తొలకరి (కవిత )- యల్ యన్ నీలకంఠమాచారి

 

 

 

 

తొలకరి తొలకరి ఓ తొలకరి
పలకరింపవా మాసీమ ఓ పరి
నీ రాక బహు చక్కగా వుందని
సహ్యాద్రుల తడుపు తున్నావని
రేపో మాపో మా సీమకు
కదలివస్తావని
ఎదురుచూస్తున్నాము మేమీ వేళ
వల్లంత కన్నుల జేసుకొని
మిన్నుపైనే చూపుల నిలిపి
తరలివచ్చే మబ్బుల గాంచుచు
ఆశగా నీరాకను స్వాగతిస్తున్నాము
నీ తొలి పలకరింపులో
మిన్ను మేలు తడవగ
దుక్కి దున్ని విత్తునాట
ఆత్రుతగా రైతన్న వున్నాడు
మబ్బుమాటు మొహం చాటేయక
తుంపరలతో మానేల తడపక
పదే పదే రైతన్నల మోసపుచ్చక
కదలిరా కదలిరా ఓ తొలకరి
వట్టిపోయిన వాగులు వంకలు
ఏండిపోయిన కుంటలు చెరువులు
ఆశగాచూస్తున్నాయి నీరాకకై
ఆ ఆశల వమ్ముసేయక కదలిరావా మరి
నీటెద్దడితోతల్లడిల్లు జనాలు
గొంతెండుకున్న మూగ జీవాలు
నోరెల్లబెట్టిన బావులు,బోరులు
బావురంటున్నాయి ఈ వేళ మరి
కాసింత చూపు మాసీమసారించి
మాసీమ ఒడిలో కాసేపు నిలిచి
ఒకింత వానచినుకల గురిపించి
మన్నునే నమ్ముకున్న హాలికుల గావుమా
మరిచి పోకుమా తొలకరి
మరిచి మరలి పోకుమా మరి
మనసున్న తరుణిగా మారి
తల్లిగా ఈబిడ్డల చింతతీర్చుమరి

– యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో