పల్లవి:
రాజులరాజు జన్మించెను పశులపాకలో,
రక్షకుడై ఇలా ఉదయించెను బెత్లహేములో,
ఆ రాజే యేసని రక్షకుడే మన క్రీస్తని,
శుభ సందేశము క్రిస్మస్ పాపికి రక్షనే క్రిస్మస్.
చరణం1:
దూత తెల్పెను ఈ శుభవార్త,
మార్గము చూపును ఆనింగి తార,
గొల్లలు జ్ఞానులు యేసును చూచిరి ,
కానుకలిచ్చిరి యేసుకు మ్రొక్కిరి,
శుభ సందేశమే క్రిస్మస్ పాపికి రక్షనే క్రిస్మస్.
చరణం2:
పరమజనక ఇలని జన్మం,
సర్వ సృష్టికి ఆశీర్వాదం,
పాపపూరిత ప్రపంచమొచ్చిన, పావనమూర్తి జననమే క్రిస్మస్,
శుభ సందేశమే క్రిస్మస్ పాపికి రక్షనే క్రిస్మస్.
చరణం3:
రక్షణ ఇచ్చిన రాజువు నీవు,
తుడచిన వెలుగువు నీవు,
ప్రేమ కనికర కటాక్షములను,
నరునికి పంచిన దేవుడే నీవు (నాధుడే నీవు),
శుభసందేశమే క్రిస్మస్ పాపికి రక్షనే క్రిస్మస్.
-అమృతాల భాస్కర్ రావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~