కార్యాకారణ సంబంధాలు
ఇప్పుడు
ఇక్కడ
అప్రస్తుతాలు
దారికాచిన
చలికీ
వేడికీ
వేడినీ
చలినీ
పరిచయించడమే చెయ్యాలి ఇప్పుడు
నీ ఎదురుగా
వారూ వీరూ
అతడూ ఆమె వున్నప్పుడు
అంతా నీ వాళ్లే
మనో ద్వీపాన మాత్రం
అక్కరకు రాని చుట్టాలు
ఎవరికి తెలియదు
ఈ గిరిగీయని ఆలోచనలు
ఎవరి మనసులో మాత్రం ఉండవు
ఈ నీ నా తరతమ భేదాలు
చెప్పొచ్చేందుకు అందరికీ
ఎవరి గీతలు గీతాలు వారికుంటాయ్
విప్పుకునేందుకు కష్టాల నష్టాల మూటాముల్లెలు
ఎప్పుడూ సిద్ధంగా ఎదురుచూస్తూ ఉంటాయి
పోనీలే….
పై పై నటనలు కూడా కరువవుతున్న కాలం ఇది
దొరికిన ఏ రంగు రంగుల చిత్రాన్నో చూసి మనసు నింపుకో
కాదూ కూడదూ అన్నావా
నీ అసలు రంగుకు కాలం చెల్లుతుంది
నువ్వు లేదూ లేదూ అంటున్న
నీ మాయామర్మపు అరూపం కురూపమై
విశ్వరూప సందర్శనాన మహా రేటింగ్ పలుకుతుంది
నీ కన్నీటి గలగలలను తుస్సుమనిపిస్తుంది
నువ్వూ అదే తాను ముక్కవని విస్పష్టపరుస్తుంది….
-సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~