యువతరంగమై(కవిత )-వెంకటేశ్వరరావు కట్టూరి

 

 

 

 

ఆమె
నలిగిన నల్ల కలువల
వ్యథల్ని
దగ్గరగా చూస్తుంది
సెల్యులాయిడ్ తెరపై చూపే
ఆ గాజుబొమ్మల
అత్తరు వాసనల తెరవెనుక
బతుకుల్ని
పరిచయం చేస్తూ
అవిటితనం మీ మనసుకు వొద్దంటూ
కొత్తగొంతు(మిళింద)లా ముందుకొస్తుంది
మా వాడ ముఖం చూడండంటూ
నేనూ మాణిక్యాన్నే అంటూ
ఆరోవేలుతో
ఇదీ మా పుర వర్ణన అంటూ
ఏడు చుక్కలనూ కలిపి
సుతారంగా ముగ్గేసినట్టు
మత్తెక్కించే మరుమల్లెల
‘అర్ధజీవి’తపు తల’రాత’లని అందంగా మలుస్తుంది
నువ్వనుకుంటే రాలేదు
నేను(ఉల్ఫత్) పిలిస్తేనే వచ్చావంటుంది
కరిగి పోయిన కాలాన్ని
గిర్రున తిరిగొచ్చే ఉషోదయంలా
తిరిగిరాదంటోంది
నా మనసు సున్నితం మెర్సీ
సుర్మలా భగ్గున మండినా
సెలయేటి ధారలా చల్లబరుస్తా
ఆ జ్ఞాపకాలను
ఒక్కొక్కటిగా నీ కళ్ళనున్న
కాటు’కల’లా తుడిచెయ్ అంటుంది
‘ఉల్లీ నిమ్మ’ల రుచి చూపిస్తుంది
ఆ వెంటనే
‘అమ్మకోలేఖ’రాస్తోంది
ఏదో’ఒకరోజు’
నన్నాదరించమని
‘మైదానంలో నేను’న్నానని
‘బొట్టు’ పెట్టి పిలవండంటూ
‘గౌతమి’పై ఎక్కొచ్చి
‘అంగీకారం’తో
కేంద్ర సాహిత్యపుటవార్డును
‘రివార్డు’ను
అందుకుంటానంటోంది
హేమచంద్రాంతరంగ ‘మానస’యై
మనసారా…

-వెంకటేశ్వరరావు కట్టూరి

(కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకుంటున్న మా మానసకు మనసారా)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో