అమ్మ త్యాగం
ఇప్పుడు అర్ధమవుతోంది
నేను
అమ్మ నయ్యాను
****
ప్రార్ధనా మందిరాలన్నీ
‘లాక్ డౌన్ ‘
దేవుళ్లు
ఆసుపత్రుల్లో డాక్టర్లుగా
****
అమ్మనై పోయాను
ఆస్తినైనా బాగుండు
అందరు
పంచుకునే వాళ్ళు
****
పురిటి నొప్పులైనా
తగ్గలేదు…
ప్లే స్కూల్ కోసం
ఉరుకులు పరుగులు
****
‘బతుకమ్మ చీర ‘ను
చూస్తే సంబురం
నేసింది
మా సిరిసిల్ల లోనే
****
నిన్న
హనుమాజీ పేటకు వెళ్లాను
మనసూ , పాదాలూ
రెండూ పునీతమయ్యాయి
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to జరీ పూల నానీలు -3 – వడ్డేపల్లి సంధ్య