జ్ఞాపకం-65– అంగులూరి అంజనీదేవి

ఆ ఊరిలో ఆడవాళ్లంతా పట్టుచీరలు కట్టుకొని, జడలో పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, నుదుటన సిందూరంతో కళకళలాడుతూ వచ్చి ఆ ఇల్లు నిండారు. వారిలో కొందరు హాల్లో వున్న చాపలపై కూర్చున్నారు. కొందరు పెరట్లో అమర్చిన పొయ్యిల దగ్గర నిలబడి వంటలు చూస్తున్నారు. కొందరు సంలేఖను పెళ్లికూతుర్ని చేస్తూ గదిలో వున్నారు. రాజారాం వీల్చెయిర్లో కూర్చుని పెళ్లి పనులు చూస్తున్నాడు.

తిలక్ ఇంకా రాలేదు. ఇంట్లో వాళ్లు అతనికోసం ఎదురుచూస్తున్నారు.

కొడుకు రాలేదని సులోచనమ్మ ఏడుస్తుంటే “పెళ్ళి సమయానికి వాడు తప్పకుండా వస్తాడు. నువ్వు ఏడవకు సులోచనా! శుభకార్యం జరిగే ఇంట్లో కంటతడి మంచిది కాదు” అని రాఘవరాయుడు ఆమెకు నచ్చచెప్పి ఓదార్చాడు.

అప్పుడొచ్చాడు తిలక్. నలుగురు స్నేహితుల్ని వెంటబెట్టుకొని వచ్చాడు.

ఒక స్నేహితుడు తిలక్ ని పట్టుకొని ఆపుతూ “నా మాట విను తిలక్! ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ఇది నీ చెల్లెలు పెళ్లి. నీకు కొన్ని బాధ్యతలు వున్నాయి” అన్నాడు.

వాళ్లెంతగా ఆపుతున్నా తిలక్ ఆగకుండా సంలేఖను పెళ్లికూతుర్ని చేస్తున్న గది ముందుకి వచ్చి ఆగాడు.
అక్కడ వేలాడుతున్న బంతిపూల తోరణాలను గుప్పెటితో పట్టుకొని “ఏడి మా నాన్న? ఎక్కడున్నాడో వెళ్లి చూడరా! కన్పిస్తే తిలక్ వచ్చాడని చెప్పు” అంటూ ఒక స్నేహితుడ్ని చేత్తో నెట్టాడు.

అతనలా నెట్టగానే పదడుగుల దూరం వెళ్లి పడ్డాడా స్నేహితుడు. ఇంక ముగ్గురు స్నేహితులు మాత్రమే తిలక్ పక్కన వున్నారు.

తిలక్ గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు రాఘవరాయుడు.
“వచ్చావా తిలక్! నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నాంరా!” అంటూ ప్రేమగా కొడుకువైపు చూసుకున్నాడు.
“ఆ… వచ్చాన్లే” చిరాకు పడుతూ అన్నాడు తిలక్.

రాఘవరాయుడు అదేం పట్టించుకోకుండా “నువ్వు రావేమోనని మీ అమ్మ ఏడుస్తోందిరా! వెళ్లి కన్పించు. వీళ్లు నీ స్నేహితులా? రండిబాబు! మీరిలా కూర్చోండి” అంటూ వాళ్లకి మర్యాద చేయబోయాడు.

తండ్రి వేపు వంకరగా చూసి “ఏం నటి స్తున్నావు నాన్నా! సబ్ రిజిస్ట్రారాఫీసు దగ్గర నన్ను భయపెట్టి, మాయచేసి పొలం అమ్ముకొని డబ్బులు తెచ్చుకున్నావు. అందులో ఒక్క రూపాయి అన్నా నాకు ఇచ్చావా? ఏం ఆ సొమ్ము నేను తినకూడదా? నేను బసవరాయుడికి మనవడ్ని కాదా?” అన్నాడు.
బిత్తరపోయాడు రాఘవరాయుడు.

వెంటనే ఒక స్నేహితుడు తిలక్ నోరు మూసి “నేను ముందే చెప్పాను. తాగితే నువ్వు మనిషివి కాదని. మనం ఇక్కడో క్షణం కూడా వుండొద్దు. పద బయటికి పోదాం” అన్నాడు.

నోటి మీద వున్న స్నేహితుని చేతిని లాగేసి “నువ్వారా నాకు చెప్పేది? తాగితే వాంతి చేసుకునే ముఖం నువ్వూనూ. ఎలా తాగితే వామిటింగ్ కాదో నీకు నీట్ గా తాగడం నేర్పింది నేనే కదరా! కొంచెం కూడా కృతజ్ఞత లేదా? ఇది డబ్బు మేటర్రా! తాగుబోతు వెదవా!” అంటూ అతన్ని నెట్టాడు.
అతను కూడా ముందు స్నేహితునిలాగే వెళ్లి అవతలపడ్డాడు.

ఇంక ఇద్దరు స్నేహితులు మాత్రమే అతని పక్కన వున్నారు.
తిలక్ ని చూస్తుంటే రాఘవరాయుడికి ఊపిరి ఆగిపోయేలా వుంది.
పెళ్లికూతురు అన్నయ్య తాగి వచ్చాడని తెలిస్తే వియ్యంకులు అసహ్యించుకుంటారు.

కొడుకు చేత తాళి కట్టనివ్వరు. అదే ఆయన భయం.
కొద్దిదూరంలో వున్న రాజారాం అదంతా గమనించి తండ్రివేపు కంగారుగా చూస్తూ వీల్ చెయిర్లోంచి లేచి నిలబడి వాకర్ సాయంతో నడుచుకుంటూ వచ్చాడు.

“సమయం, సందర్భం లేకుండా ఏంటిరా నీ గోల? చెల్లి పెళ్లి జరగాలా వద్దా!” అంటూ తమ్ముడ్ని నిలదీశాడు.

రాజారాం వైపు నిర్లక్ష్యంగా చూసాడు తిలక్.
పక్కనున్న స్నేహితుడికి అది నచ్చక “తాగితే నీతిని తన్నెయ్యాలా తిలక్! ఇప్పుడు చూడు నువ్వు తాగింది మొత్తం నీ బుర్రనెలా తొల్చేసిందో! అందుకే పెళ్లికి వెళ్తూ తాగొద్దన్నాను” అంటూ భుజం పట్టుకున్నాడు.
తిలక్ అతనివైపు నొసలు చిట్టించి చిరాగ్గా చూస్తూ “నువ్వేమన్నా తాగనోడివా! అందరికన్నా ముందు తాగింది ఈరోజు నువ్వే!” అంటూ తన భుజంమీద వున్న స్నేహితుని చేతిని లాగేసి నెట్టాడు.
ఆ స్నేహితుడు కూడా వెళ్లి అవతల పడ్డాడు.

వణుకుతున్న తండ్రిని చూసి “భయపడకు నాన్నా! మనకి ఇదో గడ్డు సమస్య. దీన్ని నువ్వు ఎదుర్కోవాలంటే ఆత్మస్థాయిర్యం అవసరం” అన్నాడు రాజారాం.

తిలక్ ఒకరకంగా నవ్వి “మరీ అంత ఎక్కువగా వణక్కు నాన్నా! నరాలు అదిరి ఇప్పుడే చస్తావు. అయినా నేనేమైనా యముడినా అన్నయ్యా! ఆయన కొడుకుని. ఏదో కడుపు మండి నా అవసరాలను, హక్కులను గుర్తు చెయ్యటానికి వచ్చాను” అన్నాడు.

“ఎన్నిసార్లు గుర్తు చేస్తావురా నీ హక్కుల్ని, అవసరాలని. నీకేం తక్కువ చేశానని. పెంచాను, చదివించాను. ఇంకా యేం చేయాలి నీకు?” అన్నాడు రాఘవరాయుడు. ఆయనకు వణుకు తగ్గి కోపం పెరిగింది.

అంతలో రాఘవరాయుడు భుజం మీద ఎవరిదో చేయిపడినట్లే తిరిగి చూశాడు. భరద్వాజ మాష్టారు నిలబడి వున్నాడు.

“మాష్టారూ! చూస్తున్నారా! వీడెంత రభస చేస్తున్నాడో!”
“నువ్వుండు రాఘవయ్యా! ఆవేశపడకు. నేను మాట్లాడతాను. తిలక్ ఏం కావాలి నీకు?” తిలక్ వైపు చూసి అడిగాడు భరద్వాజ.

“పొలం అమ్మిన డబ్బుల్లో సగం డబ్బుల్ని మా నాన్న చేత నాకు ఇప్పించండి మాష్టారూ!” చెప్పాడు తిలక్.
ఆయన ఆశ్చర్యపోతూ “ఆ డబ్బులు నీకు ఇస్తే పెళైలా జరుగుతుంది?”

“ఎందుకు జరగదు మాష్టారూ! జయంత్ కట్నం అడగలేదు”
రాఘవరాయుడు నెమ్మదిగా పెదవి విప్పి “తిలక్ చెప్పేది నిజమే మాష్టారూ! కానీ వాళ్లు కట్నం అడగనంత మాత్రాన ఆడపిల్లను కాపురానికి పంపేటప్పుడు ఖాళీ చేతులతో పంపుతామా? సారెకింద సామాన్లు తీసిస్తానని వాళ్లకి నేను మాట ఇచ్చాను. ఆ డబ్బుల గురించి మరచిపొమ్మనండి వాడిని” అన్నాడు.
మండింది తిలక్ కి “మాట ఇవ్వటానికి నువ్వెవరు? కొడుకులు చచ్చారనుకున్నావా? మాతో మాటయినా చెప్పనవసరం లేదా?”

“నాతో చెప్పాడు నాన్న! నేను ఒప్పుకున్నాను” అన్నాడు రాజారాం వెంటనే.
“నువ్వొక్కడివే కొడుకువా? నేను లేనా? నాతో అవసరం లేదా? నాకా డబ్బులు ఇచ్చేంత వరకు నేనీ పెళ్లి జరగనివ్వను” అంటూ అరిచాడు గట్టిగా.

ఆ అరుపుకి గదిలో వున్న సంలేఖ గుండెలో బాంబు పేలినట్లే లేచి నిలబడింది. ఆమె ఎందుకు నిలబడిందో అర్థంకాక బ్యూటీషియన్ ఆమె భుజాలు పట్టుకొని కూర్చోబెట్టింది. సంలేఖకి కన్నీళ్లు ఆగక మళ్లీ లేచి నిలబడింది.

“మేడమ్! మీరు కూర్చోవాలి. ముహూర్తం టైం దగ్గరపడింది” అంటూ ఆమెను మళ్లీ కూర్చోబెట్టారు. ప్రక్కనే వున్న హస్విత వైపు చూసింది సంలేఖ.

“అన్నయ్య చూడవే ఏం మాట్లాడుతున్నాడో!” అంది.
సంలేఖ చెంపలపై కారే కన్నీళ్లను కర్చీఫ్ తో తుడిచింది హస్విత.

“నువ్వు టెన్షన్ పడకు. ముఖంలో కళ పోతుంది. తిలక్ తో వుండే తలనొప్పి కొత్తేమీ కాదు. నువ్వు ఇంకొద్ది సేపట్లో జయంత్ భార్యవు కాబోతున్నావు. ఆ తర్వాత నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు. ఈ సమస్యలేవీ నీదాకా రావు” అంది. ధైర్యం చెప్పింది. అయినా సంలేఖలో తన పెళ్లి వల్లనే ఈ గొడవలన్నీ అన్న అసంతృప్తి మాత్రం తీవ్రంగా వుంది.

(ఇంకా ఉంది )

-– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో