ఓ కన్నీటి చుక్క(కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

 

 

 

 

వాడే కారణం
వాడు రుద్దిన జీవన విధానమే కారణం
అదే వికృతమై విరాజిల్లుతోంది

అప్పుడే పుట్టిన పసికందు మొదలు
కాటికి కాళ్ళు చాపిన అవ్వ దాకా
కళ్ళల్లో కామమే కాన వస్తుంది
రసికత నిండిన బొమ్మలు
యాడ చూసినా
ముకుళిత హస్తాలతో కొలిచే చోటనూ

గుట్టు గుట్టు అంటూ
దాచినంత కాలం
గుట్టు తెల్సుకోవాలనే వెర్రితలలు
గుట్టు దాటి పుస్తకంలో ప్రత్యుత్పత్తి చేర్చితే
నేర్పితే
సిగ్గు బిడియం దాటి
అదో మానవ వికాస ప్రక్రియ గా
మెదల్లో చేరుతుంది

హేతువు అన్వేషించక
తలకో బహుమతి
చేతకాని తనానికి ప్రతీక

సంఘటన లో కొలతలు సున్నం పోసి
దులుపుకుంటే పంచనామా కాదేమో
కళ్ళ నిశిత పరిశీలన
తోటి మనుషుల క్రియాశీలక విచారణ
ఆ పక్క ఈ పక్క ఆవాసాల పై దుర్భిణీ
మరిచారా
సాంకేతికత కప్పేసిందా
అతి విశ్వాసం ప్రాథమిక విచారణను మరుగు పరిచిందా

గత చరిత్ర లోకి తొంగి చూస్తే
సెల్ ఫోన్లు సి సి టీవీ లు లేకుండానే
వేటాడి వెంటాడి శోధించిన కేసులు కళ్ళ ముందు

ఆరేళ్ళ పాప దుస్తులు
ఎలా వుండాలో చెప్పే వాడి వారసులు
ఆరుబయట ఆడుకోవద్దనే
వాడి మెదళ్ళు
బుసకొట్టే వేళ అవుతుంది
కళ్ళు తెరిచి తెమలండి తేల్చండి
రేపటి అమ్మ కోసమైనా

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో