నాకు కావాలి గెలిచినవాడి జేజేలు(కవిత )-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

నాకు కావాలి గెలిచినవాడి జేజేలు

పగలు పోవద్దని నిలపగలమా
రాతిరి రావద్దని అపగలమా

బూడిదంటిందని నిప్పుని కడుగుతామా
పూవు వాడిందని మెుక్కను పీకుతామా

అంతా నిజంకాదని ఆశలు ఆపగలమా
తరిగే సొగసును వాడకుండా నిలపగలమా

గ్రహణమంటిందని సూర్యుని వెలివేస్తామా
తేనెటీగల ఎంగిలి సోకిందని తేనెను వదిలేస్తామా

వదిలిపోయిందని
ఊపిరపై అలగలేదుగా
వాలిపోతుందని
కనురెప్పను
తెరవకుండా వుండలేదుగా

మరి ఓడిపోయానని
నేనెందుకు ఆపాలి నా పయనాన్ని
నా జీవితాన్ని

నా అడుగులే
నను ముందుకు నడిపేది
నా చేతులే
నా జీవితాన్ని నిర్మించేది

నను చూసి
ఎక్కి ఎక్కి ఏడ్చేవాడు ఉండనీ
నను చూసి నవ్వేవాడు నవ్వనీ
నాకు కావాలసింది పోరాడి
గెలిచినవాడి జేజేలు….
నాకు అక్కరలేదు
ముసుగులో ముంచాలనుకొనే
మాయదారి మెాసగాళ్ళు చప్పట్లు

-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో