైన ఇంటి పేరు కల్గిన తోటిలు మాత్రమే కథలు చెప్పడానికి గోండి ఇంటికి హక్కుగా వెళతారు. ప్రతిఫలంగా పశువులను, డబ్బులను, బట్టలను పొందుతారు. కలిసి భోజనం చేసే హక్కు వీరికుంది గాని వివాహ సంబంధాలకు హక్కు లేదు. తోటిలు ఆదిలాబాద్ నుండి వలసలుగా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, ఘనపురం, బాపుపేట. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పోలారం, తిమ్మంపేట, కటక్షపూర్. గీసుకొండ మండలంలోని బొడ్డు చింతపల్లి, అనంతరం. ములుగు ఘనపురం మండలంలోని నగరం పల్లి, కొత్తూరు. నర్సన్న పేట మండలం రేగొండ మండలం స్టేషన్ ఘనపురం, ధర్మ సాగర్ మండలంలో హనుమకొండ మండలోలంలోని కొన్ని గ్రామాలలో నివసిస్తున్నారు. నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, వరంగల్ జిల్లలాలో వీరు జీవిస్తున్నారు.

వరంగల్ జిల్లాలో మెస్రమ్, కొడవ, గేడం, ఆత్రం, సోయం, కుమ్రం, సిడ్మాకి అనే ఇంటి పేర్లు కలిగిన తోటి కులస్తులు నివసిస్తున్నారు. వీరు వలస వచ్చిన చోట మొదట గోండి భాషనే మాట్లాడేవారు. అక్కడి ప్రజలు చులకనగా చూడడం వలన గోండి భాషని మాట్లాడడం మానివేయడమే కాకుండా తమ ఇంటి పేర్లను సైతం మార్చుకున్నారు. అవి : కుమ్రం – కుమ్మరం, ఆత్రం – ఆకుల, కొడప – గుర్రపు, సోయం – సోమ, సెడ్మాకి – శ్రీ రాముల, గెడం – జ్ఞానంగా ఇంటి పేర్లను మార్చుకున్నారు.

కీకిరి అనే వాద్యానికి బదులుగా వీరు తంబురా, కిన్నెర బుర్రలని వాడుతున్నారు. జ్ఞానం కనకయ్య (పోలారం), సోమ సారయ్య (మద్దునూరు), సోమ వీరయ్య, సారయ్యల బృందం (కడిపికొండ), శ్రీరాములు సమ్మయ్య (కొత్తూరు), జ్ఞానం సహదేవుడు (కటాక్షపూర్), గుర్రం సారయ్య (పెద్దంపల్లి) ఆకుల మురళి (అనంతారం) మొదలైన వారు పురాణాలు, ఇతిహాసాలను నాయికపోడు వారికి చెబుతుంటారు. తోటిల కంటే ముందు పూజారి అనే తెగ నాయికపోడు వారికి ఆశ్రిత కులంగా ఉంటూ కథలు చెప్పేవారు. వీరి దగ్గర వంత పాటలు పాడడానికి తోటిలు ఉండేవారు. పూజారి తెగ రానురాను కనుమరుగౌవడం వలన తోటిలు ఆశ్రిత కులంగా మారిపోయారు. ఆదివాసిలు అభివృద్ధి చెందడానికి ఆదివాస ప్రాంతంలోని వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు 2015 నుండి ఐటిడిఎ స్టార్స్ 30, సూపర్ 30 పథకం కింద వీరికి సహాయం అందిస్తుంది.

గిరిపోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ద్వారా పౌష్టికాహారం అందే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఐటిడిఎ పి.ఓ భావేశ్ మిశ్రా బిబిసితో చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 134 ఆశ్రమ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నడుస్తున్నాయి.

-భోజన్న తాటికాయల 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో