అద్దమైన “ఇద్దరు” (కవిత)చందలూరి నారాయణరావు

వేకువలో
అతడి నిద్రముఖం
రాత్రి ఆమె పెదవిముద్రలతో
మురిసిపోతుంటే

అద్దం
అతని ముఖంలో
ఆమె అందాన్ని
ఉదయకిరణాలతో స్నానమాడిస్తుంటే

ఆమెతో కలసి
తలుపు కొడుతున్న పొద్దుకు
ప్రియురాలి పరిమళాన్ని పసిగట్టిన
అతడిలో ప్రేమ
తలుపు తెరచుకుని బయటకొచ్చింది….

ముచ్చటపడ్డ అద్దం
ఇద్దరని కలిపి
“పగటి”ని బహుమతి చేసింది….

ఒకరి హృదయంలో
మరోకరు ఉదయమై
విత్తుకున్న ఓ కలను
విప్పిచెప్పుకునేలోగే

ఇంతలోనే పగలు కరిగి
రాత్రి ఇద్దరిని లోపలికి పిలిచింది.
అద్దం సిగ్గుతో ముఖం మూసుకుంది.

ఒకరు మరొకరికి
అద్దమయ్యారు…

ఒకరికొకరికి
అర్థమయ్యారు….

-చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో