మేకోపాఖ్యానం- 11-చివరి మజిలీ  -వి. శాంతి ప్రబోధ

“అబ్బబ్బ… ఏం మనుషులు వాళ్ళు…
చెప్పే దానికి చేసే దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం .. తనలో తానే గొణుక్కుంటూ వచ్చింది ఆడమేక

“ఏమైంది .. “ఆరా తీసింది మగమేక.

“ఆ మూలింటి అవ్వ చనిపోయింది” బాధగా అన్నది ఆడమేక.

“ఓసోసి .. దానికి ఇంత బాధపడుతున్నావా .. ఇంత సున్నితమైతే ఎట్లా .. ?
కొమ్మకు పూసిన పూలు వాడక మానవు. చెట్టుకు కాసిన కాయలు పళ్లై రాలైపోక మానవు .
అలాగే, పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఏదో ఒక రోజు ఈ లోకం వదిలి పోక తప్పదు… ” మగమేక అనునయంగా చెబుతుండగా

“పుట్టినా చచ్చినా అన్నిటికి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే ..
హూ… సర్కారు సొమ్ము ఎంత తిన్నా ఇంకా కావాలని ఏడుపే” అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ వచ్చింది గాడిద.
గాడిద మాటలు అర్థం కాక మేకల జంట అయోమయంగా చూశాయి.

“తక్కువిస్తున్నారా నెలకి రెండువేల పదహార్లు ఇచ్చినా ..సరిపోదు. అంతా దోచిపెట్టాలేమో .. ” అంటూ అరుస్తూ ఉంది గాడిద

“దాని మాటలు వదిలేయ్ .. గుండె తరుక్కుపోయే నీ బాధ ఏంటో చెప్పు” అనునయంగా భార్య భుజంపై చెయ్యి వేస్తూ అన్నది మగమేక.

“పోయిన నెల ఒకటో తారీకు పెద్ద మీటింగ్ అయింది గుర్తుందా ..
ముసలి వాళ్లందరికీ పళ్ళు పంచిపెట్టారు . వాళ్ళకేమో కానీ మనకి పండుగ అయింది అనుకున్నాం ” అంటూ భర్త మొహం లోకి చూసింది ఆడమేక .

“ఆ .. అవునవును .. పుట్టుక , పసితనం, యవ్వనం, వృద్ధాప్యం ,చావు జీవులన్నిటికీ ఉన్న జీవిత చక్రం . జీవిత సత్యం. పిల్లల్ని కని కంటికి రెప్పలా, ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి పెద్ద చెయ్యడం కోసం, ప్రయోజకుల్ని చేయడం కోసం తం రక్త మాంసాలను కరిగిస్తారు. ఆస్తిపాస్తుల్ని కర్పూరంలా కరిగించడానికి లెక్కచేయరు. ముదురుతున్న వృద్ధాప్య ఛాయలు లెక్కచేయకుండా బిడ్డల కోసం తపన పడుతున్నారు . కానీ పడమటి దిశకు చేరుకున్న ఆ తల్లిదండ్రులకు , తన శక్తినంతా ధారపోసిన ఆ కన్న తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ , జానెడు నీడ కరువైపోయింది…అంటూ ఎంత బాగా చెప్పాడు” అన్నది మగమేక

“ఆ రోజు… వృద్ధుల దినోత్సవం రోజు పెద్దవాళ్ళని ఘనంగా సన్మానించిన ఆ పెద్ద మనిషి, అనుభవాల ఆస్తి అని గొప్పగా మైకు పట్టుకుని చెప్పిన ఆ పెద్దమనిషి ఇప్పుడేం చేశాడో తెలుసా ..
నెల తిరక్కుండానే కన్న తల్లిని తన్ని ఇంట్లోంచి గెంటేశాడు.
మతిస్థిమితం లేని ఆ తల్లి రోడ్డు మీద పడింది. ప్చ్ పాపం ఆ తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది” ఆడమేక.

“పాపం .. ఆ ముసలమ్మ కి ఎనభై ఏళ్ల పై మాటే ..” మగమేక.

“వయసులో ఉన్నన్నాళ్ళు కళ్ళముందున్న అందరినీ గడగడలాడించేది . ఇప్పుడు ఆమెను కానేవారు లేరు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ” తన అరుపుల్ని ఆపి మేకల జంట మాటలు విన్న గాడిద అన్నది

“అడుగు తీసి అడుగు వేయలేని మనిషి . ఆమె జీవితం చేజారి పోయినట్లు ఉంది . ముందున్న జీవితాన్ని ఎలా గడపాలో తెలియని బాధ .

చేతిలోంచి అధికారం జారిపోయింది . ఆదాయ మార్గాలు కుంచించుకు పోయాయి. చెప్తే వినేవాళ్ళు కరువు .

జానెడు పొట్ట నింపుకోవడానికి అగచాట్లు పడలేక , చివరికి ఇవాళ తన ప్రాణం తానే తీసుకుంది . అదే నాకు బాధగా ఉంది .

మాటలకు చేతలకు పొంతన లేని మనుషులను చూస్తే అసహ్యం గా ఉంది” అన్నది ఆడమేక

“ముడతలు పడిన చర్మం , తెల్ల జుట్టు , బోసి నవ్వు , వంగిన నడుము , చేతి కర్ర ఆ ముసలమ్మని నేను బాగా ఎరుగుదును .
మొగుడు పోయినప్పటి నుంచీ ఒంటరిగానే రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆస్తినంతా పిల్లలకు పంచి ఇచ్చేసింది. ఆ కొడుకు దగ్గర ఈ కొడుకు దగ్గర వంతుల వారీగా ఉంటుందనుకుంటా.. అరుగులమీద మధ్య మధ్యలో కొంత కాలం కనిపించదు ” అన్నది మగమేక

“కొడుకు లీడరు గిరి చూసి ఎంతో పొంగిపోయిన ఆ అవ్వ ఆ ఇంటికి ఓ సంపద.. ” ఆడమేక మాటలు పట్టించుకోకుండా మధ్యలో అందుకొని ” పని పాట లేని వాళ్ళకి తిండి దండుగే .. ఎందుకు కొరగాని వాళ్ళ గురించి అంత బాధపడిపోతావెందుకు ..?” కసిరింది గాడిద.

” కావచ్చు .. ఆమె కొడుకు కోడలు అంతే అనుకున్నారు కావచ్చు. నెలనెలా ఆమెకు వచ్చే వృద్ధాప్య పింఛన్ కూడా గుంజుకునే వారు.
ఎందుకోగానీ ఆమెకు వచ్చే పింఛన్ ఆగిపోయింది.

కడుపునిండా తిండి ఏనాడో మరచిపోయింది . చివాట్లు , చీదరింపులు తోడయ్యాయి.

మహరాజులా బతికిన మనిషి చీకటి గదిలో గడపలేక ముందు గదిలోకి వచ్చిందట. షో కేసు బొమ్మననుకుంటున్నావా ముందు గదిలోకొచ్చావ్ అని కోడలు ఒక్క తోపు తోసిందట. కొడుకు వీధి గుమ్మం బయటకు లాగేశాడట.

ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని కన్న సంతానాన్ని గట్టెక్కించిన ఆమెకు , క్లిష్టమైన సమస్యలు కూడా అలవోకగా తీర్చగల సత్తా ఉన్న ఆమెకు , దెబ్బలు తగిలి రాటుదేలిన పోయిన గుండెకు శక్తి నశించి పోయిందేమో .. పోయి కరెంటు ముట్టుకుని ప్రాణం తీసుకుంది . ” చెప్తున్నా ఆడమేక గొంతు పూడుకుపోయింది.

“అయ్యయ్యో .. “మగమేక

“వృద్దాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు , అది రెండో బాల్యం …..
ప్రేమ ఆత్మీయత లేని బంధాల వల్లనో, ఉద్యోగాల పేరిట దూరమై పోయిన పిల్లల వల్లనో , కుటుంబ కలహాల వల్లనో పండుటాకులైన తల్లిదండ్రులు ఒంటరివారై పోతున్నారు. ఆత్మీయ పిలుపు కోసం , అభిమాన పూర్వకమైన పలకరింపు కోసం అల్లాడిపోతున్నారు. “

గాలి మోసుకొస్తున్న మాటలు అక్కడున్న వారి చెవుల్లో పడుతున్నాయి .
…….

“వృద్దాప్యం అంటే ఎన్నో ఏళ్ల అనుభవాల సంగ్రహం.
ఆటుపోట్లతో నేర్చుకున్న జ్ఞాన నిక్షిప్తం వృద్ధాప్యం
వాళ్ళ తెలివితేటలు , వివేకం , అనుభవసారం ..
వృద్దులంటే జ్ఞాన నిధి.

వారి అనుభవం మనకు వడ్డించిన విస్తరి ..
పండిపోయిన జీవితానుభవాలు…. ఏరుకోవడం మొదలుపెడితే.. ” ఎక్కడి నుండో రేడియో నుండి గాలి మోసుకొస్త్తున్నది . కళ్ళు మూసుకున్న మేకల జంట మౌనంగా వింటున్నాయి .

అటుగా వచ్చి పోతున్న జనాన్ని , జంతువుల్ని చూస్తూ ఆ మాటలు వింటున్నది గాడిద .
చెట్టు కింద ఎవరో వృద్ధురాలు, మరి కాస్త దూరంలో వృద్ధుడు చెవులు రిక్కించి రేడియో లో వస్తున్న మాటల్ని వింటున్నారు.

వాళ్లనే తదేకంగా చూసింది గాడిద. ఆ తర్వాత గొంతు సవరించుకుని నెత్తి కింద మూట పెట్టుకుని పడుకున్న వృద్ధుడిని పలకరించింది.

తనను చూస్తే చీదరించుకునే వాళ్ళని చూసాడు కానీ అంత ప్రేమగా పలకరించిదెవరా అని చుట్టూ చూశాడు .

తనని పలుకరించింది గాడిద అని అర్థం చేసుకున్నాడు.
నీ లాగా నాది గాడిద బతుకైనా బాగుండేది. ఈ బాధ ఉండేది కాదు .
ఇప్పుడిక పింఛన్ కి కూడా కొరగాకుండా పోయాను అని నిట్టూర్చాడు ఆ వృద్ధుడు.

“అయ్యో .. అదేంటి తాతా అట్లా అంటావు. మన ప్రభుత్వం లక్షలాది మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తుంటే .. అందులో నువ్వు లేవా ..” అమాయకంగా మొహం పెట్టిన గాడిద అడిగింది .

హూ .. పింఛన్ .. నా బోటి వారికి పింఛన్ గట్టిగా నవ్వాడు వృద్ధుడు. పగలబడి నవ్వాడు . ఆ నవ్వుకు మేకల జంట మాత్రమే కాకుండా అక్కడున్న జీవరాశులన్నీ ఉలిక్కిపడి ఆ వృద్ధుడి కేసి చూశాయి .

“ముందు వెనక అండ దండ ఉండాలి. ఆఫీసుల చుట్టూ , అధికారుల చుట్టూ పలుకుబడి గల నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. అవసరమైతే కొద్దో గొప్పో చేతి చమురు వదుల్చుకోవాలి . అప్పటికి వాళ్ళు కనికరిస్తే , దయతలిస్తే ఆ పింఛన్ మనది అవుతుంది . లేదంటే లేదు . మళ్ళీ గట్టిగా నవ్వాడతను .

అంతగా నవ్వాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు అక్కడున్న వారికి .

పసిపిల్లలకు ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టు నీ ముందుకు పళ్లెంలో పెట్టి ఇస్తారా ఏంటి ? అవసరం నీది . తిరగాలి మరి ! అన్నది గాడిద

నిజమే, నువ్వన్నట్టు అవసరం నాదే . అందుకేగా ఇప్పటికి పది సార్లయినా దరఖాస్తు చేశాను . అన్నీ బుట్ట దాఖలు .. ఇక నా ఓపిక నశించిపోయింది ” అంటూ తలకు చుట్టుకున్న తుండు గుడ్డ దులిపి మళ్ళీ తలకు చుట్టుకున్నాడు ఆ వృద్ధుడు .

ఒంటరి ఆడదంటే అందరికీ అలుసే. నా కొడుకులు పని చేసుకుంటున్నారని నా ఫించన్ ఇవ్వలేదు.
ఇళ్ళు , బళ్ళు, పొలాలు, డబ్బు దస్కం ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదని బొంకి నెలనెలా పింఛన్ తీసుకుంటున్నారు. ఏమీ లేని నేను మాత్రం ఇట్టా రోడ్డున పడ్డా.. ఏం చేయను కళ్ళొత్తుకుంది అవ్వ .

“కన్న పిల్లలకు భారం కాలేక .. నా ఇంట్లోనే పరాయిగా బతకలేక .. ఈ ముసలాడు ఎప్పుడు పోతాడు అనే ఎదురుచూపులు గుచ్చుకుంటుంటే తప్పు చేసిన వాడిలా గుమ్మం దాటి వచ్చా.. ” గొంతు గద్గదమవుతుండగా వృద్ధుడు

అయ్యో .. నిజమా .. నీ లాంటి పండుటాకులకు పింఛన్ ఇవ్వలేనప్పుడు, ఇంకా రంగు మారని వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తామని ఎందుకు అంటున్నారో .. ” ఆలోచనలో పడింది గాడిద

అంతలో అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి ని చూస్తూ వృద్ధాప్యం వయసుకు మనసుకు కాదని తెలియని మూర్ఖులు.
పెద్దలను గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయం , సనాతన ధర్మం అని గగ్గోలు పెట్టే వాళ్ళు కూడా వృద్ధులను కనికరం లేకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. అని గొణిగింది ఆడమేక.

బతుకు చివరి మజిలీలో
మెతుకు దొరకని వేళలో ..
బంధాలకు భారమైన కాలంలో
అనుబంధాలు ఆవిరైపోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు .. ? అంటూ నిట్టూర్చింది మగమేక

ముసలితనం వేధిస్తోందని మృత్యుఒడికి చేరడమే పరిష్కారమా ..? ప్రశ్నించింది ఆడమేక

జీవులన్నిటి కంటే గొప్పవాడిని అని విర్రవీగిన మనిషి కంటే వార్థక్యం లో మిగతా జీవుల పరిస్థితి బాగుంటుందేమో ..! అన్నది మగమేక

అవునవును అన్నట్లుగా తలూపింది ఆడమేక.

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో