‘ఆత్మ’వంచనలు(సంపాదకీయం )-అరసిశ్రీ

ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో చనిపోతే “ఈ బాధలు ఉండవు కదా?” అన్న ఆలోచన వచ్చితీరుతుంది. దాని కారణం మన ఆత్మీయుల మరణాలు కావచ్చు , నమ్మిన వారి నయవంచ కావచ్చు, ఎదురు దెబ్బలు కావచ్చు లేదా ప్రేమ వైఫల్యాలు, ప్రకృతి నష్టాలు, భరించలేని అవమానాలు అలా ఏవైనా అప్పటి వరకు ఎంత ధైర్యంగా ఉన్న వారినైనా ఒక్కసారిగా అవి క్రుంగ దీస్తాయి.

కానీ మన మీద మనకి నమ్మకం , ఆత్మ విశ్వాసం ఉంటె ఆ ఆలోచనకి కళ్ళెం వేయవచ్చు లేదంటే అంతే ఆ ఆలోచనల వలలో ఒక్కసారి చిక్కితే చేసేదేం లేదు. నిండు నూరేళ్ళ జీవితం ఒక్కసారిగా అర్ధాంతరంగా ఆగిపోతుంది.

కానీ ఆ తర్వాత …

అప్పటికి వరకు మన మీద ఆశలు పెట్టుకున్న మన కన్నవాళ్ళ పరిస్థితి ?. ఇది ఆలోచించినా ఆ ప్రయత్నాన్ని సులువుగానే దాటవేయగలం. కానీ ప్రస్తుతం రాష్టంలోనే కాదు దేశంలోనే ఆత్మహత్యలకు సంబంధించిన నివేదిక చూస్తే పరిస్థితి ఎంత తీవ్రతరంగా మారిపోయిందో అర్ధమవుతుంది.

దేశంలో 2020లో రోజుకు సగటున 31 మంది చొప్పున చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొవిడ్‌ వల్ల మానసిక సమస్యలు అధికం కావడంతో పిల్లల్లో ఆత్మహత్యలు గతంలో కంటే పెరిగాయని నిపుణులు భావిస్తున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల్లో ఆత్మహత్యకు పాల్పడిన వారి డేటాను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. దీన్ని అనుసరించి 2020లో దేశవ్యాప్తంగా 11,396 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారాల వల్ల 1,337 మంది ప్రాణాలు తీసుకున్నారు. అనారోగ్యంతో 1,327 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవిగాక వివిధ సమస్యలతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో స్కూళ్లు మూతపడటంతో పిల్లల్లో ఒంటరితనం, ఆందోళన వంటివి పెరిగి ఆత్మహత్యలు అధికంగా నమోదయ్యాయని సేవ్‌ ద చిల్డ్రన్‌ సంస్థకు తెలియజేస్తుంది.

ఫోన్ కొనివ్వలేదని ఒకరు , డ్రగ్స్ కు అలవాటు పడిపోయి ఆ మత్తులో ప్రాణాలను తీసుకుంటున్న వారు మరికొందరు. అంతేనా సరదాకి , కాస్త ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటను వ్యసనాలుగా మార్చుకుని ఆటలో పాత్ర చనిపోయిందని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం తెలియక అయిపొయింది. వీటన్నింటికి కారణం మానసిక ఒత్తిడి , డిప్రెషన్ . ఆ డిప్రెషన్ జయిస్తే చావాలన్న ఆలోచనలను చంపెసినట్టే.

మనకు కలిగిన బాధ లేదా ఒత్తిడి చిన్నదైనా , పెద్దదైనా మన అనుకున్న వాళ్లకి, తల్లిదండ్రులకో, తోడబుట్టిన వాళ్ళకో , స్నేహితులకో ఎవరో ఒకరికి మన బాధను, మన వేదనను ఓర్పుగా వినే వ్యక్తికి చెప్పుకుంటే డిప్రెషన్ నుంచి బయట పడినట్టే అంటున్నారు నిపుణులు.

ఇప్పటి తరం అందరితోను కలిసినట్టే ఉంటున్నారు. అన్ని పంచుకుంటాము అనుకుంటూనే ఎక్కడో తమని తాము దాచుకుంటూ ఎదుటి వారి ముందు నటిస్తూ భేషజాలకు పోతున్నారు. కారణం తాము ఎక్కడ చులకన అయిపోతమనే భావన. ముందుగా మనల్ని, మన పద్దతులని, ఇష్టాలను, లోపాలను అర్ధం చేసుకున్న వాళ్ళని సంపాదించుకోవాలి. మనకి కలిగే సంతోషాన్ని , బాధను ఎటువంటి సంకోచం లేకుండా పంచుకునే బంధం ఉండాలి. అదే మనకు కొండంత అండ. అది లేనిరోజు మన చుట్టూ ఎంత మంది ఉన్న మనం ఒంటరిగా ఉన్నట్టే. ఆ ఆలోచనలే డిప్రెషన్ కి దారీ తీస్తున్నాయి. మన వాళ్లకి దూరంగా ఉండటానికి మక్కువ చూపేలా చేస్తున్నాయి. చివరికి మమల్ని మనం కోల్పోయే వరకు వెళ్తున్నాం.

డిప్రెషన్ ని జయించాలి అంతే కొన్ని పద్దతులను అలవాటు చేసుకోవడం మంచిది.

*ఏదైనా బాధ కలిగినప్పుడు ఒంటరిగా కుమిలిపోకండి. మీ ఆత్మీయులతో పంచుకోండి.

*బలమైన ఆధ్యాత్మిక భావనలు ఉన్న అవారికి ఆత్మహత్య ఆలోచనలు తక్కువ వస్తాయని కొన్ని అధ్యయనాలలో తేలింది.అందు వాళ్ళ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.

*చాల వరకు మానసిక నిపుణుల వద్దకు వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు. కాని అది మంచి పద్ధతి కాదు. మీ ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు ఆలస్యం లేకుండా మానసిక వైద్యుల్ని సంప్రదించడం మంచి పద్ధతి.

*చదవడం కూడా మంచి పద్ధతి. పాజిటీవ్ థింకింగ్ కోసం విజేతల ఆత్మకథలు లేదా వాళ్ళ ప్రయాణం , సాధక బాధకాలు వంటివి చదవడం అలవాటు చేసుకోవాలి.

*అంతేకాదు మీ మనసులోని బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరా అలాంటి వాళ్ల కోసం ఎన్నో స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. మీ గుండె బరువు దిగేవరకు మాట్లాడ వచ్చు. మనసు తేలిక పడితే సగం సమస్య తీరిపోయినట్టే.

ఎంత పనుల్లో ఉన్న, ఎన్ని సమస్యల్లో ఉన్న మన అనుకునే వాళ్ళతో ఓ పది నిమిషాలు గడపండి చాలు మీ ఒత్తిడి మటుమాయం అవుతుంది. మనల్ని ఎదుటి వారు వంచన చేయడం జరుగుతుంది కాని మనల్ని మనం ఆత్మ వంచన మాత్రం చేసుకోకూడదు.

-అరసిశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో