మేకోపాఖ్యానం- 9-వి. శాంతి ప్రబోధ

“అబ్బబ్బా … ఎన్నెన్ని ఘోరాలు, అరాచకాలు జరిగిపోతున్నాయో .. ప్రజలు గజగజ వణికిపోతున్నారట .
రాక్షస పాలన వచ్చి రాగానే ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేస్తూ మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారట.

మహిళల పోస్టర్లు, హోర్డింగులు కనిపిస్తే తెల్ల పెయింట్ వేస్తున్నారట .
చివరికి రోడ్లపై మహిళలు కనిపించినా తెల్ల రంగు పుస్తున్నారట.

ఆడవాళ్లు బయట తిరగడానికే భయపడుతున్నారట” ఆయాసపడుతూ వచ్చిన గాడిద తనకు తెలిసిన విషయాలు గబగబా కక్కేసింది మిత్రుల ముందు.

మూగన్ను మేకల జంట ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా మేఘావృతమైన వాతావరణంలో చెమటలు కక్కుతూ గాడిద.

“నీ మొదలారిపోను. డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు అట్లా అరవకపోతే నిదానంగా మాట్లాడలేవూ ” కసిరింది ఆడమేక

గాడిదకేసి చిరాగ్గా చూసింది మగమేక.

చీకటి పాలయ్యే ఆడవాళ్ళ బతుకుల్ని తలచుకుని తాను బాధపడుతుంటే వీళ్ళకి చీమ కుట్టినట్లయినా లేదే.. వీళ్ళ మాటలన్నీ ఉత్తుత్తి మాటలేనా .. పైపై బూటకపు మాటలేనా .. సందేహపడింది గాడిద.
మొహం చిన్నబుచ్చుకున్న గాడిదను చూస్తూ ఒళ్ళు విరుచుకుని “నువ్వేం చెప్పావో ఒక్క ముక్క నా బుర్రకెక్కలేదు. ఇలా కన్నంటుకుందో లేదో వొచ్చి చెడగొట్టావు” నిష్టూరంగా అన్నది మగమేక.

” అయ్యో సారీ..
అక్కడ ఆడవాళ్ళ బతుకులు నాలుగ్గోడల మధ్య బందీ అయిపోతున్నాయన్న బాధతో వచ్చాలే..” అన్నది గాడిద.

” చెప్పేదేదో సరిగ్గా చెప్పేడువు. అక్కడ అంటే ఎక్కడ?” ఆవులిస్తూ కసిరింది ఆడమేక.

అదేనబ్బా.. ఆఫ్ఘనిస్తాన్ రాజ్యం తాలిబన్ల చేతుల్లోకి పోయిందట..
ఇక అక్కడి ఆడవాళ్ళ బతుకు సర్వనాశనమే నట.” తనకే ఆ బాధ వచ్చినట్టు మొహం పెట్టింది గాడిద.

ఆ మాటలు వినగానే మేకల జంట నిద్దుర మత్తు వదిలిపోయింది. ఒళ్ళు విదుల్చుకుని అలర్ట్ అయ్యాయి.

“తెగ బలిసిన మట్టికాళ్ళ రాక్షసి అమెరికా .. రక్తమాంసాలు జుర్రుకునే అమెరికా పులిలా దురాక్రమించి నేడు పిల్లిలా పారిపోయింది. విష ప్రచారం చేస్తున్నది.
గాలి దుమారం వార్తలు వినొచ్చి మా దగ్గర కక్కకు” విసుగ్గా అన్నది మగమేక.

“అదంతా ఏమో తెలియదు కానీ అక్కడ ఆడవాళ్ళ బతుకు ఇక భారమేననడం నేనూ విన్నాను.
గతంలో ఒక పోలీసు అధికారి గా పనిచేసిన మహిళను నిర్ధాక్షిణ్యంగా కాల్చివేశారు. కనుగుడ్లు పెకిలించి నరకం చూపించారు. అదృష్టవశాత్తు ఆమె బతికింది. మనదేశంలోనే చికిత్స చేయించుకుని ఢిల్లీలో ఉంటున్నదట. అసలు దారుణమైన విషయం ఏంటంటే ఆమెపై దాడిచేసిన ముఠాకు ఆమె తండ్రే నాయకుడట. ఈ విషయాలన్నీ ఆమెనే మొన్న టీవీ వార్తల్లో చెప్పింది ” అన్నది ఆడమేక.

చూశావా .. ఇప్పుడైనా నమ్ముతావా నా మాటలు అన్నట్టుగా మగమేక కేసి చూసింది గాడిద.

ఆ చూపుల కర్ధం తెల్సిన మగమేక సన్నగా నవ్వుతూ “ప్రపంచ విజేతనని విర్రవీగిన అలెగ్జాండర్ ని తమ నేలపై అడుగుపెట్టనీయని చరిత్ర గల దేశం అది. అటువంటి దేశం దురాక్రమణ దారుల్ని ఉండనిస్తుందా.. పెత్తనం చేయనిస్తుందా..?” అన్నది

“ప్రపంచ సూపర్ పవర్ అని జనమంతా అమెరికా అమెరికా అంటూ ఎగబడి ఆ దేశంకేసి చూస్తుంటే, అటే పోతుంటే నువ్వెంటీ అలా మాట్లాడుతున్నావ్? పిచ్చోడిలాగా ..” మొహమంతా చిట్లించుకుంటూ గాండ్రిచ్చింది గాడిద.

“హూ.. నీకు చెప్పినా అర్ధం కాదులే. ఇన్నాళ్లు ఓ దద్దమ్మ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆటలాడిన అమెరికా ఇక పారిపోక తప్పని పరిస్థితి… ” ఇంకా ఏదో చెప్పబోతున్నది. అంతలో పెద్ద గాలి.
గాడిద, మేకల జంటలతో పాటు మరికొన్ని జంతువులూ ఆ మధ్యాహ్న వేళ సేదతీరడానికి ఆ మర్రిచెట్టు కింద ఉన్నాయి. గాలికి కొమ్మలు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాయి.
అంతలో టపటపా చప్పుడుతో పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి. పైకి చూస్తే నింగి నున్న మేఘం నేలపైకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

ఆ దారమ్మట పోతున్న వాళ్ళు పరుగు పరుగున వచ్చి ఊడలేసిన మర్రిచెట్టు కింద చేరారు.
ఆ వచ్చిన వాళ్లలో ఒకరు మొబైల్ లో రేడియో పెట్టి వింటున్న వాడల్లా ఆపి “తాలిబన్ల క్రూరత్వం వర్ణించ లేనంతగా ఉంటుందట
ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తారు . బుల్లెట్లు ఒంట్లోకి దింపుతారు . చంపేసి కుక్కలకు మాంసం వేస్తారట. ఎంత క్రూరులో..
ప్చ్ , అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది . పిల్లలని కూడా వదలరట. పెళ్లిళ్లు చేసుకుంటారట.. వాళ్ళ కృత్యాలను తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది.
ఆడవాళ్లను చూస్తే తాలిబాన్లకు బుర్ర పని చేయదట. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లల్ని కనే యంత్రాలు మాత్రమే.

ఆచారాల పేరుతో చదువుకో నివ్వరు. నచ్చిన బట్టలు వేసుకోనివ్వరు. ఉద్యోగం చేయనివ్వరు. చెప్పింది వినకపోతే ప్రాణాలు తీసేస్తారు. రాళ్లతో కొరడాలతో కొట్టి చంపేస్తారు .

ప్రాణం మీదకు వచ్చినా చికిత్స కోసం మగ డాక్టర్ దగ్గరకు కూడా పోనివ్వరని ఆ దేశ మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారట. కొందరు దేశం విడిచి పోవడానికి సిద్ధమవుతున్నారట.

గత ఇరవై ఏళ్లలో ఆ దేశంలో గొప్ప మార్పు వచ్చింది. అంతా తుడిచిపెట్టుకు పోతుందేమో.. జర్నలిస్టులు, రచయితలు , ఆర్టిస్టులు , జడ్జీలు , ఫిలిం మేకర్స్ వంటి అనేక రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇక గడపదాటొద్దట.

మహిళల విషయంలో ఇంతకు ముందులా హింసకు పాల్పడబోము, కానీ కఠిన ఆంక్షలు చాలా వరకు కొనసాగిస్తామని తాలిబన్లు చెబుతున్నారు” రేడియోలో విన్న విషయాలు చెప్పుకుపోతున్నాడు

“ఇవన్నీ అక్కడ వారికి కొత్తేమీ కాదు. ఇరవై ఏళ్ళక్రితం ఇవన్నీ జరిగినవే .. మళ్ళీ పరిస్థితి మొదలుకొచ్చిందంతే” అన్నాడు రెండో వ్యక్తి .

“ఎంత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అరాచకాన్ని ఆపే వాళ్లే లేరా .. అన్నాడు మూడో వ్యక్తి .

ఆహ్హాహ్హ్హా .. అహ్హహ్హా .. నవ్వేశాడు రెండో వ్యక్తి .
పిచ్చివాడిలా ఎందుకలా నవ్వుతున్నాడని చెట్టుకింద, చెట్టుమీద చేరిన సమస్త జీవులు అతని కేసి చూశాయి. అంతా నిశ్శబ్దం గా మారిపోయింది.

“ఇక్కడ మనవాళ్ళు ఏమన్నా తక్కువా .. తాలిబన్ల మనస్తత్వం మన వాళ్ళలో లేదా..” మిత్రుల కేసి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు రెండో వ్యక్తి .

కొద్ది క్షణాల మౌనం తర్వాత ” మన నాగరిక రాజ్యంలో , స్వతంత్ర దేశంలో మనకిష్టం ఉన్నా లేకున్నా పెద్ద నోట్ల రద్దు అంగీకరించలేదూ ..
జీఎస్టీ ఆమోదించలేదూ ..
బ్యాంకులు ప్రయివేట్ అయిపోవడం లేదూ…
ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడం లేదూ…
అంతా జనామోదం తో జరిగిందా .. జరుగుతున్నదా ..
వాళ్ళది మూర్ఖత్వం అయితే మనది నిరంకుశత్వం కాదా .. ” అన్నాడతను.

ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలలో వాళ్ళు.
టపటపా మంటూ నాలుగు చినుకులు చిలకరించిన మేఘం ఎటో కదిలిపోయింది. నీరెండ చొచ్చుకు వస్తున్నది. పచ్చటి పచ్చికపై పడి ఆగిన వర్షపు బొట్లు మిల మిల మెరుస్తున్నాయి.
వచ్చిన ముగ్గురు అగంతకులు తన దోవన తాను వెళ్లిపోయారు.

“మతోన్మాద భావజాలంతో ప్రపంచంలో మంచి ఎప్పుడైనా జరిగిందా .. మహిళా శక్తిని అణగార్చడం, ఘోరాలు చేయడం తప్ప ” అన్నది ఆడమేక

” ఏమో.. నాకయితే తాలిబన్లను బూచిగా చూపుతున్నారని అనిపిస్తున్నది. నిజానికి మీరేం భయపడకండి. దేశం నుండి పారి పోనవసరం లేదు మహిళల హక్కులు మేం గౌరవిస్తాం అని చెబుతున్నారు ” అన్నది మగమేక

“ఓ వైపు ప్రపంచమంతా మహిళల సమాన హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, భద్రత కోసం, సమ భాగస్వామ్యం కోసం పోరాడుతున్నది.

నువ్వేమో మహిళలను చీకటి కొట్లోకి విసిరేసే తాలిబన్లను సమర్ధిస్తున్నావా ..
ఓ పక్క షరియా చట్టం ప్రకారం హక్కులుంటాయని ప్రకటిస్తూనే, మహిళల హక్కులు గౌరవిస్తా మంటూనే, వాళ్ళు బురఖా వేసుకుని బయట తిరగాలని ఆదేశిస్తున్నారు . మగవాళ్ల సపోర్ట్ లేకుండా బయటికి రావద్దు అంటున్నారంటే అర్థం కావడం లేదా?

అయినా, తాలిబన్ల ఆకృత్యాలు ఆ మహిళలకు తెలియనివా .. ఇరవై ఏళ్ల క్రితం వరకు అనుభవించినవే కదా .. ఇప్పటికీ సలుపుతున్న ఆ గాయాలు పునరావృతం కావని నమ్మకం ఏమిటి? తుపాకులు ఎక్కుపెడుతూ చెప్పే వారి శాంతి వచనాలు ఎవరు నమ్ముతారట!
మళ్ళీ ఆ చెరలోకి పోవడం వల్ల, ఆ దుష్ట శక్తుల వల్ల ఆ దేశానికి ఎంత నష్టమో..

వాళ్ళకే కాదు ఇక్కడ మన దేశంలోనూ పెరిగిపోతున్న మత శక్తుల వల్ల జరిగే నష్టాన్ని కూడా ఆలోచించాలేమో.. ” సూటిగా అన్నది ఆడమేక.

“నేను అమెరికా ద్వంద నీతినే విమర్శిస్తున్నా కానీ తాలిబన్ ముష్కరులను సమర్థించడం లేదు.
సహనానికి మారుపేరుగా ఉన్న ఆఫ్ఘన్ మహిళలు దేశాన్ని కాపాడుకోవడం కోసం సైనికులకు మద్దతుగా తుపాకీ పట్టారు. లేదంటే ఇరవై ఏళ్లు వెనక్కి పోవాల్సిందే . తాలిబన్ల పాలనలో స్వేచ్ఛ ఉండదని, చదువు ఉండదని , ఉద్యోగం ఉండదని వాళ్లకు తెల్సు . దశాబ్దాల క్రితపు చీకటిని ఎదుర్కోవడానికి సైన్యానికి మద్దతుగా నిలిచారు .” అని వివరించింది మగమేక

” తాలిబన్ అరాచకాలను ఎవరైనా అడ్డుకోవాల్సిందే ” అన్నది గాడిద

మన ఇందిరాపార్కు దగ్గర పెళ్లికాని జంటలకు పార్కు లోనికి ప్రవేశం లేదని కట్టిన బానర్ వీళ్ళెవరూ చూసినట్టు లేదే..అనుకుంది వీళ్ళ మాటలు వింటున్న కాకి.

“దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, జాతులు ఏవైనా నీతిమాలిన చర్యల్ని ఖండించాల్సిందే.
సమస్య ఎవరికైతే వాళ్ళు ఉపేక్షించకుండా స్పందించాల్సిందే.
ఎదుర్కోవలసిందే.. పోరాడాల్సిందే. సమస్యకు పరిష్కారం పొందాల్సిందే ” అన్నది ఆడమేక

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో