శిక్ష(కథ )- సుధామురళి

‘విశ్వా! ఆ రంగి ఆత్మహత్య కేసు క్లోజ్ అయినట్టే కదా, పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చిందనుకుంటా!? అయినా ఈ కాలంలో పిల్లలకు ప్రాణాలన్నా, జీవితం అన్నా లెక్క లేకుండా పోతోంది విశ్వా. ఎప్పటికి తెలుసుకుంటారో ఏమిటో?’

‘అవును మేడం, పైగా వాళ్ళింటి దగ్గర ఎంక్విరీ కి వెళ్ళినప్పుడు అందరూ ఆ పిల్ల గురించి ఎంత గొప్పగా చెప్పారని. ధైర్యవంతురాలని, ఒంటి చేత్తో పనులన్నీ చక్కబెట్టే తెంపరి అనీ, ముక్కుసూటి పిల్లని చాలా చాలా చెప్పారు మేడం’

‘ఆ….అదే విశ్వా అటువంటి పిల్ల ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా అర్థం కాలేదు. పైగా ఈ మధ్య ఎవరో అటాక్ చేయబోతే ఎదురుతిరిగి వాళ్లకు గట్టి బుద్ది కూడా చెప్పిందని విన్నాను’

                                                                *******

‘నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు, ఇది హత్యే, నాను జేసిన హత్యే, నా బిడ్డను సంపుకుంది నేనే’

‘మేడం ఈమె రంగి తల్లి రామలక్ష్మి’

‘అవునవును గుర్తుంది నాకు. ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు!? అల్లారుముద్దుగా పెంచుకున్న నీ బిడ్డ రంగిని నువ్వెందుకు హత్య చేస్తావు? అయినా అది ఆత్మహత్య అని పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది కదా!?’

‘గా రిపోరుటులు గవీ నాకు తెల్వదమ్మా. నా బిడ్డ రంగమ్మని మగబిడ్డ తీరుగా పెంచుకున్నా, నే కూలికీ, నాలికీ ఎలతుంటే నా మిగిలిన ఇద్దరు బిడ్డల్నీ అమ్మా, అయ్యా అదే అయ్యి సూసుకునేది. ఈది ఈది దాన్ని మగరాయుడు అనే పిలిసేవోళ్లు. అదీ అట్నే అర్ధరాత్రి, అపరాత్రి అని లేక గండాగొండీ గా తిరిగేది. పోనీలే సదువుకు సదువూ, పనికి పనీ అన్నీ సమాయించుకుంటోందని నానూ సూసీ సూడనట్టు ఉండేదాన్ని. ఎప్పుడన్నా మరీ మితి మీరితే మండలించడం మినహా ఏమీ సేయలేదు’

‘మరి ఇప్పుడు ఏం జరిగింది’

‘దానికి ఆళ్ల అయ్య ఇల్లు ఐడిచి ఎల్లాడని ఖోపం, మగోళ్లంటే మంట. ఈదిలో ఏ మగపిల్లాడు కనిపించినా, దీనిని ఆట పట్టించినా గొడవకు దిగేస్తది. అట్టాంటిది ఆ ఈరేశం, సీను గాడితోనూ గొడవ పడ్డాది ఆ యాళ. అప్పటికీ నాను గట్టిగానే గదిమాను ఆళ్ళు రౌడీ ఎదవలే, పోమాక ఆళ్ల జోలికి అని ఇన్నాదా!?’

                                                          *****

‘దొంగ వెదవలు మొన్నటి రాతిరి మాటేసి నా బిడ్డను బలాత్కరించ జూశారు. ఇదేం తక్కువ తిన్నదా ఒక్కొక్కడినీ చితకొట్టి, చిరిగిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కిందా మీదా పడతా లగెత్తుకు అచ్చేసింది’

‘మంచి పనే చేసింది కదా రామలక్ష్మి. ఈ కాలం పిల్లలకు ఎంత మందికి ఆ ధైర్యం ఉంది చెప్పు’

‘అది మంచి పనే సేసినాదమ్మా! నానే సూసిన నలుగురూ ఏమనుకుంటారా? ఇది సెడిపోలేదంటే నమ్ముతారా ? నమ్మరా అని ఆలోచిస్తా దీన్నే గొడ్డును బాధినట్టు బాడేసినాను. అప్పటికీ బిడ్డ ‘నానే తప్పూ సేయలేదే, నన్ను నమ్మవే, కొట్టమాకే అంటా కాల్లా ఏల్లా పడ్డాది’

‘ఎంత పని చేశావు రామలక్ష్మి!?’

‘అంతేనా అమ్మా! ఆడే ఇంటికాడే ఉంటే అచ్చీ పోయే ఆళ్ళకి ఏమ్ సెప్పాలా అని అది పోనంటున్నా దాని మామకాడికి పంపించా’

                                                              ******

‘అక్కడా ఆడూ మగాడే కదమ్మా, ఇద్దరు సెడిస్తే ఒకటి , ముగ్గురు సెడిస్తే ఒకటా అంటూ బిడ్డను నానా హింసలు పెట్టినాడంట. నన్నెవరూ సెడసలేదు మామా అన్నా ఇనకుండా ఆ ఎదవ నానా యాగీ సేసినాడంట. ఎట్టాగో ఆడి భారి నుంచీ తప్పించుకుని నా మరదల్ని సేరి ఏడుస్తూ ఇషయం సెప్పి ఆ మాపున ఎల్లి బావిలో దూకేసింది’

‘ఎంత పని జరిగింది రామలక్ష్మి’

‘అవునమ్మా! దాన్ని సెడగొట్ట సూసిన ఆ ఈరేశం, సీనుగాడు దుక్కల్లాగా కోలుకున్నారు. నా తమ్ముడు అదే దాని మామ ఆడూ సుబ్బరంగా బతికున్నాడు. ఏ పాపం ఎరుగని నా బిడ్డ, కేవలం నా పిరికితనం మూలాన సచ్చిపోయింది. కాదు కాదు నానే, నానే దాన్ని సంపేసినాను. సెడినా అక్కున సేర్సుకుని ఆదరించాల్సిన అమ్మని, సెడిపోకుండా ఎదిరించి, ఎదురునిలబడ్డ నా బిడ్డను పొట్టన అట్టేసుకున్నాను. అది బతికుండగానే దాని ఆతమను సంపేసినాను, దానిది ఆత్మ హచ్య కాదమ్మా, హచ్య, నాను జేసిన హచ్య. నన్ను అట్టుకెళ్ళండమ్మా, నన్ను సికిచించండి. ఇంకే తల్లీ బిడ్డను ఇట్టా మట్టి పాలు సేయకుండా నాను ఉదాహరణగా వుంటానమ్మా, ఉంటాను’

-సుధామురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

2 Responses to శిక్ష(కథ )- సుధామురళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో