ఆ గాలి నీ తోటలోంచి
నడిచి వెళ్లింది
ఈ ఉదయం పరుచుకున్న పరిమళం
అది నీ దేహానిదే అయివుంటుంది
-ఫైజ్ అహ్మద్ ఫైజ్
మీర్! నువ్వు నేనూ
ఇక్కడ మనమందరం
అయిపోయాం కదా!
ఆమె ముంగురులకు బందలం
-మీర్ తకీ మీర్
అలా ఆమె జుట్టు విదిల్చింది
అంతే, అంధకారం అలుముకుంది
పగటి కంటే ముందు
రాత్రి కమ్మేసింది
-అజీద్ ఇలాహాబాద్
చెదురుతున్న ముంగురులు
చెంపల మీదకు రానీ
నీ ముఖం చూసి మేఘం
సిగ్గు పడి తప్పుకోనీ
-మస్ హఫీ అమ్రీహ్వీ
-అనువాదం : ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~