గజల్-23  – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు. ప్రేయసి గురించి ఎంత వ్రాసినా ప్రేమికుడికి మనసుతీరదు. ప్రేయసి సందర్శనంతోనే కన్నులు వెన్నెలలకు నెలవులౌతాయని, ప్రేమ లేకుంటే మనసుకి వసంతమే లేదని ప్రేమికుడి ఆవేదన. ప్రియసఖి కొలువున్న మనసు మందిరంతో సమానమని, అందులో కొలువై ప్రియుని పూజలందుకోమని అభ్యర్థిస్తున్నాడు. ధ్యాసంతా చెలిమీదుంటే మరోధ్యాస లేకపోవడం ఆమె ప్రయోగించిన వశీకరణమంత్రమే కారణం అంటాడు చెలికాడు. తాను మాత్రం ఆమె తలపులతోనే కాలం గడుపుతుంటే ప్రేయసి కలలోనైనా తనను తలుచుకోవాలని తపిస్తున్నాడు ప్రేమికుడు. ఇలాంటి భావాలన్నీ పొందుపరచిన భావాల సమాహారం ఈ గజల్. ప్రియుడి ఆరాధనకు , ప్రేమకు దర్పణమే ఈ గజల్.

|| గజల్ ( హుస్న్ ఏ మత్లా గజల్ ) ||

కనులలోని చీకట్లను తరిమావా ఎపుడైనా ?
కనుపాపలలో వెన్నెలనొంపావా ఎపుడైనా ?

శిశిరానికి ఉద్వాసన పలికావా ఎపుడైనా ?
మనసులోన ప్రేమపూలు చల్లావా ఎపుడైనా ?

నీ ధ్యాసకు దాసుడిగా ఎలా మారిపోయానో…
వశీకరణ ప్రయోగాన్ని చేసావా ఎపుడైనా ?

నీవుండే మనసు నాకు కోవెలతో సమానమే.
నీ భక్తుడి పూజలందుకున్నావా ఎపుడైనా ?

మండుతున్న గుండెచూసి జాలి కలగదేమిటో
తొలకరిలో చిరుజల్లై తడిపావా ఎపుడైనా ?

నీపైనే వేనవేల కావ్యాలను రచించాను.
ప్రేమలేఖనొకటైనా వ్రాసావా ఎపుడైనా ?

నీ తలపులు గుండెనొదిలి పోకున్నవి “నెలరాజా”
కలనైనా నన్ను తలుచుకున్నావా ఎపుడైనా ?

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో