హైదరాబాద్ విశ్వవిద్యాలయం కేంద్ర యువపురస్కర గ్రహీత అభినందన సభ

కేంద్ర యువపురస్కర గ్రహీత మానస ఎండ్లూరి ని హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారిచే సత్కారం.

2020 సం. కి కేంద్రం ప్రకటించిన యువ పురస్కారాన్ని కేంద్ర ప్రముఖ రచయిత్రి ఎండ్లూరి మానస గారు అందుకోవడాన్ని అభినందిస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపక, విద్యార్థులు సత్కరించటం జరిగింది. అందులో భాగంగా తెలుగుశాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు అధ్యక్షతన మానవీయ విభాగ అధిపతి ఆచార్య కృష్ణ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా మానస గారిని వేదిక మీదకు ఆచార్య గోనానాయక్ ఆహ్వానం పలికారు. ప్రధానంగా కృష్ణగారు మాట్లాడుతూ “యువత ఉద్యమంలోకి రావాలి అలాగే కవిత్వంలోకి కూడా రావాలి. అలావచ్చినవే తెలుగులో అభ్యుదయ, దిగంబర, విప్లవ, దళిత కవితోద్యమాలు. ఆ దృక్పథంతో వచ్చిన మానసుకు అభినందనలు&శుభాకాంక్షలు” తెలియజేశారు. అనంతరం పూర్వ శాఖాధ్యక్షులు ఆచార్య జి. అరుణ కుమారి మాట్లాడుతూ “ఆమె రచనలు నిరంతరం ప్రవహించే నదిలా ఉన్నాయి. ఎన్నో జీవితాల్లోని వేదనా దాహాన్ని తీరిచ్చింది.

తను రాసిన‘అవిటి పెనిమిటి’ కథలో స్త్రీ కోణం బలంగా వ్యక్తపరిచారు. అన్ని అవయవాలు ఉండి కూడా ఉద్యోగిణిగా ఉండే భార్యకు భర్త ఎటువంటి సహకారం అందించరు. వారి ఇంటిలో పనిచేసే వంటమనిషి భర్త శారీరకంగా అవిటివాడిగా ఉన్న భార్యకు ఎన్నో సేవలు చేస్తాడు. చివరికి ఎవరు అసలైన అవిటివాడు అన్నది పాఠకులకే వదిలేసిన విధానం చాలా చక్కగా ఉన్నద”న్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారు మాట్లాడుతూ “సమాజంలో అందరూ బాగుండాలని ఆశించే సహృదయుడు ఎండ్లూరి సుధాకర్ గారు. ఆయన నేను ఒకే కాలంలో పరిశోధనలు ప్రారంభించాం. ఆయన రాసిన గుర్కా కవిత చదివి నేను ఎప్పుడూ ఇచ్చే దానికంటే ఒక పదిరూపాయలు ఎక్కువగా గుర్కావాళ్లకు ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఆయన భార్య కూడా ఒక ప్రముఖ రచయితయిన పుట్ల హేమాలత కూడా రచయిత కావడం వల్ల మానసుకు రచయిత గా రాణించడానికి ఎంతో దోహదపడింది అనుకొంటా. ఆ వారసత్వం కొనసాగించడం ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది.

అయినా వాటిని సవాలుగా తీసుకొని సాహిత్యరంగంలో రాణిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. డా.బి. భుజంగద రెడ్డి ప్రసంగిస్తూ “యువ రచయిత గురించి మా విద్యార్థులు తెలుసుకోవడానికి మంచి అవకాశంతో పాటు ఆమెని గౌరవించుకొనే అవకాశం కూడా ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కథలు ఆలోచింపజేయడమే ప్రధాన లక్షణం. అటువంటి కథలు మానస రాయడం అభినందనీయ”మన్నారు. చివరగా మానస ఎండ్లూరి మాట్లాడుతూ ” నేను విద్యాభ్యాస దశలోనుంచి కులం, మతం గురించి ఎన్నో అనుభవాలు ఎదురైయ్యాయి. ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నివాసమున్నప్పుడు. అక్కడినుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా తక్కువ కుల వివక్ష ఉండడం చూశాను. అంబేద్కర్ గారు మన వాడలను దాటి రమ్మన్నాను. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనము ఇంకా విదేశాలకు వెళితే ఇంకా తక్కువగా కుల వివక్ష ఉన్న వాతావరణం ఉంటుందనిపిస్తుంది. అటువైపు మన అడుగులు పడాలి. ఒక స్త్రీగా నేను వారి జీవితాన్ని స్త్రీవాద కథలు గా రాయడం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవ మహిళలు బొట్టు లేకుండా ఉండడం చూసి అశుభంగా భావిస్తూ ఉండడాన్ని నేను కథలుగా రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఇంకా అగ్రవర్ణాల వారితో సమానంగా పోటీ పడి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా స్త్రీ సాధికారత వైపు అడుగులు సాగలన్నారు. చివరగా డి. విజయ కుమారి గారు సమావేశ ముగింపు పలుకులు పలికారు. వ్యక్తిగత కారణాల ద్వారా ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు, పరిపాల సంబంధిత కారణాల రీత్యా ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి. విజయ లక్ష్మి గారు పాల్గొనలేక పోయిన అభినందనల సందేశమిచ్చారు. కోవిడ్ అనంతరం ఇలా ఒక ప్రత్యక్ష సమావేశాలు జరుపుకోవడం అందరికి ఎంతో ఆనందంగా ఉందన్న భావనను సభలో పాల్గొన్నవారందరు తెలియజేశారు.

-మదన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో