గజల్-24 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ ప్రేమికులకు నమస్కారం కాఫియా ఎంతచిన్నదైతే షేర్ కూర్పు అంత కఠినమౌతుంది. కానీ షేర్ ని కవి  ఎలా పూర్తి చేస్తాడోననే ఉత్కంఠ చదువరులకుంటుంది. కాఫియా దగ్గరకొచ్చేదాకా షేర్ లో ఉన్న అర్థం గ్రహించాక షేర్ ని మళ్లీ చదివేలా చేస్తుంది
|| తెలుగు గజల్ ||
చందమామ కౌగిలిలో చెప్పలేని హాయి ఉంది 
కరుగుతున్న చుక్కలలో చల్లనైన వేడి ఉంది
వెలుగుపూలు పడుతుంటే నిరాశలో  మునుగుతుంది
పున్నమిలో చీకట్లకు చెప్పలేని లేమి ఉంది
విహారానికెడుతుంటే మనసు చల్లబడును కదా  
వనాలలో పరిమళాన్ని పంచుతున్న గాలి ఉంది
గుండెకు తగిలిందంటే అనురాగము పొంగుతుంది 
పుష్పశరుని బాణములో కనిపించని వాడి ఉంది
వేడిని చల్లగ మార్చే విద్య తెలుసు జాబిల్లికి
వెన్నెలలో…చల్లదనం పయనించే వీథి ఉంది
గ్రహణం పట్టిన రాత్రికి సంతోషం ఎక్కడుంది 
చీకట్లను చీల్చుతున్న తారలతో హాని ఉంది
విందుకి రమ్మని పిలిచే పూవులోన “నెలరాజా”
తేనెటీగ తాగేందుకు మరందాల బావి ఉంది
-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్
 గజల్ శిరోమణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో