భారత్ మణిపూ(ర్)స మీరాబాయి చాను(సంపాదకీయం)-అరసి శ్రీ

భారత్ మణిపూ(ర్)స మీరాబాయి చాను

దాదాపు రెండు దశాబ్దాల ఎదురు చూపులకి దక్కిన ఫలితం. ఒలింపిక్స్-2021 క్రీడలు మొదలైన రెండో రోజే భారత్‌కు రజత పతకం సాధించింది పెట్టింది మీరాబాయి చాను. మణిపూర్‌కు చెందిన 26 ఏళ్ల ఈ యువతి దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించి పెట్టింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం “కరణం మల్లీశ్వరి” కాంస్య పతకం తర్వాత మళ్లీ ఇంతకాలానికి మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం తీసుకొచ్చింది.

చిన్నతనం నుంచి బరువులు మోయడంలోను , పాల క్యాన్లు మోయడం మీరాబాయి చానుకి అలవాటు. వంట చెరకు కోసం కొండలు ఎక్కడం , కట్టెలు మోయడం వంటివి చేసేది. అలా కట్టెల మోయడంతో మొదలైన ఆమె పయనం ఒలంపిక్స్ వరకు సాగింది.కాని ఆర్ధికంగా లేని కుటుంబ కావడం వలన సరైన పౌష్టికాహారం కూడా ఉండేది కాదు. మొదటిలో వెదురు బొంగులలో సాధన చేసేది. అకాడమీకి వెళ్ళాలన్నా బస్సు మారి వెళ్ళడం తనకి కష్టం అయ్యేది. కాని అన్నిటిని అధిగమించి నిరంతర కృషితో ముందుకు సాగింది. చివరికి జాతీయ స్థాయిలో పతకం సాహ్దించిన తర్వాత తనకి స్పాన్సర్స్ ముందుకు రావడంతో తను వెనుతిరిగి చూసుకోలేదు.

టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించింది. మొత్తం 202 కేజీల బరువును ఆమె లిఫ్ట్ చేసింది. మొదటి స్థానంలో చైనాకు చెందిన హౌ జిహుయ్ నిలిచారు. జిహుయ్ 210 కేజీల బరువును లిఫ్ట్ చేశారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఈరోజు పతకం సాధించగలిగానని రజత పతకం సాధించిన తర్వాత మీరాబాయి వెల్లడించారు.

రియో ఒలింపిక్స్‌లో విఫలమయ్యాక వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఎలాగైనా సత్తా చాటాలన్న ఉద్దేశంతో కఠోర శ్రమ చేశానని తెలిపారు. శ్రమకు తగినట్లే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి మెడల్ సాధించారు. గతంలో కామన్ వెల్త్ క్రీడల్లోనూ పలు పతకాలు సాధించారు.

కామన్వెల్త్ క్రీడలు 2014 – రజతం , ప్రపంచ చాంపియన్ షిప్ 2017 స్వర్ణం , కామన్వెల్త్ క్రీడలు 2018 -స్వర్ణం , ఆసియా చాంపియన్ షిప్ 2020 – కాంస్యం యిప్పుడు ఒలంపిక్స్ లో రజతం సాధించారు మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి సాధించిన పతకాలకు గాను గతంలోనే ఆమెకు పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు కూడా అందుకున్నారు మీరాబాయి చాను.

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మీరాబాయి చానుకి రూ.1కోటి నజరానా ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్‌ ఉద్యోగంలో ఉన్న మీరాబాయి చానుకు ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘ఇక రైల్వే స్టేషన్లలో టికెట్లు కలెక్ట్ చేసే పని నీవు చేయవు. నీకోసం ఓ ప్రత్యేక పోస్టును రిజర్వ్ చేస్తున్నా.’అంటూ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.

స్వర్ణం కోసం ప్రయత్నించా అయినా రజతం అందుకోవడం గర్వంగా ఉంది. ఈ పతాకాన్ని దేశానికి అంకితం చేస్తున్నా, ఈ సందర్భంగా నా కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా మా అమ్మ త్యాగం వెలకట్ట లేనిది అని తని సంతోషాన్ని వ్యక్తం చేసింది మీరాబాయి చాను.

కృషి , పట్టుదల ఉంటె సాధించలేనిది ఏదీ ఉండదని అనడానికి నిలువెత్తు నిదర్శనం మీరాబాయి చాను. 

-అరసిశ్రీ 

!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో