మేకోపాఖ్యానం 10-నేరస్థుడు చచ్చాడు నేరం చావలేదుగా-వి. శాంతి ప్రబోధ

“పీడ విరగడయింది.

థూ …అలాంటి వాడు బతికి ఎవరికి లాభం .. నలుగురికీ నాలుగు విధాల చేటు తప్ప” గట్టిగా ఉమ్మింది

ఆవేశంగా అరుస్తూ వచ్చిన గాడిద.

“అరవడం తప్ప నీకు చక్కగా మాట్లాడడం రాదా?” కసిరింది ఆడమేక
ఒక్క రోజయినా హాయిగా నవ్వుతూ మాట్లాడటం చూడలేదు. ఎప్పుడూ ఏదో ఒకరి మీద కోపగించుకుంటూనో ఉంటుంది. అసహనంతో అరుస్తూనో ఉంటుంది. ఇప్పుడేమైందో.. ఎవరిని ఆడిపోసుకుంటున్నదో.. మనసులోనే అనుకుంది మొగుడు మేక

“ఆ రాక్షసుడు చచ్చాడు. రైలు కింద తల పెట్టి చచ్చాడు” ముఖం నిండా ఆనందం తాండవిస్తుండగా అన్నది గాడిద.

మేకల జంట మొఖాలు చూసి వాళ్ళకి ఏమీ తెలియదు. చెట్లమ్మట పుట్టలమ్మట పడి తిరగడం తప్ప వీటికేమి తెలియదు. వట్టి మొద్దు మొహాలు .. అనుకుంటూ ఒక చూపు చూసింది. “అయ్యో లోకమంతా కోడై అరుస్తున్నా మీకు ఈ సంగతి తెలియదా.. నాలుగు బజార్ల ఆవల ఆరేళ్ళ పిల్లని దారుణంగా చిదిమేశాడే వాడు … వాడు ఆత్మహత్య చేసుకున్నాడట. పీడా వదిలాడు. అసలు ఇట్టాటి కిరాతకుల్ని ఎక్కడికక్కడ కాల్చి పడేయాలి” మళ్ళీ ఆవేశపడింది గాడిద.

“రైలు కింద పడి చచ్చాడా .. చంపారా .. ” అన్నది భార్య మేక.

“పాత కథే మళ్ళీ చెబితే జనం నమ్మరుగా.. అందుకే రూటు మారి నట్లుంది, పద్ధతి మార్చుకున్నట్లున్నారు.” ఆలోచనగా అన్నది మగమేక.

“చచ్చాడో .. చంపారో .. ఏదైతే ఏం లే .. ఆ నేరస్థుడు ఈ లోకంలో లేడు కదా..” అన్నది గాడిద.

“నేరస్తుడు చచ్చాడు నిజమే.. కానీ నేరం పోలేదుగా..
ఇల్లు, బడి , గుడి , ఇరుగు పొరుగు ఎక్కడికి పోయినా అడుగడుగున మాటువేసి ఉన్నది” అన్నది ఆడమేక

“అవును నిజమే.. నేరం ఎక్కడికి పోలేదు. జనంలోనే ఉంది. వాళ్ళతోనే ఉంది. వాళ్ళతోనే తప్పు చేయిస్తుంది. అందుకు కారణాలు చూడకుండా, నేరస్థుడ్ని మాయం చేసినంత మాత్రాన నేరం సమసిపోయిందా … నేరం లేకుండా చేయకుండా ఉంటారా. అట్లయితే ఇప్పటికి ఈ నేరం ఉండేదే కాదు. ” అన్నది మగమేక

మీరెన్నయినా చెప్పండి . నేరం చేసిన వాడిని అప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కాల్చి పడేయాలి. సౌదీలో అలాగే చేస్తారట. అందుకే అక్కడ నేరాలు తక్కువట” ఎక్కడో విన్న విషయాలు గబగబా చెప్పింది గాడిద .

“పురుష తోడు లేకుండా ఒంటరిగా తిరగడానికి అనుమతి లేని దేశం మనకెందుకట.
ఆ మధ్య నలుగురు నేరస్తుల్ని కాల్చి చంపేశారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష అన్నారు.. అయినా ఏమన్నా ఆగినయా .. ఇప్పుడు ఆగడానికి .

ఘోరాలెన్నో జరిగిపోతూనే ఉన్నాయి ఆరు నెలల పసికందు నుంచి అరవై ఆరేళ్ళ ముసలి వాళ్ళ వరకు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు .. ఎన్ని చూడడం లేదు. ఎన్ని వినడం లేదు .” అంటూ చుట్టూ చూసింది ఆడమేక

నేరం ఆగినప్పుడు నేరస్థుడిని చంపిన దానికి ఫలితం దొరికినట్టు.
అట్లా జరిగిందా..?

నేరస్థుడు పోయినా నేరం ఆగడం లేదు. కొత్త నేరస్థులు పుట్టుకొస్తూనే ఉన్నారు .

సొంత ఇంట్లోనే నాలుగ్గోడల మధ్య అయినవాళ్లే చేసే అత్యాచారాలు కొన్నయితే, బయట జరిగేవి కొన్ని. అది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సభ్య సమాజం ఆవేశం తో రగిలిపోతుంది. టీవీ చానెళ్లు వాటిని పదే పదే చూపిస్తూ ఉంటాయి.

దొరికితే దొంగ , లేకపోతే దొర అన్నట్లు నలుగురిలో రేపిస్టులు దర్జాగా తిరిగేస్తూ ఉన్నారు .

అసలు రేపిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు .. అందుకు కారణం ఎవరు ? ఏమిటి ? అని మూలాల్లోకి వెళ్ళరు .

ఆ నిముషం ప్రజల్లో తాటాకు మంటలా ఉన్న ఆవేశాన్ని , ఆగ్రహాన్ని తృప్తి పరచడం కోసం తక్షణ చర్యలు  చేపడుతున్నారు. అంతే .. ” తిరిగి తానే అన్నది గాడిదనే తీవ్రంగా చూస్తూ .

ఆడమేక మాటల్లో వాస్తవం ఉన్నట్లు ఉన్నది అనుకున్నది గాడిద.

నిజమే, వాడు చేసింది దారుణమే. కాదని బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ అనరు. కానీ బాధ్యతగా మెలగాల్సిన వాళ్లు కూడా ఇలాంటి దారుణమే చేస్తే .. ఎంత వరకు సబబు? ఇంకా చేసిన పనిని సమర్ధించుకోవడం

ఎంత వరకు సమంజసం? ఎంత మందిని చంపుకుంటూ పోతారు? ఏడ్చే పసి పిల్లవాడికి తాయిలం పెట్టి బుజ్జగించినట్లు కాదు కదా ..

ఇటువంటి సంఘటనలు జరగకుండా , రోగానికి మందు వేయకుండా పై పైన కట్టు కడితే ఏమవుతుంది.

అప్పటికి రోగం తగ్గినట్టు బాగానే కనిపిస్తుంది . కానీ లోలోన కుళ్లిపోతూనే ఉంటుంది కదా .. శరీరాన్ని గుల్ల చేస్తుంది కదా ..

ఇదైనా అంతే . శాశ్వత పరిష్కారం లేకపోతే .. ” అన్నది మగమేక

“అవును, మనుషులకు చట్టాలున్నాయి. నేరానికి శిక్షలున్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ ఎన్కౌంటర్ లు ఏంటి ? నేరం ఎందుకు జరిగిందో సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవ్వాలి. అప్పుడు కదా నిందితుడిని నేరస్తుడిగా పరిగణించేది. శిక్షించేది ” గతంలో ఈ చెట్టు కిందే విన్న చర్చల సారాన్ని గుర్తుకు తెచ్చుకున్న ఆడమేక సాలోచనగా అన్నది

“అబ్బబ్బ .. మీతో వచ్చిన గోల ఇదే. అన్నిటికి ఈకలు లాగి ఆలోచిస్తారు. నేరం చేసిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నాలుగు దిక్కులా విసిరేయాలి. పుట్టగతులు లేకుండా చేయాలి. కానీ మీరు ఒక్కటి సవ్యంగా ఆలోచించరు “. ఆవేశంగా విసుక్కుంది గాడిద .

“అదేంటి మిత్రమా అట్లా కోపానికి వస్తున్నావు. అంత ఆవేశ పడుతున్నావు.
కూల్ కూల్ …

ఈరోజు నీవంటి ఆవేశపరుల కంట కన్నీరు తుడిచాం అనుకుంటున్నారు. సరే, రేపు ఇంకో కంట కన్నీరు రాకుండా చూసుకోవాలి కదా.. అట్లా జరుగుతున్నదా .. లేదు కదా ..” అన్నది చెట్టు కొమ్మలపై గెంతులేస్తున్న కోతి

” హూ .. నువ్వు కూడా వాళ్ళ పక్షాన చేరిపోయావా ..” గొణిగింది గాడిద

” మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా లోకమంతా తిరిగి వచ్చిన అనుభవంతో చెబుతున్నాను.
మద్యం వల్లే ఇట్లాటి నేరాలు ఘోరాలు ఎక్కువ జరుగుతున్నాయి. వారికి ఆ నిజం తెలిసినా ఆ నిజాన్ని పాలితులు ఒప్పుకోరు.

ఖజానా నిండేది మందుబాబుల వల్ల కదా .. ” నవ్వేసింది కాకి

“నువ్వు చెప్పేది అక్షరాలా నిజం కాకమ్మా..
మందు తాగిన వాడి మైండ్ వాడి చెప్పు చేతల్లో ఉంటుందా.. ఉహు .. ఉండదు.

రెండు మూడు రోజులు మందు తాగక పోతే జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కి వచేస్తారు. వారి నిస్సహాయత, కోపం, చిరాకు ఇవన్నీ ఎవరి మీద చూపించాలో అర్థం కాక, ఎవరైతే ఏం చేసిన అర్థం చేసుకోలేక పోతారో, ఏం చెప్తే చేస్తారో, వారి కంటే బలం తక్కువ ఉంటుందో వారిని ఎంచుకుని వారి అహాన్ని చలార్చుకుంటారు.

అందులో ఎక్కువ బాగా తెలిసిన వారు, కన్న తండ్రులు కూడా ఉండటం కంట పడినప్పుడు మనుషులను చూస్తే అసహ్యమేస్తుంది” అన్నది కోతి .

“ఆహ్హా హ్హా .. పోయి పోయి మందు మీద పడుతున్నారే.
ఎన్నికల్లో గెలవాలంటే మద్యం లేకపోతే ఎట్లా.. ఏరులై పారకపోతే ఎట్లా … ” అన్నది మగమేక

“పేదోడి నోట్లో మన్ను కొట్టి , వాడి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్చకుండా మందుకే ధారపోసేయమని ఉచితంగా ఇచ్చి అలవాటు చేస్తారు. ఆ తర్వాత తాగమని పోలీసులను పెట్టి అమ్మిస్తారు. అట్లా ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ?” అన్నది ఆడమేక

“పేదోళ్లే నేరస్థులుగా ఎన్కౌంటర్ అయేది , ఆత్మహత్యలు చేసుకునేది. నేరం చేసిన పెద్దోళ్ల పిల్లలు ఒక్కడు కూడా చావలేదు. నేరం చేసినట్లు లోకమంతా తెలిసినా నేరస్థులుగా ముద్ర పడదు. ఎంకౌంటర్ అవ్వరు..” అంటున్న మగమేక కేసి చూస్తూ…

“నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావ్ ” అరిచింది గాడిద.

“చట్టం చుట్టం అయినవాళ్లకి నేరం శిక్ష ఉండవుగా .. కులం , వర్గం , పలుకుబడి , అధికారం ఉన్నవాళ్లు ఏం చేసిన చట్టం చుట్టమై అన్ని సేవలు అందిస్తుంది.

“మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు . తాగిన వాళ్లంతా నేరస్తులుగా చూస్తున్నారు.
ద్రోహులు .. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే ద్రోహులు మీరు .

ప్రభుత్వ ఆదాయానికి బొక్క పెట్టే ఆలోచన చేస్తున్నారు ” ఆగ్రహించింది గాడిద.

“నేరస్థులను అంతం చేస్తే నేరాలు అంతం కావని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. సమస్య మూలాలు వదిలి పైపై పూతలతో రోగం నయం చేయలేరని అందరికీ తెలియనిదా ..” అన్నది మగమేక

“ఆడవాళ్లను చూసే దృష్టిలో మార్పు రానంత వరకు ఇంతే..” అన్నది కాకి.

“మద్యం ఒక్కటేనా .. పోర్న్ ఏమన్నా తక్కువ ఉందా.. మొదట్లో చేతిలో ఫోన్ ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చారు. బూతు సినిమాలు ప్రతివాడికి అందుబాటులోకి తెచ్చి ఆడపిల్లను అంగడి బొమ్మగా చూపుతుంటే మార్పు ఎట్లా వస్తుంది” అన్నది మగమేక.

“మార్పు అనేది సమాజంలో రావాలా? పరిపాలిస్తున్న నాయకులలో రావాలా?” అన్నది ఆడమేక.

హూ … మనుషులు కాలిపోతున్న ఇంటిని ఎట్లా దిద్దుకుంటారో .. చక్క బెట్టుకుంటారో ..అని ఈ మాటలు చెట్టుమీద చెట్టు కింద చేరి విన్న పశు పక్ష్యాదులు ఆలోచనలో పడ్డాయి.

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో