స్వేచ్చనివ్వని స్వాతంత్రం (కవిత) -బీర రమేష్

బీర రమేష్

బీర రమేష్

మువ్వన్నెల జెండాలా
స్వేచ్చగా ఎగరాలని
తరతరాలుగా ఎదురుచూస్తున్నవి
దేశంలో పావురాలు

అనాది ఆదిమానవుల్లో లేని అంతరం
మధ్య మనుషుల్లో ఎలా వచ్చిందని
ఆలోచిస్తున్న యువకుడికి
అది అంతుచిక్కని ప్రశ్న

స్వాతంత్య్ర అందరిదంటే
ఒప్పుకోని జనం దేశంలో ఉన్నారంటే
అది నమ్మలేని నిజం

అంతరాల ఆంక్షల అడ్డగీతల్లో
కనబడని కంచెల మధ్య
అవమానాల అగ్నిజ్వాలలు
భరిస్తూ బతుకుతున్న రెక్కలు లేని పక్షులు
జీవిస్తున్నాయంటే
అది గ్రహించాల్సిన సత్యం

విభజన శాస్త్రంలో వేసిన లెక్కల పద్దులకి
జీవిత వడ్డీలు కడుతున్న నేటితరాలు
నిర్భందంగా చెరచబడ్డ మానాలకి
ఎంత గుణించినా రాని లెక్కలు

మనిషి తత్వం చేసిన మానసికగాయాలకి
తరతరాలుగా ఆత్మాభిమానాలకి
కట్లుకట్టుకుంటున్న యువతరం

ఏకత్వం లేకుండా భిన్నంగానే
బతుకుతున్న దేశ ప్రజలు
స్వేచ్చగా ఉన్నారనుకోవడం అబద్దం

స్వేచ్చకై పోరాడి మట్టి పొరల్లో కలిసిన
వీరుల వీరత్వం ఇంకా పచ్చిగానే ఉంది
స్వేచ్చకై బిడ్డల్నిబలిదానం చేసిన
తల్లుల దుఖం ప్రవహిస్తున్న నదుల్లో
సజీవంగానే ఉంది
కాని ఇక్కడ స్వేచ్ఛ లేదు

మనిషి మనిషిని ప్రేమించడం
ఇక్కడ నేరం
అందుకు శిక్ష “మరణం”
గుర్రపు స్వారీ చేయడం పాపం
అందుకు శిక్ష
“మూకుమ్మడి రాళ్లదాడి”
నిజాన్ని నిర్భయంగా చెప్పడం నేరం
అందుకు శిక్ష
ఊపిరాడనివ్వని ఉపా చట్టం
కలిసిన మనసులు మనువాడడం
పరువుకి కలంకం
అందుకు పరువుహత్యల రక్తతర్పణం
ఆకలి చావులు ఎన్నని అడగడం తప్పు
అడిగినవాడు విగతజీవి

ఇక్కడ
తినే తిండిపై నిఘా
కట్టే బట్టపై నిఘా
నడిచే తీరుపై నిఘా
మాట్లాడే మాటపై నిఘా
బతికే బతుకుపై నిఘా
నిఘా నేత్రపు వలయాల మధ్య
కుల మతాల మంటల మధ్య
బతుకుతున్న మనుషులు
స్వేచ్చనివ్వని స్వాతంత్ర్యాన్ని
అనుభవిస్తున్నారనడం
మోసకారితనం.

– బీర రమేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో