ఇం’ధనం(కవిత )— కుందుర్తి కవిత

 

 

 

 

 

పీక్కుతినండి ,కొట్టుకుచావండి,

డబ్బాశతో కుప్పిగంతులేయండి,

వారసత్వ వెర్రితో విర్రవీగండి,

విలువల వలువలు

చెత్తబుట్టలో విసిరికొట్టండి

‘అర్థ’నగ్న ప్రదర్శన జరుగుతోందిక్కడ-

బహుపరాక్ బహుపరాక్ !!

భ్రష్టుపడండి , కుళ్ళిపొండి,

స్వార్ధం గంతలు కట్టుకోండి,

కక్షల సీసం చెవిలో నింపుకోండి,

మంచితనంతో మేడలు కట్టగలమా?!

అభిమానం అమ్ముకు తినగలమా ?!

ఆడంబరాల మైకంలో

ఆస్తిపాస్తుల తూకంలో

ఆత్మీయత ఏ పాటిది !!

అను’రాగమా ? ఏ పాటది ?!

ఈర్ష్యా ద్వేష సాగరంలో

మునకలేయండి, మథనచేయండి,

అతితెలివితేటల

తెప్పల్లో తేలియాడండి,

అహాల హాలాహలం

గొంతునిండా నింపుకోండి,

అసహ్యపు అసత్యపు అమృతం

వంటినిండా పులుముకోండి !!

దానవత్వం మితులుమీరిన-

మానవత్వం మరిచిపోయిన-

మహాత్ముల్లారా …

ఇంకా మృగాలుగానే

కలి కపట వేషధారుల్లానే

వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లండి !!

కాటికి ఇంధనం సంధించండి !!

— కుందుర్తి కవిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో