చెల్లి బెంగ (కవిత )యల్ యన్ నీలకంఠమాచారి

 

 

 

బెంగ ఏలనే చెల్లి
నీకు బెంగ ఏలనే
బెంగఎందుకుండదన్న
నేటి తీరును చూస్తుంటే”బెంగ”

పాలుగారు బుగ్గల నెమిరే
చేతులు కరుకు దేలి
తమకంతో చిదుముతు
పైశాచికత వ్యక్తం చేస్తుంటే”బెంగ”

సొల్లుగారు దృశ్యాల చూస్తు
అదేపని సొంగగార్చుకుంటు
హద్దుమీరి సాగుతున్న వారల
వికృత చేష్టల చూస్తుంటే”బెంగ”

తల్లి అక్క చెల్లి అంటు వరస కలుపుతనే
అవసరాల గుర్తెరిగి చేయందిస్తునే
ఓ అవకాశ క్షణాన రాక్షసాన్ని
చూపించే వారల చూస్తుంటే-బెంగ”

నాడైనా నేడైనా రేపటేలైనా
మా బతుకులు ఇలాగే సాగేనా
భయంగా భయంగా బెరుకు బెరుకుగా
మేము వుండవలసిందేనా

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా
అక్షరాస్యత మెండుగ పెరిగీనా
సమాజాన పెను మార్పులు వచ్చినా
మా జీవితాలనవోదయం ఏ నాడొచ్చునో
ఇదే మాకు అర్థముగాని ప్రశ్నగ మిగిలినది

ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన నాడే
సమాజాన సానుకూల మార్పు వచ్చిన నాడే
మమ్ముల మమ్ములుగ గుర్తించిన నాడే
మా బెంగ తీరును మా బెరుకు తొలుగును
మేము మేముగా సమాజాన జీవించగము

ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను
అందుకు నీ చేయూత నడుగుతున్నాను
కాదనక చేయూత నందించిన ఈ వేళ
రేపటేళ మా పూజనీయుడవవుతావు

-యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో