రాసకీయం(కవిత )-బివివి సత్యనారాయణ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది
రాజకీయానికి స్వేచ్ఛా వాయువులు తెచ్చింది
ప్రజాస్వామ్యం నేతిబీర చందమయ్యింది
తెల్లవాడుపోయి, పాలన నల్లవాడికి సొంతమైనా
రాని సమానత్వం సౌభ్రాతృత్వం
వేలంవెర్రిగా వెక్కిరిస్తున్నాయి
రాజకీయం నేడు రసకంధాయంలో
పడి రాసకీయమై అసమానతల
తూకంలో తేలిపోతుంది
రాజకీయవిలువలతో కూడి
ఆస్తులు పోగొట్టుకున్న మహానుభావులెందరో
వారికి సాష్టాంగ ప్రణామాలు
నేడు వార్డు మెంబరైతేచాలు దందాల
సుగంధాలతో వెలిగిపోతుంటాడు
ఇక బడానాయకుల సంగతి మూడుపూలు
ఆరుకాయల చందమే
చుట్టూజనం , వారికి వాగ్దానాల వరం
కమీషన్ల పర్వం, అంతా అయోమయం
గందరగోళ ప్రభంజనం
జనాలను అయోమయానికి గురిచేసి
మనగలిగే నాయకగణ
మంత్రదండం అది
రాజకీయం రాచబాటలు దాటి
దొడ్డిదారులు పట్టి
చాలాకాలమే అయింది
ఐనా మనకు అర్ధం
కావడానికి ఇంకా ఎన్నోఏళ్లు పడుతుందో
వెండితెరపై వేచిచూడాల్సిందే
మన ప్రజాస్వామ్యం నేతిబీర చందమే..
పైకి ప్రజాస్వామ్యం
నడుస్తున్నది అవినీతి స్వాహారాజ్యం
దోచుకున్నోడికి దోచుకున్నంత
సామాన్యుడు నిత్య నరకప్రాయుడే!!

– బివివి సత్యనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో