ఆమె నా ప్రేమలేఖ చదివి
అది ఇచ్చిన వాడితో ఇలా అంది
ఈ జాబుకు బదులివ్వకపోవడమే
ఈ జాబుకు బదులివ్వకపోవడమే
నా జవాబ ని (చెప్పింది)
-అమీర్ మీనాయీ
ఆశ్చర్యంగా , నువ్వు వస్తానంటే
నమ్మకంగా ఎదురు చూశాను
రాత్రంతా రాబోయే ప్రళయం కోసం
అలా నిరీక్షిస్తూ గడిపాను
-దాగ్ దేహలవీ
తనను చూడగోరే వారికి
తరుణం లభించిందిఆమె తన మేలిముసుగు
అరమోడ్పుగా తొలగించింది
-అర్ష్ మల్సియాని
నాకేవరైనా ఎరుక పర్చండి
అమెకేందుకు జనావు చెప్పాలని ?
ఆమె నన్ను అడుగుతోంది
‘తనని ఎందుకు కోరుకున్నావని ‘?
-షకీల్ బదాయునీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~